వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం | As the ceremony Koil Alwar Thirumanjanam | Sakshi
Sakshi News home page

వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Published Wed, Sep 9 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా సాగింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేసి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు దంపతులు శ్రీవారికి నూతన పరదాలు సమర్పించారు. చివరగా అర్చకులు అంతకుముందు గర్భాలయ మూలమూర్తిపై కప్పిన వస్త్రాన్ని తొలగించి ఆగమోక్తంగా పూజలు, నైవేద్య కైంకర్యాలు నిర్వహించారు.  ఉదయం 11 గంటల తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement