చైతన్యపురి (హైదరాబాద్) : హైదరాబాద్లోని ఒక వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార గృహ నిర్వాహకుడు, వ్యభిచారానికి పాల్పడుతున్న ఒక మహిళతో పాటు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి వ్యభిచార గృహ నిర్వాహకుడిని, ఒక మహిళ, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా విటుడు నగరంలోని ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉజ్వల కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ సురేందర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి వద్ద నుంచి 5 సెల్‌ఫోన్లు, రూ.15,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.