suryanarayana swamy temple
-
అరసవల్లి: సప్తమి దర్శనం.. ఇలా సులభతరం
అరసవల్లి(శ్రీకాకుళం): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఈ నెల 28న జరగనున్న రథసప్తమి మహోత్సవానికి సూర్యదేవాలయ ప్రాంగణ, పరిసరాలు ముస్తాబవుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల (తెల్లవారితే శనివారం) నుంచి ఆలయంలో దర్శనాలు ప్రారంభించనున్నారు. జిల్లా ఉన్నతాధికారుల సూచనల అనంతరం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రూట్ మ్యాప్‌ను బుధవారం విడుదల చేశారు. భక్తులకు వివిధ దర్శన మార్గాల వివరాలు స్పష్టంగా తెలియజేసేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో క్లాత్ బ్యానర్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. దాతల పాసులు ఆలయ అభివృద్ధికి, వివిధ రకాలుగా విరాళాలు ఇచ్చిన వారికిచ్చే డోనర్ (దాతల) పాసులున్న వారు ప్రధాన రోడ్డులో బొంపాడ వీధి కూడలి నుంచి ప్రత్యేక క్యూలైన్లో వస్తారు. ఉత్తర ద్వారం పక్కనున్న ప్రత్యేక క్యూలైన్లో ఆలయం లోపలికి వెళ్లనున్నారు. ఈ పాసుతో నలుగురికి అనుమతించనున్నారు. ఈ పాసులకు 27వ తేది అర్ధరాత్రి 12 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఉచిత దర్శనాలు అరసవల్లి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నుంచి సాధారణ (ఉచిత) దర్శనాల క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఆలయానికి ఏ వైపు నుంచి వచ్చిన భక్తులైనా ఉచిత దర్శనానికి రావాలంటే ఇదొక్కటే మార్గం. ఇంద్రపుష్కరిణికి ఆగ్నేయంగా ఉన్న మార్గం ద్వారా పుష్కరిణి చుట్టూ ఉన్న కంపార్ట్మెంట్ల నుంచి ఆలయంలోకి దర్శనాలకు వెళ్తారు. రూ.100 ప్రత్యేక టికెట్ దర్శనాలు ఈ టికెట్‌తో దర్శనాలు కూడా అరసవల్లి హైస్కూల్ నుంచే క్యూలైన్లు ప్రారంభం కానున్నాయి. వీరు మాత్రం ఇంద్ర పుష్కరిణి ఈశాన్య గేటు, కేశఖండన శాల పక్క నుంచి ఆలయంలోకి చేరుకుంటారు. ఆలయానికి ఏ వైపు నుంచి వచ్చిన భక్తులైనా రూ.100 దర్శనానికి వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం. ఉచిత దర్శన భక్తులు, రూ.100 దర్శన టికెట్లు తీసుకున్న భక్తులు వేర్వేరుగా క్యూలైన్లలో వచ్చినప్పటికీ ఆలయ ప్రధాన గోపురం ముందు ఉన్న ఒకే క్యూలైన్లో కలిసిపోయి ఒకే లైన్ ద్వారా ఆలయంలోనికి దర్శనానికి వెళ్లనున్నారు. క్షీరాభిషేక సేవ (ఇద్దరికి అనుమతి) అరసవల్లి ప్రధాన రోడ్డులో బొంపాడ వీధి కూడలి వద్ద నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా వెళ్లనున్నారు. క్యూలైన్లోనే ఈ టికెట్టును రూ.500తో కొనుగోలు చేసుకున్న భక్తులు(ఇద్దరికి అనుమతి) ఆలయ ప్రధాన ఆర్చిగేట్ మీదుగా ప్రత్యేక లైన్లో దర్శనానికి వెళ్లనున్నారు. ఈ సేవ సప్తమి రోజున అర్ధరాత్రి 12.15 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. రూ.500 విశిష్ట దర్శనం (ఇద్దరికి అనుమతి) బొంపాడ వీధి నుంచి ప్రారంభమైన క్షీరాభిషేక సేవ మార్గంలోనే వీరు కూడా వెళ్తారు. క్షీరాభిషేక సేవ అనంతరం అంటే ఉదయం 6 తర్వాత నుంచి రాత్రి 8 గంటల వరకు ఇదే లైన్లో విశిష్ట దర్శనం పేరిట (రూ.500) టికెట్టుదారులు దర్శనానికి వెళ్లనున్నారు. వి.ఐ.పి టికెట్ (ఇద్దరికి అనుమతి) ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన విఐపి టికెట్ (రూ.500)లను శ్రీకాకుళం ఆర్డీవో అనుమతితో అరసవల్లి యూనియన్ బ్యాంకులో కొనుగోలు చేసిన భక్తులు నేరుగా ఆలయ ప్రధాన ఆర్చిగేట్ నుంచి ప్రత్యేక క్యూలైన్లలో దర్శనాలకు వెళ్లనున్నారు. వీరు సుదర్శన మండపం వద్ద రూ.500 విశిష్ట దర్శనదారులతో కలిసిపోయి ఒకేలైన్లో స్వామి వారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. వీవీఐపీ భక్తులు రాష్ట్రానికి చెందిన వీవీఐపీ స్థాయి గల ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు ఆలయ ప్రధాన ఆర్చిగేటు నుంచి నేరుగా అనివెట్టి మండపం నుంచి వెళ్లి మళ్లీ అదే మార్గంలో వెనుదిరిగేలా ఏర్పాట్లు చేశారు. వీరి వాహనాలు కూడా ప్రధాన ఆర్చిగేటు వరకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిట్ మార్గం ఇక సాధారణ భక్తులు, దాతలు, రూ.100, రూ.500 దర్శన టికెట్లు, రూ.500 వీఐపీ టికెట్లు భక్తులంతా స్వామి దర్శనానంతరం ఆలయ ఎగ్జిట్ ద్వారం నుంచే నేరుగా బ్రాహ్మణవీధి మీదుగా బొంపాడ వీధి కూడలి ప్రధాన రోడ్డుకు చేరుకునేలా ఈ మ్యాప్ సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్: అరసవల్లి మిల్లు కూడలి వైపు నుంచి వచ్చిన వాహనాలన్నీ 80 ఫీట్ రోడ్డు వద్ద వాహనాల పార్కింగ్‌కు, స్థానిక పెద్దతోట వద్ద చెప్పుల స్టాండ్లకు ఏర్పాట్లు చేశారు. కళింగపట్నం రోడ్డు నుంచి అరసవల్లి వచ్చే భక్తుల వాహనాలను అసిరితల్లి ఆలయం వద్ద పార్కింగ్, చెప్పుల స్టాండ్ కోసం సిద్ధం చేశారు. ఇక మిల్లు కూడలి, డీసీఎంఎస్ కార్యాలయం, ప్రధాన ఆర్చిగేటు, అసిరితల్లి అమ్మవారి ఆలయం కూడలి, నగర పాలక ఉన్నత పాఠశాలల వద్ద పోలీస్ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు. -
శ్రీవారు స్వయంగా ప్రతిష్టించిన ఆలయం.. అందుకే ఆ గుడి ప్రత్యేకం
సాక్షి, చిత్తూరు: తిరుపతి సమీపంలోని తిరుచానూరులో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. శ్రీ పద్మావతి అమ్మ వారు ఆలయంలోని ఉప దేవాలయంలో ఇది కూడా ఒకటి. అమ్మవారి దేవాలయం వెనుకభాగంలోని పుష్కరిణికి ఎదురుగా ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు, తిరుచానూరు అమ్మవారి దర్శించుకున్న తర్వాత శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సూర్య నారాయణ స్వామి ఆలయ పురాణం తిరుచూనూరు క్ష్రేత్రం శిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహించిన పవిత్ర క్ష్రేత్రం. లక్ష్మీదేవి వ్యూగంతో భూలోకానికి విచ్చేసిన శ్రీ వేంకటేశ్వరుడు మహాలక్ష్మీ కోసం 12 ఏళ్లపాటు తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఆ సమయంలోలక్ష్మీదేవి స్వరూపమైన శ్రీ పద్మావతి దేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని నిర్మించారు. శ్రీవారు దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలు ఆ కొనలులో ప్రతిష్టించారు. శ్రీ హరి సరస్సులో పద్మాలను నాటారు. సరస్సు తూర్పు ఒడ్డున, శ్రీ హరి సూర్యుడిని (సూర్య నారాయణ స్వామి) ప్రతిష్టించాడు. వెయ్యి బంగారు తామర పువ్వులను సమర్పించి పూజించాడు. 12 సంవత్సరాల పాటు పూజించిన తర్వాత, కార్తీక సుధ పంచమి నాడు, మహా లక్ష్మీ దేవి బంగారు పద్మం నుంచి తామరలా ప్రకాశిస్తుంది. ఆ పద్మాల వికాసానికి మూలం సూర్య కిరణాలు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్టించిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సూర్య నారాయణ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైకానస ఆగముక్తంగా అర్చన, పూజా కార్యాక్రమాలు నిర్వహిస్తుంటారు. సూర్య నారాయణ స్వామి ఆలయంలో ముఖ మండపం ,అర్థ మండపం, గర్భాలయంగా మూడు భాగాలుగా నిర్మించారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉండదు. పద్మావతి అమ్మవారు, శ్రీవారి పరిణయ సమయంలో శ్రీ సూర్య నారాయణ మూర్తి అనుసంధాన కర్తగా వ్యవహరించిన నేపధ్యంలో శ్రీనివాసుడి అవతార కధా ఘట్టంలో ఎనలేని ప్రాదాన్యత ఉంది. సూర్య నారాయణ స్వామి అభిషేక సేవలు స్వామి వారికి ప్రతి ఆదివారం పంచామ్రుత అబిషేక సేవలు నిర్వహిచండం ఆనవాయితీ. ప్రతి నెల స్వామి వారి జన్మ నక్షత్రంమైన హస్తా నక్షత్రం రోజున ఆలయంలో ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరుమాడ వీధుల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రధాత అనుగ్రహం పొందుతారు. ధనుర్మాసం, రథ సప్తమి రోజుల్లో విశేష పూజలు ఆలయంలో నిర్వహిస్తారు. ఆలయంలో పూజా, వేద మంత్రాలతో సూర్యనారాయణ స్వామికి అభిషేకం చేస్తారు. పూజ ముగింపులో, ఈ పూజలో పాల్గొనే భక్తులకు తీర్థం (స్వామి అభిషేకం సమయంలో సేకరించబడింది), ప్రసాదం, పువ్వులు ఇస్తారు. స్వామి వారికి సమర్చించిన అరటి పండ్లు, తులసి, ఆఫిల్, తదితర పండ్లను ఆలయం వెలుపలి భాగంలోని గోవులకు ఆహారంగా అందిస్తారు. ఆ ద్వారా గోమాతను పూజిస్తూ ,గోమూత్రాన్ని సేకరించి తమ ఇంట్లో చల్లుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం . సూర్యనారాయణ స్వామి అభిషేకంతో ప్రయోజనాలు ►కుటుంబ శ్రేయస్సు కోసం, ప్రశాంతమైన మనస్సు, సూర్యుని గ్రహ స్థానం బలాన్ని మెరుగుపరచడానికి. ►వివాహం ఆలస్యం అవుతోంది అన్న భావన కలిగిన భక్తులు స్వామికి అభిషేకం చేయిస్తే వివాహాది కార్యాలు త్వరితగతిన అవుతాయి. ►జంటలు పిల్లలకు ఈ పూజ చేస్తారు. పెళ్లి అయిన స్త్రీలకు త్వరగా గర్బధారణ అవుతుందని భక్తుల విశ్వాసం. ►ఉద్యోగ,వ్యాపారం,ఆస్తుల క్రయ,విక్రయాల్లో అభివృద్ది కోసం వ్యక్తులు ఈ పూజ చేస్తారు. చదవండి: Nagari Hills: నగరికి ఆ పేరు.. దీని వెనుక ఇంత కథ ఉందా! -
సుమ తొలి యాంకరింగ్ ప్రోగ్రాం ఏంటో తెలుసా?
సాక్షి, అరసవల్లి: టీవీ ఉన్న ప్రతి ఇంటి వారూ ఆమెకు చుట్టాలే. బుల్లితెర వీక్షకులంతా బంధువులే. ఆమె తెలీని తెలుగిల్లు లేదంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరను రెండు దశాబ్దాలుగా మకుటం లేని మహారాణిలా ఏలుతున్న సుమ ఇటీవల అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ‘సాక్షి’తో మాట కలిపారు. తెలుగు మీరు చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఇదంతా ఎప్పుడు మొదలైంది? 1991లో దూరదర్శన్ సీరియల్స్‌లో పలు పాత్రల్లో నటించేందుకు అవకాశాలు వచ్చాయి. 1995 తర్వాత జెమిని వంటి ప్రైవేటు చానల్స్‌లో అవకాశాలు పెరగడంతో బిజీ అయ్యాను. తెలుగు సీరియల్స్‌కు అప్పుడే క్రేజ్ పెరిగింది. మీరు మలయాళీ కదా. ఇంత అచ్చమైన తెలుగు ఎలా? నిజమే కానీ.. పట్టుదలతోనే తెలుగులో పట్టు సాధించాను. పుట్టింది పెరిగింది కేరళలో అయినప్పటికీ తెలుగు అనర్గళంగా వచ్చేసింది. అప్పట్లో డబ్బింగ్‌కు ఇబ్బంది పడిన నేను ఇప్పుడు వందలాది సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తున్నాను. రాజీవ్ కనకాలతో పరిచయం ఎలా? 1994లో ఓ సీరియల్ షూటింగ్లో నన్ను తొలిసారి రాజీవ్ చూశారు. ప్రపోజ్ కూడా చేసేశారు. అప్పటికే రాజీవ్ వాళ్ల నాన్నగారు దేవదాస్ కనకాలకు ఇండస్ట్రీలో పెద్ద పేరుంది. సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా తీస్తున్నారు. అయితే 1995 తర్వాత సీరియల్స్ పెరిగాయి. వాళ్ల సొంత ప్రొడక్షన్లో మేఘమాల అనే సీరియల్లో నటించాను. అప్పుడే రాజీవ్ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. 1999లో అందరి ఆమోదంతో పెళ్లి జరిగింది. సినిమాలో హీరోయిన్గా రాణించలేకపోవడానికి కారణం? రాణించడం అని కాదు ఎందుకో కంఫర్ట్‌గా లేను. ఫ్రీడం కోల్పోయినట్లైంది. దాసరి నారా యణరావు గారి కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటించాను. అలాగే రెండు మలయాళ చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించాను. కానీ ఎందుకో ఇష్టం లేక వదిలేశాను. తర్వాత సీరి యల్స్, సినిమాలో చిన్న పాత్రలు ఇప్పుడు అవి కూడా దాదాపుగా వదిలేశాను. పూర్తిగా యాంకరింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాను. 2006లో ‘అవాక్కయ్యారా...’అనే ప్రోగ్రాంతో యాంకరింగ్ ప్రారంభించాను. పిల్లలను కూడా మీ ప్రపంచంలోకి దించేస్తున్నారా? నేనేం దింపనక్కర్లేదు. వాళ్లే దిగిపోతున్నారు. మనం ప్రోత్సహించడం వరకే(నవ్వుతూ..). పాప మనస్విని పేరుతో ప్రొడక్షన్ హౌస్, అలాగే జుజిబి టీవీ షోల నిర్వహణ, అలాగే బాబు రోషన్ కార్తీక్ హీరోగా డెబ్యూ అవుతున్నాడు. దీంతో మా ఫ్యామిలీ అంతా సినీ కళామతల్లికి సేవలోనే తరిస్తున్నామన్నమాట. అసలు ఇంత అద్భుతంగా యాంకరింగ్ చేయడం మీకెలా సాధ్యమవుతోంది? యాంకరింగ్‌కు ముందు సినిమాల్లో, సీరియల్స్‌లో నటించాను. కానీ పెద్దగా కంఫర్ట్‌గా అనిపించలేదు. పైగా మా ఆయన రాజీవ్‌కు కూడా నేను సినిమాలు చేయడం పెద్దగా ఇష్టం లేదు (నవ్వుతూ).. అందుకే యాంకరింగ్‌ను నమ్ముకున్నాను. అయితే ఇంట్లో మా అమ్మకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. అదే ఇప్పుడు నాకు యాంకరింగ్ ప్రొఫెషన్‌కు ఉప యోగపడిందని భావిస్తాను. అందుకే నాకు మా అమ్మే గురువు. ఆదిత్యుని దర్శనంపై..? నిజంగా అదృష్టం. ఎప్పటి నుంచో అ నుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. చాలా అద్భుతమైన దేవాలయం. ఇక్కడ ఆరోగ్యానికి సూర్యనమస్కారాలు చేయడంపై ప్రధాన అర్చకులు శంకరశర్మ వివరించారు. అలాగే శ్రీకూ ర్మం కూడా దర్శించుకున్నాను. జిల్లాలో పురాతన ఆలయాలపై సహాయ కమిషనర్ సూ ర్యప్రకాష్ గారు వివరాలిచ్చారు. నిజంగా శ్రీకాకుళం సుందరమైన ప్రాంతం. చదవండి: యాంకర్ సుమకు అమెరికాలో అరుదైన సత్కారం -
మూలవిరాట్‌ను తకని సూర్య కిరణాలు
-
అద్భుతం.. ఆదిత్యుని కిరణ దర్శనం
తూరుపు తెలవారింది.. మంచు తెరలు తొలగాయి.. వెలుగు రేఖలు విచ్చుకున్నాయి. ఈరోజైనా తమ నిరీక్షణ ఫలిస్తుందో లేదో.. కిరణ స్పర్శ జరుగుతుందో లేదోనన్న భక్తుల ఆందోళనను పటాపంచలు చేస్తూ బాలభానుడి లేలేత కిరణాలు మెల్లగా పయనిస్తూ ఆలయ రాజగోపురంలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి అనివెట్టి మండపం మీదుగా ధ్వజస్తంభాన్ని తాకుతూ క్రమంగా గర్భగుడిలోకి ప్రవేశించాయి. మొదట ఆదిత్యుని మూలవిరాట్ పాదాలను స్పృశించి.. మెల్లగా పైకి పాకుతూ శిరసును తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించిన భక్తులు పరవశంతో స్వామివారిని తనివితీరా దర్శించుకున్నారు. భక్తిభావంతో పులకించిపోయారు. శ్రీకాకుళం కల్చరల్: ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదా త అరసవల్లి సూర్యనారాయణస్వామి వారిని మంగళవారం లేలేత భానుడి కిరణాలు స్పర్శిం చాయి. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవసిం చారు. ఉదయం 6.21 నుంచి 6.30 గంటల వర కు సుమారు 9 నిమిషాల పాటు కిరణ దర్శనం జరిగింది. ముందుగా పాదాలను తాకిన కిరణా లు మెల్లమెల్లగా స్వామివారి శిరస్సు వరకు పయనించాయి. సోమవారం కిరణాలు తాకేం దుకు మంచుతెర అడ్డురావడంతో కిరణం తాకే సమయం మించి పోయింది. మంగళవారం మా త్రం భానుడి లేలేత కిరణాలు ఆలయ రాజగోపుం నుంచి అనివెట్టి మండపం మీదుగా ఆవరణలోకి ప్రవేశించి ధ్వజస్తంభాన్ని దాటి స్వామివారి మూలవిరాట్ పాదాల నుంచి శిరస్సువరకు తాకిన దృశ్యాలను భక్తులు వీక్షించ రు. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. సూర్యుని గతిలో మార్పువచ్చిందని, కిరణాలు స్వామివా రి ఎడమవైపు పడ్డాయని, బుధవారం కిరణా లు స్పర్శించే అవకాశం ఉండకపోవచ్చని అర్చకులు తెలిపారు. కిరణదర్శనం కోసం కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం దంపతులు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్యామలాదేవి, ఈవో పుష్పనాథం, ఎఫ్‌పీవో జి.కొండలరావు, అధిక సంఖ్య లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కెమెరాలు, సెల్పోన్ల చిత్రీకరణ ఆపాలి ఆదిత్యుని ఆలయం శ్రీకాకుళంలో ఉండడం ఒక అదృష్టమైతే.. కిరణ దర్శనం ఏడాదిలో రెండుసార్లు రావడం మరింత ప్రత్యేకమని కలెక్టర్ లక్ష్మీనరసింహం పేర్కొన్నారు. ఇటువంటి అద్భుతాలు స్వయంగా చూస్తేనే అనుభూతి లభిస్తుందన్నారు. వీటిని కెమెరాలలో, సెల్ ఫోన్లలో చిత్రీకరణను నిషేదించాలని ఈవోను ఆదేశించారు. ఏక్షేత్రమైనా స్వయంగా చూస్తే చూడాలని అప్పుడే మనకు వాటి విలువ తెలుస్తుందన్నారు. ఆనందం పొందాను అనుకోకుండా జిల్లాకు వచ్చాను. సూర్యకిరణ దర్శనం పడే సమయం కావడంతో దర్శనంకోసం వచ్చాను. చాలా ఆనందం పొందాను. కిరణదర్శనం ఎంతో ఆరోగ్యకరమని తెలిసి చూసేం దుకు వచ్చాను. - యలమంచిలి చలపతిరావు, హైదరాబాదు ఓ అద్భుతం చూశాను ఈ రోజు ఒక అద్భుతం చూశాను. నేను 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా ఇది కిరణ దర్శనానికి అవకాశం దొరక లేదు. మొదటి సారిగా చూశాను. జన్మ ధన్యమైంది. కిరణ దర్శనంతో ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆశిస్తున్నా. స్వామివా రికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిం చాను. - ఈఎస్ఎస్.శర్మ, డిప్యూటీ తహశీల్దార్ కిరణ దర్శనం ఆరోగ్య దాయకం స్వామివారి కిరణదర్శనం ఎంతో ఆరోగ్యదాయకం. ఉదయం సూర్యుని బంగారు కిరణాలు తాకడం వల్ల మనకు రోగవిముక్తి లభిస్తుంది. కిరణాలు ఆదిత్యుని పాదాల వద్ద పడడం వల్ల ఆదిత్యునికి మరింత శక్తి పెరుగుతుంది. రేపు కిరణాలు పడే అవకాశం తక్కువ. -ఇప్పిలి శంకరశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు చక్కగా దర్శించుకున్నారు.. సూర్యకిరణ దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. సూర్యుడి కిరణాలు స్వామివారిని తాకిన దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించారు. ఎంతో ఆనందం పొందారు. బుధవారం కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు చేశాం. -ఆర్ .పుష్పనాథం, ఆలయ ఈవో సంతోషంగా ఉంది అన్ని గోపురాలు దాటుకుంటూ సూర్యుని కిరణాలు ఆదిత్యుని మూలవిరాట్‌పై పడే దృశ్యాన్ని చూడడం ఎంతో సంతోషంగా ఉంది. దర్శనం బాగా జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దర్శనం ఈ నాటికి కలిగింది. - అమరావతి, గృహిణ