భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భద్రాచలం డివిజన్‌లో సోమవారం చేపట్టిన బంద్ విజయవంతం అయింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. భద్రాచలం డిపో నుంచి ఆర్టీసీ బస్సులు బయటికి రాలేదు.
మేడారం వెళ్లే ప్రత్యేక బస్సులు సైతం నిలిచిపోయాయి. టీజేఏసీ, అఖిలపక్ష నాయకులు ప్రభు త్వ, ప్రైవేటు కార్యాలయాలను మూసివేయించా రు. బస్సులు కదలకుండా ఉదయమే బస్టాండ్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్‌ను ము క్కలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటే జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిం చారు.
పోలవరం ప్రాజెక్టు పేరుతో జిల్లాను వేరు చేయాలని కుట్ర పన్నుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించేది లేదని హెచ్చరించా రు. మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ...భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రలో కలిపే చర్యలను మానుకోవాలని కోరారు. కార్యక్రమం లో నాయకులు బండారు రవికుమార్, ఏజె రమేష్, వై.రవికుమార్, బ్రహ్మచారి, ముర ్లపాటి రేణుక, శేషావతారం, తిలక్, గడ్డం స్వామి, శరత్, సత్యాలు పాల్గొన్నారు.
బంద్ విజయవంతానికి టీజేఏసీ ర్యాలీ...
బంద్ విజయవంతం కోరుతూ టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం మోటార్ సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. కొన్ని చోట్ల విధుల్లో ఉన్న సిబ్బందిని బయటకు పంపించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సంఘం జిల్లా కోశాధికారి ఎస్‌కే గౌసుద్దీన్, టీజేఏసీ నాయకులు సోమశేఖర్, బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు, ఐటీడీఏ రాంబాబు, వెక్కిరాల పాల్గొన్నారు.
సీపీఐ, టీడీపీ ఆధ్వర్యంలో...
టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఫణీశ్వరమ్మ మాట్లాడుతూ గిరిజనులను పోలవరంలో ముంచే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలివెల శ్రీధర్, కుంచాల రాజారామ్, కొడాలి శ్రీనివాసన్,టీవీ, సునీల్ పాల్గొన్నారు.
ఎన్డీ ఆధ్వర్యంలో ర్యాలీ...
భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని పోల వరం ముంపు గ్రామాలను తెలంగాణాలోనే కొనసాగించాలంటూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ.. బంద్‌కు సహకరించిన అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కెచ్చెల కల్పన, లక్ష్మన్, మధు, శ్రీను, సోమరాజు, ముత్తయ్య, మడకం దేవా, సంధ్య, జ్యోతి, భద్రమ్మ పాల్గొన్నారు.
టీఆర్‌ఎల్‌డీ ర్యాలీ..
తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ ఆధ్వర్యంలోనూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మహిసాక్షి రామాచారి మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచేలా నిర్ణయం తీసుకునేంతవరకూ ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు. పోలవరం నిర్మాణంతో గిరిజనులు, దళితులు, పేదలు నిలువ నీడ లేకుం డా జల సమాధి అవుతారని ఆవేదన వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో నాయకులు అలవాల రాజామాదిగ, పులిపాటి భాస్కర్, బ్రహ్మాజి, అశోక్, రాజ్‌మకుమార్, సంపత్, సునిల్, ఆదివాసీ నాయకులు సోడె చల పతి, కృష్ణ, కొమరం రాంగోపాల్ పాల్గొన్నారు.
కొండరెడ్ల ధర్నా...
పోలవరం ప్రాజెక్టు తమకొద్దంటూ ఆదివాసీ కొండరెడ్ల సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ముర్ల రమేష్ మాట్లాడుతూ....రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీల సమాధులపై పోలవరం పునాదులు వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణాలోని రాజకీయ పార్టీలు సైతం పోలవరంపై నోరు మెదపటం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో చిప్పల కొమ్మిరెడ్డి, లచ్చిరెడ్డి, రమణారెడ్డి, లింగారెడ్డి, మడివి నెహ్రు, వెంకటలక్ష్మీ, హరిణి పాల్గొన్నారు.
జీవోఎంకు శవయాత్ర...
ఆదివాసీ విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జీవోఎం కమిటీ శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. కార్యక్రమంలో ఆత్రం నవీన్, చలపతి, గొంది సమ్మయ్య, ముత్తేష్, బషీర్, రాంగోపాల్, బాల కృష్ణ, శైలజ, దీప్తి, రమణ, ఝాన్సీ పాల్గొన్నారు.
సమస్యలపై పోరాడాలి ...
అన్ని పార్టీల నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ముంపు ప్రాంతాల సమస్యలపై పోరాడాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివి జన్ అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం భద్రాచలంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతి భద్రత, అభివృద్ది, మనుగడ కోసం అన్ని పార్టీలూ పోరాడాలని కోరారు. కార్యక్రమంలో కుంజా శ్రీను, రమాదేవి, బాలరాజు, చిన్నక్క పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా నుంచి వేరుచేయొద్దు...
భద్రాచలం డివిజన్‌లోని 8 మండలాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నక్కావెంకన్న డిమాండ్ చేశారు. సోమవారం ఇక్క డ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కురినాల వెంకటేశ్వర్లు, కృష్ణ, డేగల వెంకటేశ్వర్లు, రాంబాబు పాల్గొన్నారు.
నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక రోజు దీక్ష...
భద్రాచలం డివిజన్, ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలనే జీవోఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహారదీక్ష చేశారు. వేదిక రాష్ట్ర కార్యదర్శి వివేక్ నాయక్, కన్వీనర్ గొంది వెంకటేశ్వర్లు, జిల్లా కీన్వనర్ వాసం రామకృష్ణ, .పూసం కృష్ణ దీక్షలో కూర్చున్నారు.
న్యాయవాదుల విధుల బహిష్కరణ...
భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలిపే కుట్రలకు నిరసనగా న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎం.వి. రమణారావు, కొడాలి శ్రీనివాసరావు, సాల్మన్‌రాజా, ఎం. వి. ప్రసాద్, ఎన్. శ్రీనివాసరావు, మూర్తి, పేరాల వెంకటేశ్వర్లు, చైతన్య, వసంతరావు, శ్రీనివాసాచారి, రవివర్మ, ఆదినారాయణ పాల్గొన్నారు.
బంద్ సంపూర్ణం
Published Tue, Feb 11 2014 2:51 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement