హిందూపురం నేతలతో బాలకృష్ణ భేటి!
హిందూపురం నేతలతో బాలకృష్ణ భేటి!
Published Thu, May 29 2014 1:15 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
హిందూపురం: నియోజకవర్గ నేతలతో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సమావేశమయ్యారు. హిందూపురం నియోజకవర్గ అభివృద్దిపై నేతలతో బాలకృష్ణ చర్చలు జరిపారు.
తాజా ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన కార్యకర్తలను, నేతలను బాలకృష్ణ అభినందించారు. నియోజకవర్గంలోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని నేతలకు బాలకృష్ణ సూచించారు. సమావేశం ముగిసిన తర్వాత హిందూపురం నేతలకు బాలకృష్ణ విందు ఏర్పాటు చేశారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బాలకృష్ణ పోటి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సమీప ప్రత్యర్ధి నవీన్ నిశ్చల్ పై విజయం సాధించారు.
Advertisement
Advertisement