తూరుపు తెలవారింది.. మంచు తెరలు తొలగాయి.. వెలుగు రేఖలు విచ్చుకున్నాయి. ఈరోజైనా తమ నిరీక్షణ ఫలిస్తుందో లేదో.. కిరణ స్పర్శ జరుగుతుందో లేదోనన్న భక్తుల ఆందోళనను పటాపంచలు చేస్తూ బాలభానుడి లేలేత కిరణాలు మెల్లగా పయనిస్తూ ఆలయ రాజగోపురంలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి అనివెట్టి మండపం మీదుగా ధ్వజస్తంభాన్ని తాకుతూ క్రమంగా గర్భగుడిలోకి ప్రవేశించాయి. మొదట ఆదిత్యుని మూలవిరాట్ పాదాలను స్పృశించి.. మెల్లగా పైకి పాకుతూ శిరసును తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించిన భక్తులు పరవశంతో స్వామివారిని తనివితీరా దర్శించుకున్నారు. భక్తిభావంతో పులకించిపోయారు.
శ్రీకాకుళం కల్చరల్: ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదా త అరసవల్లి సూర్యనారాయణస్వామి వారిని మంగళవారం లేలేత భానుడి కిరణాలు స్పర్శిం చాయి. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవసిం చారు. ఉదయం 6.21 నుంచి 6.30 గంటల వర కు సుమారు 9 నిమిషాల పాటు కిరణ దర్శనం జరిగింది. ముందుగా పాదాలను తాకిన కిరణా లు మెల్లమెల్లగా స్వామివారి శిరస్సు వరకు పయనించాయి. సోమవారం కిరణాలు తాకేం దుకు మంచుతెర అడ్డురావడంతో కిరణం తాకే సమయం మించి పోయింది.
మంగళవారం మా త్రం భానుడి లేలేత కిరణాలు ఆలయ రాజగోపుం నుంచి అనివెట్టి మండపం మీదుగా ఆవరణలోకి ప్రవేశించి ధ్వజస్తంభాన్ని దాటి స్వామివారి మూలవిరాట్ పాదాల నుంచి శిరస్సువరకు తాకిన దృశ్యాలను భక్తులు వీక్షించ రు. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. సూర్యుని గతిలో మార్పువచ్చిందని, కిరణాలు స్వామివా రి ఎడమవైపు పడ్డాయని, బుధవారం కిరణా లు స్పర్శించే అవకాశం ఉండకపోవచ్చని అర్చకులు తెలిపారు. కిరణదర్శనం కోసం కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం దంపతులు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్యామలాదేవి, ఈవో పుష్పనాథం, ఎఫ్‌పీవో జి.కొండలరావు, అధిక సంఖ్య లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
కెమెరాలు, సెల్‌పోన్‌ల చిత్రీకరణ ఆపాలి
ఆదిత్యుని ఆలయం శ్రీకాకుళంలో ఉండడం ఒక అదృష్టమైతే.. కిరణ దర్శనం ఏడాదిలో రెండుసార్లు రావడం మరింత ప్రత్యేకమని కలెక్టర్ లక్ష్మీనరసింహం పేర్కొన్నారు. ఇటువంటి అద్భుతాలు స్వయంగా చూస్తేనే అనుభూతి లభిస్తుందన్నారు. వీటిని కెమెరాలలో, సెల్ ఫోన్‌లలో చిత్రీకరణను నిషేదించాలని ఈవోను ఆదేశించారు.
ఏక్షేత్రమైనా స్వయంగా చూస్తే చూడాలని అప్పుడే మనకు వాటి విలువ తెలుస్తుందన్నారు.
ఆనందం పొందాను
అనుకోకుండా జిల్లాకు వచ్చాను. సూర్యకిరణ దర్శనం పడే సమయం కావడంతో దర్శనంకోసం వచ్చాను. చాలా ఆనందం పొందాను. కిరణదర్శనం ఎంతో ఆరోగ్యకరమని తెలిసి చూసేం దుకు వచ్చాను.
- యలమంచిలి చలపతిరావు,
హైదరాబాదు
ఓ అద్భుతం చూశాను
ఈ రోజు ఒక అద్భుతం చూశాను. నేను 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా ఇది కిరణ దర్శనానికి అవకాశం దొరక లేదు. మొదటి సారిగా చూశాను. జన్మ ధన్యమైంది. కిరణ దర్శనంతో ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆశిస్తున్నా. స్వామివా రికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిం చాను. - ఈఎస్‌ఎస్.శర్మ,
డిప్యూటీ తహశీల్దార్
కిరణ దర్శనం ఆరోగ్య దాయకం
స్వామివారి కిరణదర్శనం ఎంతో ఆరోగ్యదాయకం. ఉదయం సూర్యుని బంగారు కిరణాలు తాకడం వల్ల మనకు రోగవిముక్తి లభిస్తుంది. కిరణాలు ఆదిత్యుని పాదాల వద్ద పడడం వల్ల ఆదిత్యునికి మరింత శక్తి పెరుగుతుంది. రేపు కిరణాలు పడే అవకాశం తక్కువ.
-ఇప్పిలి శంకరశర్మ,
ఆలయ ప్రధాన అర్చకుడు
చక్కగా దర్శించుకున్నారు..
సూర్యకిరణ దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. సూర్యుడి కిరణాలు స్వామివారిని తాకిన దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించారు. ఎంతో ఆనందం పొందారు. బుధవారం కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు చేశాం.
-ఆర్ .పుష్పనాథం,
ఆలయ ఈవో
సంతోషంగా ఉంది
అన్ని గోపురాలు దాటుకుంటూ సూర్యుని కిరణాలు ఆదిత్యుని మూలవిరాట్‌పై పడే దృశ్యాన్ని చూడడం ఎంతో సంతోషంగా ఉంది. దర్శనం బాగా జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దర్శనం ఈ నాటికి కలిగింది.
- అమరావతి,
గృహిణ
అద్భుతం.. ఆదిత్యుని కిరణ దర్శనం
Published Wed, Mar 11 2015 2:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement