మద్యం అరువుపై ఇవ్వనందుకు.. | assassination on man | Sakshi
Sakshi News home page

మద్యం అరువుపై ఇవ్వనందుకు..

Published Thu, Mar 30 2017 1:34 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

మద్యం అరువుపై ఇవ్వనందుకు.. - Sakshi

మద్యం అరువుపై ఇవ్వనందుకు..

టెక్కలి రూరల్‌: అరువుపై మద్యం ఇవ్వనందుకు ఆగ్రహించిన ఓ వ్యక్తి దుకాణదారుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉగాది పర్వదినం నాడు టెక్కలిలో జరిగిన ఈ వివాదం స్థానికంగా చర్చనీయాంశమైంది. టెక్కలి కుమ్మరి వీధికి చెందిన పునికి జనార్దనరావు పాతబస్టాండ్‌ వద్ద ఉన్న ఎస్‌ఎస్‌డీ మద్యం దుకాణంలో సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం హరిజనవీధికి చెందిన కోమ్ము హేమంత్‌కుమార్‌ మద్యం కోసం హరి అనే వ్యక్తిని వైన్‌షాపునకు పంపించాడు. అయితే అరువుపై మద్దం ఇచ్చేందుకు జనార్దనరావు వ్యతిరేకించాడు. ఈ విషయం తెలుసుకున్న హేమంత్‌కుమార్‌ ఆగ్రహంతో దుకాణానికి బయలుదేరాడు. తనకు మద్యం ఎందుకు ఇవ్వలేదని బెదిరిస్తూ తనతో తెచ్చుకున్న చిన్నపాటి కత్తితో జనార్దనరావుపై దాడి చేసి గొంతు కోశాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుడిని టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు టెక్కలి ఎస్‌ఐ జి.రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యాయత్నానికి పాల్పడిన హేమంత్‌కుమార్‌ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement