వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని సూర్యపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పుట్లూరు నుంచి సూర్యపల్లి వెళ్తున్న ఆటో గ్రామం సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పెద్దిరాజు(55) మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఆటో బోల్తా ..వ్యక్తి మృతి
Published Tue, Feb 16 2016 7:31 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement