బీటెక్ పరీక్ష ల షెడ్యూల్ విడుదల
Published Wed, Mar 12 2014 3:56 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: వర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించనున్న బీటెక్ కోర్సు పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం సీఈ డి.సత్యనారాయణ విడుదల చేశారు. బీటెక్ 4/4, బీటెక్ రెండో సెమిస్టర్ రెగ్యులర్ , 3/4 బీటెక్ మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి, 4/4 బీటెక్ మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ, 3/4 బీటెక్ రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఏప్రిల్ పదో తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 20 ఆఖరు తేదీ. 100 రూపాయల అపరాధ రుసుంతో 22 తేదీ వరకు చెల్లించవచ్చు. కళాశాలలు నామినల్ రోల్స్‌ను ఈనెల 24 తేదీలోగా సమర్పించాలి. పరీక్ష ఫీజు 4/4 బీటెక్ కోర్సులకు ఒక్కో సెమిస్టర్‌లో అన్ని సబ్జెక్టులకు రూ.760, 3/4 బీటెక్ కోర్సులకు ఒక్కో సెమిస్టర్‌లో అన్ని సబ్జెక్టులకు రూ.685గా నిర్ణయించారు. ఒక్కో ప్రాక్టికల్ పరీక్ష ఫీజు రూ.185, బెటర్‌మెంట్ ఫీజు రూ.265, ఒరిజినల్ డిగ్రీ ఫీజు రూ.375, కన్సాలిడేట్ మార్కుల జాబితా ఫీజు రూ. 1365 అదనంగా చెల్లించాలి.
ఎల్‌ఎల్‌బీ పరీక్షల షెడ్యూల్..
వర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కానున్న మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 4,6వ సెమిస్టర్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 4, 8, 10 సెమిస్టర్ల పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం సీఈ డి. సత్యనారాయణ విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 28 ఆఖరు తేదీ. 100 రూపాయల అపరాధ రుసుంతో ఏప్రిల్ 7వ తేదీ వరకు చెల్లించవచ్చు. కళాశాలలు సంబంధిత నామినల్ రోల్స్‌ను ఏప్రిల్ తేదీలోగా యూనివర్సిటీకి సమర్పించాలి. పరీక్షలు ఈ ఏడాది 21వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పరీక్ష ఫీజు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 4వ సెమిస్టర్, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులోని 6, 8వ సెమిస్టర్లు ఒక్కో దానిలో అన్ని సబ్జెక్టులకు రూ. 365, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ఆరో సెమిస్టర్, ఐదేళ్ల పదో సెమిస్టర్‌లో ఒక్కో దానిలో అన్ని సబ్జెక్టులకు రూ. 585 చెల్లించాలి. రెండు సబ్జెక్టులకు రూ.225, మూడు పేపర్లకు రూ. 275 చెల్లించాలి. బెటర్‌మెంట్ ఫీజు రూ. 225 నిర్ణయించారు.
స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికెట్ కోర్సు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే ఆరు వారాల స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికెట్ కోర్సు ఈ ఏడాది కూడా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నామని వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ ఆచార్య వై. కిషోర్ తెలిపారు. కోచింగ్ మేనెల 15 తేదీ నుంచి జూన్ 24 తేదీ వరకు అథ్లెటిక్స్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో , సాఫ్ట్‌బాల్ క్రీడాంశాల్లో ఉంటుందని తెలిపారు. క్రీడల్లో ప్రావీణ్యం ఉండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 20 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు అర్హులని తెలిపారు. అప్లికేషన్ ఫారం తదితర వివరాలను ఠీఠీఠీ.టజీట.ౌటజ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని చెప్పారు. వివరాలకు 8331852264, 8331852265 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement