
24 వేళ్లతో జన్మించిన శిశువు
విజయనగరం, పార్వతీపురంటౌన్: పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 24 వేళ్లతో శిశువు జన్మించింది. మండలంలోని మరికి గ్రామానికి చెందిన బి.లావణ్య మొదటి కాన్పులో 24వేళ్లతో ఉన్న శిశివుకు జన్మనిచ్చిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వాగ్దేవి తెలిపారు.చేతులు, కాళ్లకు ఆరు చొప్పున వేళ్లు ఉన్నాయన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. జన్యుపరమైన కారణాలవల్ల ఇటువంటి అరుదుగా జరుగుతాయని తెలిపారు. లావణ్య ఆడపడుచుకు కూడా ఇలాగే 24 వేళ్ల ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment