బంద్ విజయవంతం
Published Fri, Feb 14 2014 2:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్/శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: పార్లమెంట్‌లో రాష్ర్ట పునర్విభజన బిల్లును ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ఇచ్చిన జిల్లా బంద్ పిలుపు విజయవంతమైంది. గురువారం జిల్లాలో చేపట్టిన బంద్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జయప్రదం చేశాయి.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో...
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి పిలుపు మేరకు శ్రీకాకుళంలో పార్టీ నాయకులు వరుదు కళ్యాణి, వైవీ సూర్యనారాయణ, దు ప్పల రవీంద్ర, హనుమంతు కిరణ్, ఎం.వి.పద్మావతి, మామిడి శ్రీకాంత్ తదితరులు వేకువజామునే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. డే అండ్ నైట్ కూడలి వద్దకు చేరుకుని మానవహారం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్దకు చేరుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగులు విధులు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పాలకొండలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వసరాయి కళావతి, పార్టీ లీగల్‌సెల్ కన్వీనర్ చందక జగదీష్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు, నాయకులు డి.భవానీశంకర్, చంద్రమౌళి, నర్తు చంద్రమౌళి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కాశీబుగ్గలోని మూడు రోడ్ల కూడలి వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు కాశీబుగ్గ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. నరసన్నపేటలో వైఎస్సార్ కూడలి వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ నాయకులు ధర్మాన రామలింగంనాయుడు, ఏఎంసీ చైర్మన్ చీపురు కృష్ణమూర్తి, సురంగి నర్సింగరావు, ఎ.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు, కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు పీఎంజె బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ జి.టి.నాయుడు పాల్గొన్నారు.
విద్యాసంస్థల మూసివేత
జిల్లాలో పలు విద్యాసంస్థలు ముందుగానే సెలవును ప్రకటించాయి. తెరిచి ఉన్న విద్యాసంస్థలను మూసివేయాలని రాజకీయ పార్టీల నాయకులు, ఎన్జీవో సంఘాల ప్రతినిధులు కోరడంతో మూసివేశారు. జిల్లా కేంద్రంలో సినిమా హాళ్ళు, పెట్రోలు బంక్‌లు మూతపడ్డాయి. తెరిచిన పెట్రోలు బంక్‌లను కూడా సమైక్యవాదులుమూసివేయించారు.చిత్ర ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు సినిమా హాళ్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రేక్షకులు వెనుదిరిగారు. బంద్‌తో పట్టణంలోని రోడ్లన్నీ బోసిపోయాయి. ప్రధాన రోడ్లలో గల దుకాణాలు, షోరూంలు, హోటళ్ళు, వివిధ సంస్థలు మూతపడ్డాయి. శ్రీకాకుళంలోని రైతుబజారు, పొట్టిశ్రీరాములు మార్కెట్‌లో దుకాణాలను మూసివేశారు.
అక్కడక్కడ తెరిచిన దుకాణాలను సమైక్యవాదులు మూసివేయించారు. బంద్ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాల యాలు, ప్రభుత్వ, ప్రైవే టు కళాశాలలు మూతపడ్డాయి. జిల్లాపరిషత్, కలెక్టరే ట్, డీఆర్‌డీఏ కాంప్లెక్స్, పోస్టల్, బ్యాంకులు, బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ తదితర కార్యాల యాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. డీఆర్‌డీఏ కాంప్లెక్స్, కలెక్టరేట్ కార్యాల యా న్ని, రెవిన్యూ సర్వీసుల సంఘ సిబ్బంది వెళ్ళి వాటిని మూసివేయించారు. కళాశాలల కు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు వెళ్ళి మూసివేయించారు. కార్యక్రమంలో జి.పురుషొత్తం, జె.ఎం.శ్రీనివాస్, టి.కామేశ్వరి, అబ్దుల్ రెహమాన్, చల్లా అలి వేలు మంగ, మామిడి శ్రీకాంత్, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు చౌదరి పురుషోత్తమనాయుడు, హనుమంతు సాయిరాం, జామి భీమశంకర్, డి.వెంకట్రావు, పి.జయరాం, పి.జానకిరాం, ఎల్.జగన్‌మోహనరావు, కొం క్యాణ వేణుగోపాల్, ఆర్.వేణుగోపాల్, శిష్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నేతలు...
సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ నేతలు మొక్కుబడిగా పాల్గొన్నారు. కాంప్లెక్స్ వద్ద ధర్నా చేస్తున్న సమైక్యవాదులు, వైఎస్సార్‌సీపీ నాయకుల వద్దకు టీడీపీ నాయకులు చౌదరి నారాయణమూర్తి, తదితరులు వచ్చి కూర్చుని వెళ్లిపోయారు. తర్వాత వారి జాడ కనిపించలేదు.
ప్రయాణికుల ఇక్కట్లు
బంద్ సందర్భంగా బస్సులన్నీ నిలిచిపోవడం తో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఖాళీగా ఉంది. ఆర్టీసీ కార్మికులు వచ్చినా బస్సులు కదలకపోవడంతో అందులోనే వారు సేదతీరారు. బస్సు లు తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల యజమానులు అధిక మొత్తంలో వసూలు చేశారు.
Advertisement