తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిని దర్శించుకునేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీనికి అనుగుణంగా టీటీడీ కూడా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టింది. గత నెల 8 నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలను పునరుద్ధరించగా.. జూన్‌లో 24 రాష్ట్రాలకు చెందిన భక్తులు టికెట్లు పొందారు. జూలైలో 26 రాష్ట్రాలకు చెందిన భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు చేశారు.
అన్ని టికెట్లూ ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి..
► నెలకు సంబంధించిన అన్ని టికెట్లనూ ఒకే విడతలో టీటీడీ ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతోంది. జూలైలో ఏపీ నుంచి 1,47,509 మంది టికెట్లను పొందారు.
► అరుణాచల్ ప్రదేశ్ నుంచి 614 మంది, అసోం నుంచి ముగ్గురు, బిహార్ నుంచి 10 మంది, ఛత్తీస్‌గఢ్ నుంచి 16 మంది, గుజరాత్ నుంచి 54 మంది, హర్యానా నుంచి 34 మంది, జార్ఖండ్ నుంచి ఇద్దరు చొప్పున జూలైలో టికెట్లు బుక్ చేసుకున్నారు.
► కర్ణాటక నుంచి 8,786 మంది, కేరళ నుంచి 17 మంది, మధ్యప్రదేశ్ నుంచి 65 మంది, మహారాష్ట్ర నుంచి 1,074 మంది, ఒడిశా నుంచి 69 మంది, పంజాబ్ నుంచి 13 మంది టికెట్లు పొందారు.
► రాజస్థాన్ నుంచి 19 మంది, తమిళనాడు నుంచి 5,885 మంది, తెలంగాణ నుంచి 12,113 మంది, త్రిపుర నుంచి 7 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 48 మంది, ఉత్తరాఖండ్ నుంచి ఐదుగురు, వెస్ట్ బెంగాల్ నుంచి 244 మంది, చండీగఢ్ నుంచి నలుగురు, అండమాన్ నుంచి 12 మంది, దాద్రా నుంచి ఒకరు, పాండిచ్చేరి నుంచి 108 మంది, ఢిల్లీ నుంచి 12 మంది భక్తులు టికెట్లు పొందారు.
► ఇదిలావుండగా అలిపిరి వద్ద ర్యాండమ్‌గా ప్రతి నిత్యం 100 మంది భక్తుల నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలకు పంపిస్తున్నారు.
భౌతిక దూరం తప్పనిసరి
శ్రీవారి దర్శనం కోసం ఆలయం లోపలకు వెళ్లే వైకుంఠం నుంచే భౌతిక దూరంతో మార్కింగ్‌లు, క్యూలో జిగ్‌జాగ్ ఏర్పాటు చేశారు.
► 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, పదేళ్ల లోపు పిల్లలకు దర్శనం ఉండదు.
► ఆలయంలో శ్రీవారి మూలవిరాట్ దర్శనం మాత్రమే ఉంటుంది. ఉపాలయాలైన శ్రీ వకుళామాత, శ్రీ యోగ నరసింహస్వామి, భాష్యకార సన్నిధి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు.
తిరుమలకు అన్ని రాష్ట్రాల నుంచి భక్తుల రాక
Published Sat, Jul 4 2020 4:55 AM | Last Updated on Sat, Jul 4 2020 4:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment