చీపురుపల్లి : తపాలా శాఖ ఖాతాదారులు సౌకర్యార్థం పోస్టల్ కార్యాలయూల్లో ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు శ్రీకాకుళం తపాలా శాఖ సూపరింటెండెంట్, విజయనగరం, పార్వతీపురం డివిజన్ల ఇన్‌చార్జి జనపాల ప్రసాద్‌బాబు చెప్పారు. ఇక్కడి సబ్ పోస్టల్ కార్యాలయూన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి పోస్టల్ కార్యాలయూల్లో త్వరలో ఏటీఎంలు ప్రారంభించనున్నట్టు చెప్పారు.
విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి పోస్టల్ కార్యాలయూల్లో ఇప్పటికే మీసేవా విభాగాలు ప్రారంభించామన్నారు. మీ సేవా ద్వారా అందించే సేవలన్నీ తమ కార్యాలయూల్లోనే ఇక నుంచి అందనున్నాయని తెలిపారు. తపాలా శాఖ ఆధ్వర్యంలో మైస్టాంప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. మైస్టాంప్ పథకం ద్వారా సామాన్యుని ఫొటో కూడా స్టాంపుపై వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఒక వ్యక్తి రూ.300 చెల్లిస్తే ఐదు రూపాయల విలువ గల 12 స్టాంపులు ఆ వ్యక్తికి అందజేయడమే కాకుండా ఆ స్టాంపులపై ఆయన ఫొటోను ముద్రించనున్నట్టు తెలిపారు. తపాలా శాఖ ఆధ్వర్యంలో ఆశీర్వాదం పథకం కూడా అమల్లో ఉందన్నారు.
దీని ద్వారా ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెలవారీ మనియూర్డర్ చేస్తే వారికి తిరిగి అక్కడి ప్రసాదం, దేవుని ఫొటో అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరసవల్లి, శ్రీకూర్మాం ఆలయూలకు మనియూర్డర్ చేసే భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
పోస్టల్ కార్యాలయూల్లో ఏటీఎం సేవలు
Published Sat, Aug 23 2014 3:02 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
Advertisement