ఏయూక్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం మంగళవారం సాయంత్రం సందర్శించింది. ఆస్ట్రేలియా ట్రేడ్ కమిషనర్ టామ్ కాల్డర్, బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ (ఆస్ట్రేలియా ప్రభుత్వం) రామకృష్ణ దస్త్రాలలు వర్సిటీ రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణతో సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలతో ఏయూ సంయుక్తంగా పనిచేయడానికి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ విభాగాలలో కోర్సుల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ద్వారా అందిస్తున్న కోర్సులు, విద్యార్థుల సంఖ్య, కళాశాల సామర్ధ్యాలు వంటి అంశాలను రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు వివరించారు.
పలు విదేశీ విశ్వవిద్యాలయాలు ఏయూతో కలసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్.వి.రామచంద్రమూర్తి, విదేశీ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య బి.మోహనవెంకటరామ్, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య డి.ఎస్.ఆర్.మూర్తి, ఆర్కిటెక్చర్ విభాగాధిపతి రేవతి, మీడియా రిలేషన్స్ అసోసియేట్ డీన్ చల్లా రామకృష్ణ, వాణిజ్య నిర్వహణ విభాగాధిపతి ఎం.మధుసూదన రావు, పీఆర్‌వో మార్కండేయులు పాల్గొన్నారు.
ఏయూను సందర్శించిన ఆస్ట్రేలియా బృందం
Published Tue, Nov 24 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM
Advertisement