
'చంద్రబాబు మళ్లీ మోసం చేశాడు'
ప్రకాశం: మాదిగల్లో తానే పెద్ద మాదిగనవుతానని గత ఎన్నికల్లో మాదిగల ఓట్ల కోసం ఏపీ సీఎం చంద్రబాబు మాటలు చెప్పి తమను మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. అంతేకాకుండా మాదిగ రిజర్వేషన్లను వ్యతిరేకించేవారిని టీడీపీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఇలా అడుగడుగునా చంద్రబాబు మాదిగలను దారుణంగా మోసం చేస్తూనే ఉన్నారని మందకృష్ణ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మాదిగల రిజర్వేషన్ బిల్లు పెట్టకపోతే లక్షలాది మంది మాదిగలతో కలిసి ఉద్యమం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.