సాక్షి, ప్రకాశం : గత టీడీపీ హయాంలో నియోజకవర్గానికి కనీసం తాగు నీరు కూడా ఇవ్వలేకపోయారని మంత్రి బాలినేని శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలకు మేరకు అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జిగా బాచిన కృష్ణ చైతన్యను నియమించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గరటయ్య తరఫున ఆయన కుమారుడు కృష్ణచైతన్య కీలకంగా వ్యవహరించారు. తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఈయన నియామకం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి బాలినేని మాట్లాడుతూ.. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒంగోలుకి మంచి నీటి సమస్య లేకుండా చూస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో కేవలం కమీషన్లు మాత్రమే రాజ్యమేలేవని, కానీ నేడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం చెప్పటిన జీ ప్లస్ ఇళ్ల నిర్మాణం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నేతృత్వంలో పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు' మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment