హైకోర్టు ఆదేశాలతో జిల్లాలో సందడి
రాజకీయ పార్టీలలో అలజడి
అప్రమత్తమైన ఆశావహులు
వాడీవేడిగా మొదలైన చర్చ
వెంటాడుతున్న సందేహాలు
కార్పొరేషన్, న్యూస్‌లైన్:
రానున్న నెల రోజులలో మున్సిపల్ ఎన్నికలు కచ్చితంగా నిర్వహిం చాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన గట్టి ఆదేశాలతో జిల్లాలో వాతావర ణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఎన్నికలను పార్లమెంటు, అసెంబ్లీ సాధారణ ఎన్నికల తర్వాతే నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. మున్సిపల్ ఎన్నికల మాటే మరిచిపోయారు. ఆశావహులు వారి సొంత పనులలో పడిపోయారు. ఈ క్రమంలో రానున్న నెల రోజులలొ కచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిం చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఆకస్మాత్తుగా గట్టి ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఎన్నికలో పోటీ చేయాలనుకున్నవారిలో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది.
పాలకవర్గాలు లేక
దాదాపు మూడున్నరేళ్లుగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేకుండా పోయాయి. అభివృ ద్ధి కుంటుపడింది. ప్రత్యేకాధికారుల పాలనలో, రాజ కీయ జోక్యం లేకుండా నగరం, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురయ్యింది. జిల్లాలోని నగరపాలకసంస్థ, కామారెడ్డి, బో ధన్ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు 2010 సె ప్టెంబరు 30తో ముగిసింది. ఆర్మూర్ మున్సిపాలిటీ పాలకవర్గం గత యేడాది జూన్ 30తో ముగిసింది. అ ప్పటి నుంచి మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
అప్పుడు జరపాలనుకున్నా
గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసిం ది. అందులో భాగంగా మున్సిపాలిటీలలో వార్డులకు రిజర్వేషన్ల ప్రక్రియ సైతం పూర్తి చేసింది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ల డివిజన్ల రిజర్వేషన్ల ప్రకటన కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రాష్ట్రంలో విభజన అంశం ఊపందుకోవటం, ఏపీఎన్‌జీవోలు సమ్మె ఉ ధృతం చేయటంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిం ది. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ సాధారణ ఎన్నికలు దగ్గర పడటంతో వచ్చే ఎన్నికలురెండు రాష్ట్రాలో జరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంది. దాంతో పార్లమెం టు, అసెంబ్లీకి ఎన్నికలు జరిగాకే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని అంత భావించారు. హైకోర్టు ఆదేశాల తో మరోసారి బల్దియా ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది.
సర్కారు ‘సుప్రీం’కు వెళ్తుందా
రాష్ట్రంలో వచ్చే నెల రోజులలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్న ఆదేశాలతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అశవాహులు ఎదురు చూస్తున్నారు. అసలు మున్సిపల్ ఎన్నికలు నెల రోజు లలో నిర్వహించటం సాధ్యమయ్యేనా అన్న చర్చ వా డివేడిగా అప్పుడే మొదలయ్యింది. హైకోర్టు ఇచ్చిన ఆ దేశాలపై ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరింత స మయం కోరేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంటుందని కొందరు అభిప్రాయపడుతున్నా రు. ఈ నెల ఆరు నుంచి ఏపీఎన్‌జీవోలు సమ్మెకు దిగనున్నారు. ఈ పరిస్థితులలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందేహం కలుగుతోంది.
బల్దియా పోల్ జరిగేనా!
Published Tue, Feb 4 2014 3:36 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement