Bhadrachalam division
-
ఛాలెంజింగ్‌గా ఉంది
కాకినాడ క్రైం :కోనసీమ, మెట్ట, మైదాన ప్రాంతాలతో వైవిధ్యానికి నెలవైన తూర్పు గోదావరి జిల్లాకు రావడం ఛాలెంజింగ్‌గా ఉందని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కరణం సత్యనారాయ ణ నుంచి సోమవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటు పడతామన్నారు. చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే కోనసీమలో అలాంటిది పునరావృతం కాకుండా చూస్తామన్నారు. రాష్ట్ర విభజనతో భద్రాచలం డివిజన్లోని ఆరు మండలాలు విలీనం కావడంతో జిల్లాపై మావోయిస్టుల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా ఎస్పీ, ఓఎస్డీలతోనూ చర్చించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది అవసరమని, రిక్రూట్మెంట్ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. జిల్లా ఏజెన్సీలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగలతో పాటు మెట్ట ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. రంపచోడవరం ఏఎస్పీతో దీనిపై ఇప్పటికే చర్చించిన ట్టు తెలిపారు. నకిలీ కరెన్సీ చలామణీని అరికడతాం.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి నకిలీ కరెన్సీ రాకపై నిఘా మరింత పెంచుతామని, స్థానికంగా జిరాక్స్ తీసి దొంగనోట్లు చలామణీ చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. పెట్రో కారిడార్, సెజ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలను సామరస్యంగా పరిష్కరించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్, ఈవ్‌టీజింగ్ నిరోధంతో పా టు విజిబుల్ పోలీసింగ్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. స్టేషన్లలో సుహృద్భావ వాతావరణ ం ఉండేలా, ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసేలా చూస్తామని చెప్పారు. వివిధ శాఖల అధికారులు, ప్రజల సహకారంతో ముందు కు వెళ్తామన్నారు. జిల్లా 78వ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిప్రకాష్‌ను ఓ ఎస్డీ ప్రకాష్ జాదవ్, డీఎస్పీలు ఆర్.విజయభాస్కర రెడ్డి, ఎం.వీరారెడ్డి, వి.అరవింద్‌బాబు, బి.రవీంద్రనాథ్, సీఐలు, ఎస్సైలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. -
‘ముంపు’పై 30 నుంచి ఆందోళనలు
భద్రాచలం: ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగిన పోలవరం వ్యతిరేక ఐక్యకార్యాచరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో ముంపు మండలాల్లో తీవ్రమైన ఆందోళన నెలకొన్నప్పటికీ, దీనిపై ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయకపోవటంఢ దారుణమన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున తమ పిల్లలను ఎఢక్కడ చదివించుకోవాలో తెలియక ముంపు మండలాల ప్రజానీకం అయోమయంలో ఉన్నారన్నారు. ఈ నెలాఖరున ముంపు మండలాల్లో పదవీ విరమణ చేసే ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ముంపు మండలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని స్పష్టం చేశారు. కమిటీ చైర్మన్ వట్టం నారాయణ మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి వరుసగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఏడు మండలాల్లో బంద్‌లు, విద్యాసంస్థల బంద్‌లకు పిలుపునివ్వనున్నట్లు చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలు, గిరిజన, ప్రజా సంఘాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
ముంపు.. ముప్పు..
భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం తీసుకున్న ముంపు మండలాల బదలాయింపు నిర్ణయంతో జిల్లాలోని ఆదివాసీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఏకంగా ఏడు మండలాలను జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయటంతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. భద్రాచలం డివిజన్లోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా)మండలాలు, పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు,బూర్గంపాడు( ఖమ్మం నుంచి భద్రాచలం వచ్చేందుకు రోడ్ కనెక్టవిటీ నిమిత్తం 12 గ్రామాలు తెలంగాణలోనే ఉంచారు) మండలాల్లో గల 87 పంచాయితీలు, 324 రెవెన్యూ గ్రామాలు ఆంధ్రలో కలుస్తున్నాయి. ఈ గ్రామాల్లో నివసిస్తున్న 1,91,792 మంది జనాభా తెలంగాణ నుంచి వేరుచేయబడుతున్నారు. అపాయింటెండ్ డే అయిన జూన్ 2 తరువాత ఈ గ్రామాలను జిల్లా నుంచి వేరు చేస్తూ సరిహద్దులు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే ఈ పరిణామాలను ఈ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంపు వాసులకు కష్టకాలమే... ముంపు మండలాల్లో ముందున్నదంతా కష్టకాలమేనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వచ్చేది వర్షాకాలం.. మూడు నెలల పాటు గోదావరి పరివాహక వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక అంటువ్యాధులు కూడా విజృంభిస్తుంటాయి. రాష్ట్రంలో మలేరియా వ్యాధి పీడితులు సంఖ్య ఎక్కువగా నమోదయ్యేది ముంపు మండలాల్లోనే. గోదావరి వరదల సమయంలో ఈ మండలాలకు దారీ తెన్నూ ఉండదు. ఈ సమయంలో పునరావాస చర్యలకు అధికార యంత్రాంగం కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంటుంది. జూన్ 2 తరువాత తమను జిల్లా నుంచి వేరుచేస్తుండడంతో ఈ కష్టాలన్నీ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ముంపు ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం కేంద్రంగా చేపట్టే పునరావాస చర్యలే అంతంత మాత్రంగా ఉంటే, ఇక కాకినాడ లేదా రంపచోడవరం, పాల్వంచ డివిజన్ వాసులకు కోటరామచంద్రాపురం నుంచి చేపట్టే సహాయక చర్యలు ఏ మేరకు ఉంటాయోనని వారు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్నో చిక్కులు... రామాలయాన్ని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రమే తెలంగాణలో ఉంచుతున్నారు. పట్టణంలో అంతర్భాగంగా ఉన్న రాజుపేట, శ్రీరామ్న గర్ కాలనీలు ఆంధ్రలో కలసిపోతున్నాయి. రాజుపేట కాలనీలో ఇంటి పన్నులు సైతం భద్రాచలం పంచాయతీ వారే వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ కాలనీ సీమాంధ్రలోకి వెళుతుంది. భద్రాచలం నుంచి తెలంగాణలోనే ఉండే దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు ఆంధ్రలో ఉన్న గ్రామాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. పట్టణానికి అనుకొని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామాల పరిధిలోనే ఎక్కువగా విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్తుండడంతో ఇక్కడి విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయా లేదా అనే సందిగ్ధిత ఏర్పడింది. రామాలయం తెలంగాణలో ఉండగా, దీనికి సంబంధించి పట్టణానికి ఆనుకొని ఉన్న దేవస్థానం భూములన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి. భద్రాచలం మండల కేంధ్రం తెలంగాణలో ఉంటుండగా, మిగతా గ్రామాలన్నీ ఆంధ్రలోకి వెళ్తాయి. ఇక్కడి విద్యార్థులకు ఈ ఏడాది అడ్మిషన్లకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఎవరు జారీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. బూర్గంపాడు మండలంలోనూ ఇదే పరిస్థితి. ఇక ముంపు మండలాల్లో పనిచేసే ఉద్యోగులు డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడి వారు అక్కడే అంటుండటంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తాము ఆంధ్రలో పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం... తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భద్రాచలం జిల్లా కేంద్రం అవుతుందని అంతా భావించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేస్తామని ప్రకటించారు. కానీ డివిజన్లో నాలుగు మండలాలు వేరు కానుండటంతో ఇది భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏజెన్సీ కేంద్రంగా ఉన్న భద్రాచలంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ భవిష్యత్‌లో వేరే చోటకు తరలిపోయే ప్రమాదం ఉంది. ఏజెన్సీలో గిరిజనులు ఎక్కువగా నివసించే చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, వేలేరుపాడు వంటి మండలాలు ఆంధ్రలోకి పోతుండటంతో ఐటీడీఏను కూడా తరలిస్తారనే చర్చ సాగుతోంది. అధికారులు సైతం ఈ విషయంలో అవుననే అంటున్నారు. ఇలా ముంపు మండలాల బదలాయింపుతో భద్రాచలం అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. -
విభజన తిప్పలు!
సరిహద్దుల ఏర్పాటుపై తప్పని ఇబ్బందులు ముంపు ప్రాంత ఉద్యోగుల్లో ఆవేదన భద్రాచలం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో.. పోలవరం ముంపు పరిధిలోకి వచ్చే 211 గ్రామాలను ఖమ్మం జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి విలీనం చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావటంతో జిల్లా అధికారయంత్రాంగమంతా విభజన నివేదికల తయారీలో తలమునకలయ్యారు. జిల్లాలోని భద్రాచలం డివిజన్లోని భద్రాచలం, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో గల 98 రెవెన్యూ గ్రామాలు(123 హేబిటేషన్లు) తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయనున్నారు. అదే విధంగా పాల్వంచ డివిజన్లోని 38 రెవెన్యూ గ్రామాలు (88 హేబిటేషన్లు) జిల్లా నుంచి వేరు చేసి పశ్చిమగోదావరిలో కలపనున్నారు. మొత్తంగా జిల్లా నుంచి ఏడు మండలాల్లో గల 1,16,796 మందిని ఉభయగోదావరి జిల్లాల్లో కలిపేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. అయితే ముంపు పరిధిలో ఉన్న గ్రామాలకు సరిహద్దుల ఏర్పాటుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. భద్రాచలం, చింతూరు, బూర్గంపాడు మండలాల్లో సరిహద్దు బోర్డుల ఏర్పాటు కత్తిమీద సామేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. బూర్గంపాడు రెవెన్యూ గ్రామాన్ని బిల్లులో చేర్చటంతో దీని పరిధిలో ఉన్న లక్ష్మీపురాన్ని కూడా వేరు చేయాల్సి ఉంటుంది. ఖమ్మం నుంచి కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలానికి వచ్చేందుకు లక్ష్మీపురాన్ని దాటాల్సి ఉంటుంది. ఇది ఒకరకంగా ఇబ్బందికరమైన సమస్యే. అదే విధంగా చింతూరు మండలంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిసే చింతూరు, చట్టి గ్రామాలను దాటుకొని తెలంగాణలో ఉండే మోతుగూడెం వైపు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఎక్కడ రాష్ట్ర సరిహద్దు ఏర్పాటు చేయాలనే దానిపై కూడా అధికారులు సైతం ఆలోచనలో పడ్డారు. కాగా, విభజన నేపథ్యంలో జూన్ 2 తరువాత జిల్లాలోని 7 మండలాల్లో గల 211 గ్రామాల పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వేరు చేస్తారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ముంపు పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
కేంద్రం చర్యపై సుప్రీం కోర్టుకెళ్తాం: కేసీఆర్
-
కేంద్రం చర్యపై సుప్రీం కోర్టుకెళ్తాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడంపై టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర నిరసన తెలిపారు. కేంద్రం చర్య దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. టీ-బిల్లుకు రాష్ట్రపతి రాజముద్ర వేసిన సిరా తడి ఆరకముందే మరోమారు తెలంగాణకు అన్యాయం జరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంపై టీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని, న్యాయం జరిగేవరకు పోరాడుతుందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడమే అన్యాయమని తాము ఇంతకుముందే చెప్పామన్నారు. ఇప్పుడు ఏకంగా 7 మండలాల్ని ఆంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం అన్యాయానికి పరాకాష్ట అన్నారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే తాను ఢిల్లీలోనే కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి ఆ మండలాలను ఆంధ్రలో కలపొద్దని కోరానని చెప్పారు. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్ని హెచ్చరించినా వారు పట్టించుకోలేదన్నారు. -
రాజధానిగా బెజవాడ భేష్ అని చెప్పా: కావూరి
ఏలూరు, న్యూస్‌లైన్: సీమాంధ్ర రాజధానిని కృష్ణా నది ఒడ్డున విజయవాడలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని, ఇదే విషయాన్ని కేంద్రానికి చెప్పానని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరు సాంబశివరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి చాలా నష్టం జరుగుతుందని కేంద్ర కేబినెట్లో అనేకసార్లు చెప్పానని, అయినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని, ఇక్కడ పరిశ్రమలు నిర్మించుకోవడానికి పెట్టుబడిదారులను ప్రోత్సహించాలని కోరిన వెంటనే కేంద్రం అంగీకరించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల అక్కడి నుంచి గెలుపొందే 10 మంది ఎంపీ సీట్లతో కేంద్రంలో అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల కష్టంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను చూసి అటువంటి మహానగరాన్ని నిర్మించలేమనుకుని, డబ్బును సంపాదించుకోవడానికి తెలంగాణ ప్రాంతంలోని నాయకులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్రాన్ని కోరడం, దానికి కేంద్రం అంగీకరించడం చారిత్రాత్మక తప్పిదమని కావూరు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందంటూనే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ ఏర్పాటు గురించి మీరేమంటారు అనే ప్రశ్నకు పార్టీ పెట్టినప్పుడు చూద్దాంలే అంటూ దాటవేశారు. -
బంద్ సంపూర్ణం
భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భద్రాచలం డివిజన్లో సోమవారం చేపట్టిన బంద్ విజయవంతం అయింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. భద్రాచలం డిపో నుంచి ఆర్టీసీ బస్సులు బయటికి రాలేదు. మేడారం వెళ్లే ప్రత్యేక బస్సులు సైతం నిలిచిపోయాయి. టీజేఏసీ, అఖిలపక్ష నాయకులు ప్రభు త్వ, ప్రైవేటు కార్యాలయాలను మూసివేయించా రు. బస్సులు కదలకుండా ఉదయమే బస్టాండ్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్‌ను ము క్కలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటే జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిం చారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో జిల్లాను వేరు చేయాలని కుట్ర పన్నుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించేది లేదని హెచ్చరించా రు. మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ...భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రలో కలిపే చర్యలను మానుకోవాలని కోరారు. కార్యక్రమం లో నాయకులు బండారు రవికుమార్, ఏజె రమేష్, వై.రవికుమార్, బ్రహ్మచారి, ముర ్లపాటి రేణుక, శేషావతారం, తిలక్, గడ్డం స్వామి, శరత్, సత్యాలు పాల్గొన్నారు. బంద్ విజయవంతానికి టీజేఏసీ ర్యాలీ... బంద్ విజయవంతం కోరుతూ టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం మోటార్ సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. కొన్ని చోట్ల విధుల్లో ఉన్న సిబ్బందిని బయటకు పంపించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సంఘం జిల్లా కోశాధికారి ఎస్కే గౌసుద్దీన్, టీజేఏసీ నాయకులు సోమశేఖర్, బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు, ఐటీడీఏ రాంబాబు, వెక్కిరాల పాల్గొన్నారు. సీపీఐ, టీడీపీ ఆధ్వర్యంలో... టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఫణీశ్వరమ్మ మాట్లాడుతూ గిరిజనులను పోలవరంలో ముంచే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలివెల శ్రీధర్, కుంచాల రాజారామ్, కొడాలి శ్రీనివాసన్,టీవీ, సునీల్ పాల్గొన్నారు. ఎన్డీ ఆధ్వర్యంలో ర్యాలీ... భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని పోల వరం ముంపు గ్రామాలను తెలంగాణాలోనే కొనసాగించాలంటూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ.. బంద్‌కు సహకరించిన అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కెచ్చెల కల్పన, లక్ష్మన్, మధు, శ్రీను, సోమరాజు, ముత్తయ్య, మడకం దేవా, సంధ్య, జ్యోతి, భద్రమ్మ పాల్గొన్నారు. టీఆర్ఎల్డీ ర్యాలీ.. తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ ఆధ్వర్యంలోనూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మహిసాక్షి రామాచారి మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచేలా నిర్ణయం తీసుకునేంతవరకూ ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు. పోలవరం నిర్మాణంతో గిరిజనులు, దళితులు, పేదలు నిలువ నీడ లేకుం డా జల సమాధి అవుతారని ఆవేదన వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో నాయకులు అలవాల రాజామాదిగ, పులిపాటి భాస్కర్, బ్రహ్మాజి, అశోక్, రాజ్మకుమార్, సంపత్, సునిల్, ఆదివాసీ నాయకులు సోడె చల పతి, కృష్ణ, కొమరం రాంగోపాల్ పాల్గొన్నారు. కొండరెడ్ల ధర్నా... పోలవరం ప్రాజెక్టు తమకొద్దంటూ ఆదివాసీ కొండరెడ్ల సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ముర్ల రమేష్ మాట్లాడుతూ....రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీల సమాధులపై పోలవరం పునాదులు వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణాలోని రాజకీయ పార్టీలు సైతం పోలవరంపై నోరు మెదపటం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో చిప్పల కొమ్మిరెడ్డి, లచ్చిరెడ్డి, రమణారెడ్డి, లింగారెడ్డి, మడివి నెహ్రు, వెంకటలక్ష్మీ, హరిణి పాల్గొన్నారు. జీవోఎంకు శవయాత్ర... ఆదివాసీ విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జీవోఎం కమిటీ శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. కార్యక్రమంలో ఆత్రం నవీన్, చలపతి, గొంది సమ్మయ్య, ముత్తేష్, బషీర్, రాంగోపాల్, బాల కృష్ణ, శైలజ, దీప్తి, రమణ, ఝాన్సీ పాల్గొన్నారు. సమస్యలపై పోరాడాలి ... అన్ని పార్టీల నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ముంపు ప్రాంతాల సమస్యలపై పోరాడాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివి జన్ అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం భద్రాచలంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతి భద్రత, అభివృద్ది, మనుగడ కోసం అన్ని పార్టీలూ పోరాడాలని కోరారు. కార్యక్రమంలో కుంజా శ్రీను, రమాదేవి, బాలరాజు, చిన్నక్క పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నుంచి వేరుచేయొద్దు... భద్రాచలం డివిజన్లోని 8 మండలాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నక్కావెంకన్న డిమాండ్ చేశారు. సోమవారం ఇక్క డ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కురినాల వెంకటేశ్వర్లు, కృష్ణ, డేగల వెంకటేశ్వర్లు, రాంబాబు పాల్గొన్నారు. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక రోజు దీక్ష... భద్రాచలం డివిజన్, ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలనే జీవోఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహారదీక్ష చేశారు. వేదిక రాష్ట్ర కార్యదర్శి వివేక్ నాయక్, కన్వీనర్ గొంది వెంకటేశ్వర్లు, జిల్లా కీన్వనర్ వాసం రామకృష్ణ, .పూసం కృష్ణ దీక్షలో కూర్చున్నారు. న్యాయవాదుల విధుల బహిష్కరణ... భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలిపే కుట్రలకు నిరసనగా న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎం.వి. రమణారావు, కొడాలి శ్రీనివాసరావు, సాల్మన్రాజా, ఎం. వి. ప్రసాద్, ఎన్. శ్రీనివాసరావు, మూర్తి, పేరాల వెంకటేశ్వర్లు, చైతన్య, వసంతరావు, శ్రీనివాసాచారి, రవివర్మ, ఆదినారాయణ పాల్గొన్నారు. -
అడుగు జాగ కూడా వదలం: బలరాంనాయక్
హన్మకొండ: ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లో ఒక్క అడుగు కూడా సీమాంధ్రకు వదిలిపెట్టేది లేదని కేంద్ర మంత్రి పి బలరాంనాయక్ అన్నారు. ఆదివారం ఆయన మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ముంపు ప్రాంతాలైన భద్రాచలం, కూనవరం, వీర్‌పురం, వేలేరుపాడు, చింతూరు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు తాము ఒప్పుకోమన్నారు. అవసరమైతే పోలవరం డ్యాం ఎత్తు తగ్గించుకుని సీమాంధ్రలో ప్రాజెక్టు నిర్మిం చేలా డిజైన్‌లో మార్పు చేయాలని సూచించారు. అంతేతప్ప ఖమ్మం జిల్లాలో ఉన్న గిరిజన గ్రామాలను ముంచి ప్రాజెక్టును కడతామంటే తాము అంగీకరించమని చెప్పారు. చంద్రబాబు తెలంగాణను అడ్డుకునేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశమంతా తిరుగుతున్నాడని, దీన్ని తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు ఎందుకు అడ్డుకోవడం లేదని బలరాం నాయక్ ప్రశ్నిం చారు. రైల్వేబడ్జెట్ 2014-15లో డోర్నకల్‌లో వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి తీసుకువస్తానని, ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రులను ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేసేం దుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. -
'భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపొద్దు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై సీఎం తిరస్కార తీర్మానం ఆమోదం పొందినా తెలంగాణ ప్రక్రియ ఆగదని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు కాంతారావు, మిత్రసేన, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలని రాష్ట్రపతి, ప్రధాని, సోనియా గాంధీని కోరేందుకు టి.మంత్రుల మంతా ఢిల్లీ వెళుతున్నారని చెప్పారు. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పేరుతో భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలనడం సరికాదన్నారు. పోలవరం డిజైన్ మారిస్తే ముంపు గ్రామాలు తగ్గుతాయని సూచించారు. -
హోరెత్తిన భద్రాద్రి
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్ పరీరక్షణ ఉద్యమం కొనసాగుతోంది. టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 19వ రోజు గురువారం నాటి దీక్షల్లో వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఆసీనులయ్యారు. తెలంగాణ కుమ్మరి హక్కుల పోరాట సమితి సభ్యులు దీక్షా శిబిరం వద్ద చక్రం సహాయంతో కుండలు తయారు చేశారు. దీక్షలను టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే గౌసుద్దీన్ ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపితే సహించేది లేదన్నారు. భద్రాచలం డివిజన్లోని ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదులుకునేది లేదన్నారు. చేతివృత్తిదారులు మనుగడ సాధించాలంటే తెలంగాణలోనే భద్రాచలం ఉండాలని తెలంగాణ కుమ్మరి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాచలం ప్రాంతం విషయంలో తేడావస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు మల్లెల రామనాథం, కుమ్మరి సంఘం నాయకులు రవికుమార్, నవీన్, గంగాధర్, సతీష్, మణుగూరు మండల అధ్యక్షులు సిరికొండ వెంకట్రావు, చంద్రయ్య, బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు కె. సీతారాములు, కెచ్చెల కల్పన, ఏపీటీఎఫ్ మహిళా విభాగం అధ్యక్షులు పి.రవికుమారి, దాసరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెండోరోజుకు సీపీఎం ప్రజాసంఘాల దీక్షలు భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలోనే ఉంచాలనే డిమాండ్‌తో సీపీఎం అనుబంధ ప్రజాసంఘాలు చేపట్టిన దీక్షలు రెండోరోజుకు చేరాయి. ఈ దీక్షలకు వివిధ ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. గురువారం నాటి దీక్షలను బార్ అసోసియేషన్ స్థానిక అధ్యక్షులు కృష్ణమాచారి ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసమే భద్రాచలం ప్రాంతాన్ని ఆంధ్రలో కలపాలనే కుట్రలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో గడ్డం స్వామి, లక్ష్మి, సక్కుబాయి, రాజ, బ్రహ్మచారి, శేషావతారం, పద్మ, లీలావతి, జీఎస్ శంకర్రావు, బండారు శరత్, రఘుపతి పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలి భద్రాచలం ప్రాంత గిరిజనులను ముంచే పోలవరం ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని పొలిటికల్ జేఏసీ డివిజన్ కన్వీనర్ పూనెం వీరభద్రం కోరారు. ఆదివాసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నాల్గో రోజు దీక్షలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణలోనే కొనసాగిస్తూ ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్త రాష్ట్రంలో కూడా ఆదివాసీల హక్కుల పరిరక్షణ, గిరిజన చట్టాల అమలకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీక్షల్లో ఉపాధ్యాయులు ఉమాకిషోర్, కాక రామకృష్ణ, సోడె మల్లేష్, మచ్చ రమేష్, రాజేష్, పర్శిక రాజు, చంటి కూర్చొన్నారు. దీక్షలకు పలు సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. -
హోరెత్తిన భద్రాద్రి
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను తెలంగాణాలోనే ఉంచాలంటూ జర్నలిస్టులు చేపట్టిన బంద్ రెండోరోజైన శనివారం కూడా సంపూర్ణంగా జరిగింది. దీంతో జనజీవనం స్తంభించింది. బంద్ విజయవంతానికి జర్నలిస్టు సంఘాలు, టీజేఏసీ నాయకులు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా బస్టాండ్ ఎదుట బైఠాయించారు. బ్రిడ్జి సెంటర్లో టైర్లను కాల్చి నిరసన తెలిపారు. బంద్‌తో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సారపాక వరకే తిరిగాయి. దీంతో రామాలయానికి వచ్చే భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు కిలోమీటర్లు కాలినడకనే రావాల్సి వచ్చింది. డివిజన్లోని అన్ని మండలాల్లోనూ ర్యాలీలు, రాస్తారొకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కూనవరం మండలం మర్రిగూడెంలో రహదారిపైనే తెలంగాణ వాదులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వైద్యుల టీజేఏసీ సంఘీభావ ర్యాలీ... భద్రాచలంను తెలంగాణాలోనే ఉంచాలంటూ చేస్తున్న బంద్‌కు మద్దతుగా పట్టణ వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో కొమ్మునృత్యాలు, ఆదివాసీ గిరిజన సంప్రదాయ నృత్యాలతో అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే రాస్తారొకో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుల కన్వీనర్ కాంతారావు మాట్లాడుతూ...భద్రాచలంను పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణాలోనే ఉంచాలని, ప్రత్యేక జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు. కొనసాగుతున్న దీక్షలు... భద్రాద్రి పరిరక్షణ కోసం టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఏడవ రోజుకు చేరాయి. శనివారం నాటి దీక్షలలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉద్యోగులు, అర్చకులు, గౌతమీ బ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు కూర్చున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, ఎమ్మెల్సీ పూల రవీందర్, గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ.. భద్రాచలంను తెలంగాణకు అప్పగించకపోతే, సీమాంధ్రులను హైదరాబాద్‌లో అడుగుపెట్టనిచ్చేది లేదని హెచ్చరించారు. భద్రాచలంను తెలంగాణ నుంచి విడదీస్తే ఈ ప్రాంతం భగ్గుమంటుందన్నారు. పలు సంఘాల ర్యాలీలు.. బంద్, దీక్షలకు మద్దతుగా పలు కుల, రాజకీయ, విద్యార్థి, కార్మిక, ఉద్యోగ, వర్తక సంఘాల ర్యాలీలతో భద్రాచలం హోరెత్తింది. తెలంగాణ నినాదాలతో వీధులు మార్మోగాయి. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్, టీఆర్ఎల్డీ, టీడీపీ, బీజేపీతో పాటు వైద్యుల జేఏసీ, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, రైసుమిల్లుల అసోసియేషన్, సీఐటీయూ, నేషనల్ మజ్దూర్ యూనియన్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు వేర్వేరుగా ప్రదర్శనలు చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. జర్నలిస్టుల అరెస్టు... ఆర్టీసీ డిపో నుంచి శనివారం సాయంత్రం బయటకు వస్తున్న బస్సులను అడ్డుకున్న 17మంది జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిపై బైండోవర్ కేసు లు నమోదు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. హోర్డింగ్ పెకైక్కిన యువకులు... భద్రాచలంను తెలంగాణాలోనే ఉంచాలంటూ మామిడి పుల్లారావు, అలవాల రాజా, తమ్మళ్ల రాజేష్, గోళ్ల మహేష్, ఎండి బషీర్ అనే యువకులు అంబేద్కర్ సెంటర్ వద్దనున్న బహుళ అంతస్థు భవనంపైనున్న హోర్డింగ్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పట్టణ ఎస్సై ఎం.అబ్బయ్య అక్కడికి చేరుకొని వారితో ఫోన్లో మాట్లాడారు. అయినా వారు ససేమిరా అంటూ రెండు గంటలపాటు నిరసన కొనసాగించారు. చివరకు జర్నలిస్టులు వారితో ఫోన్లో మాట్లాడిన తర్వాత కిందకు దిగివచ్చారు. టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలలో శనివారం అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేణుగోపాలాచార్యులు, శ్రీధరాచార్యులు, కొవ్వూరి దిలీప్, రామావజ్జుల రవికుమార్, సౌమి త్రి శ్రీనివాసాచార్యుల, అమరవాది శేషగోపాలాచార్యులు, దేవస్థాన సిబ్బంది అన్నెం శ్రీనివాసరెడ్డి, పి.వెంకటప్పయ్య, కె.నిరంజన్‌కుమార్, ఎస్.ప్రభాకర్, రామిరెడ్డి, రాము, కిశోర్, రాము, కనకదుర్గా, స్వర్ణకుమారి, నాగమణి తదితరులు కూర్చున్నారు. వీరికి రామాలయ ప్రధాన అర్చకు లు పొడిచేటి జగన్నాధాచార్యులు, స్థానాచార్యు లు స్థలశాయి, టీజేఏసి నాయకులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, ఎస్కే గౌసుద్దీన్, ఈశ్వర్, కె.సీతారాము లు, రేగలగడ్డ ముత్తయ్య, ఎంపీడీవో రమాదేవి, డిగ్రీ కళాశాల ప్రిన్స్‌పాల్ వి కృష్ణ, కెచ్చెల కల్పన, కుంజా ధర్మా, బొలిశెట్టి రంగారావు, బోగాల శ్రీనివాసరెడ్డి, తాండ్ర నర్సింహారావు, సోందే వీరయ్య తదితరులు ఉన్నారు. -
స్తంభించిన భద్రాద్రి
భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలంటూ నిరసనలు మొదటిరోజు బంద్ సంపూర్ణం భద్రాచలం, న్యూస్‌లై న్: భద్రాచలంను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలనే డిమాండ్‌తో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన డివిజన్ బంద్ మొదటి రోజైన శుక్రవారం సంపూర్ణంగా జరిగింది. తెలంగాణ జేఏసీ, రాజకీయ పార్టీలు, వివిధ కుల, ప్రజా సంఘాల వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో భద్రాచలం వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జర్నలిస్టు సంఘాల నాయకులు గోదావరి వంతెన సెంటర్లో బైఠాయించి భద్రాచలంకు వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సారపాక వద్దే నిలిచిపోయాయి. దీంతో భద్రాచలం పరిసర ప్రాంతాలతో పాటు, రామాలయం దర్శనం కోసం వచ్చే భక్తులు సారపాక నుంచి మూడు కిలోమీటర్లు నడిచి వచ్చారు. పట్టణంలో ఆటోలు కూడా తిరగలేదు. బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. డివిజన్లోని ఎనిమిది మండలాల్లో కూడా బంద్ సంపూర్ణంగా జరిగింది. వాజేడులో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వెంకటాపురంలో రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. వీఆర్ పురంలో రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండ్లను నిలిపి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు ఆరోరోజుకు చేరాయి. ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు దీక్షలను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యవతి మాట్లాడుతూ భద్రాద్రి రాముడు లేని తెలంగాణ తమకు అవసరం లేదన్నారు. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. పాపికొండల విహారయాత్రకు బ్రేక్ బంద్ నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు బోట్ యజమానుల సంఘం ప్రకటించింది. దూర ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చే వాహనాలను తెలంగాణవాదులు నిలిపివేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, బంద్‌తో భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గింది. ఆలయ సమీపంలోని విస్తా కాంప్లెక్స్ దుకాణాలన్నీ మూసేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేశారు. తెలంగాణపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా భద్రాచలం, ఇల్లెందు, ఖమ్మంలలో ఆయన దిష్టిబొమ్మలను ద హనం చేశారు. నేడు, రేపూ కొనసాగనున్న బంద్ భద్రాచలంను ఆంధ్రలో కలపాలనే కుట్రలకు నిరసనగా శని, ఆదివారాల్లో కూడా బంద్ కొనసాగించనున్నట్లు జర్నలిస్టు సంఘాల వేదిక నేత బి.వి.రమణారెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి రామాలయానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించారు. బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన కోరారు. -
భద్రాచలంపై వితండవాదం వద్దు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న సరిహద్దుల ప్రకారమే రాష్ట్రాన్ని విభజించాలని, దీనిపై అభ్యంతరాలు పెట్టవద్దని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ తమ సీమాంధ్ర ప్రాంత నేతలకు విజ్ఞప్తి చేసింది. పార్టీ గతంలో రూపొందించిన రోడ్ మ్యాప్ ప్రకారమే రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందానికి నివేదికను సమర్పించాలని సలహా ఇచ్చింది. సీమాంధ్రుల సమస్యలపై తమకూ సానుకూలత ఉందని, దాన్ని చేతగానితనంగా భావిస్తే పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మంత్రుల బృందానికి అందజేయాల్సిన నివేదిక రూపురేఖలపై చర్చించేందుకు పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ మంగళవారమిక్కడ భేటీ అయింది. ఉద్యమ కమిటీ ఛైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం కీలకమైన పది అంశాలను చర్చించింది. సీమాంధ్ర ప్రాంత బీజేపీ నేతలు కోరుతున్నట్టు భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపకూడదని, దానిపై చర్చ కూడా వద్దని పలువురు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కడితే మునిగిపోయే గ్రామాలన్నీ తెలంగాణలోనే ఎక్కువగా ఉంటాయని, అయినా సీమాంధ్రప్రయోజనాల దృష్ట్యా ఆ ప్రాజెక్టుకు తాము అంగీకరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానిపై వితండవాదానికి దిగవద్దని సీమాంధ్ర నేతలకు సలహా ఇచ్చారు. హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రుల భద్రతకు తాము బాధ్యత వహిస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు అందరిదని, హైదరాబాద్‌పై పూర్తి అధికారం తెలంగాణకే ఉండాలని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పదేళ్ల పాటు కాకుండా నాలుగైదేళ్లకు కుదించేలా చూడాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. పింఛన్లు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలు రెండు రాష్ట్రాల్లోనూ అమలయ్యేలా జీవోలు జారీ చేయాలని కూడా కొందరు నేతలు సూచించారు. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటు వ్యయం మొత్తాన్నీ కేంద్రమే భరించేలా చూడాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అమలయ్యేలా చూడాలని కోరారు. రెండు మూడ్రోజుల్లో సీమాంధ్ర ఉద్యమ కమిటీతోనూ చర్చించి నివేదికను తయారు చేసి పార్టీ జా తీయ నాయకత్వానికి పంపాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కాగా, విజయవాడ నగరానికి చెందిన మాంటిస్సోరీ విద్యాసంస్థల డెరైక్టర్ అవిర్నేని రాజీవ్ బీజేపీలో చేరారు. -
ఆంధ్రలోకి భద్రాచలం డివిజన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే...పోలవరం ముంపు ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలోకి కలిపే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర సాగునీటి శాఖ అధికారుల నుంచి సేకరించినట్లు తెలిసింది. పోలవరం వల్ల ముంపునకు గురయ్యే సుమారు 277 గ్రామాల్లో దాదాపు 95 శాతం గోదావరి నదికి ఎడమ వైపున ఉన్న భద్రాచలం డివిజన్‌లోనే ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజన్ మొత్తం సీమాంధ్ర ప్రాంతంలోకి వెళ్తుంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తున్నట్టు ఇదివరకే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని అమలు చేయాలంటే...ముంపు ప్రాంతాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు. అందువల్ల భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్ర పరిధిలోకి తీసుకురావాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట గ్రామం వద్ద పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 277 గ్రామాలు, 44,574 కుటుంబాలు ముంపు బారిన పడనున్నాయి. ముంపు బాధితుల్లో అధికులు తెలంగాణ ప్రాంతం వారే కావడంతో పోలవరం ప్రాజెక్టును చాలా కాలంగా తెలంగాణ ప్రాంత నాయకులు వ్యతిరేకిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని కూడా కేంద్ర మంత్రుల బృందానికి అందించిన నివేదికలో టీ జేఏసీ కోరింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నివేదికను కోరడంతో.. ఆ వివరాలతో కూడిన ప్రత్యేక సమాచారాన్ని రాష్ర్ట ఇరిగేషన్ శాఖాధికారులు కేంద్రానికి పంపించారు. ఒకవేళ భద్రాచలం డివిజన్‌ను ఆంధ్ర ప్రాంతంలో కలిపితే.. తెలంగాణ ప్రాంతం వారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ంపై అభ్యంతరం తెలపడానికి కారణం ఉండదు. ప్రధాన ముంపు అంతా కూడా గోదావరి నదికి ఎడమవైపునే ఉంది. ఆ ప్రాంతాన్ని తెలంగాణ నుంచి విడదీయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా పోలవరం ప్రాజెక్టు ద్వారా 7.21 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి, గోదావరి నుంచి కృష్ణాబేసిన్‌లోకి 80 టిఎంసీల నీటిని తరలించడానికి అవకాశముంది. అలాగే 960 మెగావాట్ల విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయవచ్చు. -
'ఒక్క ఊరును కూడా సీమాంధ్రకు వదలం'
హైదరాబాద్ : భద్రాచలం డివిజన్ తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమని ....భద్రాచలం డివిజన్లోని ఏ ఒక్క ఊరుని కూడా సీమాంధ్రకు వదలమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణవాదులు వ్యతిరేకం కాదని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్ గాంధీని కోరుతున్నామన్నారు. స్థానికుడిగా ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీ చేయాటానికి తాను సిద్ధంగా ఉన్నానని పొంగులేటి తెలిపారు. -
భద్రాచలం డివిజన్ ఖమ్మంలోనే:దిగ్విజయ్‌సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: విశాలాంధ్ర ఏర్పాటుకు ముందు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలోనే కొనసాగిస్తూ రాష్ట్రాన్ని విభజించాలన్న ఖమ్మం కాంగ్రెస్ నేతల అభ్యర్థన పట్ల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి, ఆంటోనీ కమిటీ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్ నేతృత్వంలో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారమిక్కడ దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కూడా చాలాకాలం భద్రాచలం ఆలయ ప్రాంతం కులీ కుతుబ్‌షా, నిజాం పాలనల్లో తెలంగాణలో భాగంగా కొనసాగిందన్న చారిత్రక ఆధారాలకు సంబంధించిన పత్రాలను ఆయనకు అందజేశారు. భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించేలా కేబినెట్ నోట్ సిద్ధం చేయాలని ప్రభుత్వానికి సూచించేందుకు దిగ్విజయ్ అంగీకరించారని సమావేశానంతరం ఖమ్మం జిల్లా నేతలు వెల్లడించారు. దిగ్విజయ్‌సింగ్ కూడా రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లా నుంచి వేరు చేయవద్దని జిల్లా నేతలు కోరినట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన కేబినెట్ నోట్ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందని, ఈ నోట్ ఆధారంగా తయారయ్యే విభజన బిల్లును శాసనసభ ఆమోదం కోసం రాష్ట్రానికి పంపించాల్సి ఉంటుందని చెప్పారు. దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన వారిలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఉన్నారు. -
కొలువులకు కొదవుండదు
ఖమ్మం, న్యూస్‌లైన్: ‘అన్ని వనరులు, పరిశ్రమలు ఉన్నా ఉద్యోగ, ఉపాధి మార్గాలు లేక యువత ఇబ్బంది పడుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జిల్లా నిరుద్యోగులకు కొలువుల జాతరే ఉంటుంది. నాటి తొలిదశ ఉద్యమం, నేటి మలిదశ ఉద్యమంలో జిల్లా ఉద్యోగులు చూపిన పోరాట పటిమ, పట్టుదల ఎనలేనివి. భద్రాచలం తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమే. అక్కడి ప్రజలు, ఉద్యోగుల కూడా ఈ ప్రాంతంలోనే ఉండాలని కోరుకుంటున్నారు’ అని అన్నారు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు. తెలంగాణ పునర్నిర్మాణం, జిల్లా ప్రజలకు కలిగే లాభాలపై ఆయన ఆదివారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం భద్రాచలం ప్రాంతంపై రచ్చచేస్తున్నారని అన్నారు. పోలవరం కడితే భద్రాచలం డివిజన్లో ముంపునకు గురయ్యే గ్రామాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను పరిరక్షించడంతోపాటు, ఉద్యోగులకు మేలు కలుగుతుందని అన్నారు. తొలిదశ, మలిదశ ఉద్యమాలకు అంకరార్పణ ఇక్కడే.. ప్రత్యేత తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన తొలి, మలి దశ ఉద్యమాలకు అంకురార్పణ జిల్లా నుంచే మొదలు కావడం ఇక్కడి ప్రజలకు గర్వకారణం అన్నారు. కేటీపీఎస్, ఇతర పరిశ్రమల్లో స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడంపై నాన్ ముల్కీ గోబ్యాక్ అనే నినాదంతో ఖమ్మం గాంధీచౌక్‌లో నిరాహార దీక్ష చేసిన రవీంద్రనాధ్ రగిలించిన ఉద్యమం 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ పోరుకు ఆజ్యం పోసిందని చెప్పారు. ఐదో జోన్లో పనిచేస్తున్న ఎన్నెస్పీ ఉద్యోగులను 1985లో తెలుగుగంగ ప్రాజెక్టు పనులు జరుగుతున్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు పంపించారని, అక్కడికి వెళ్లిన తెలంగాణ ఉద్యోగులను ఆ ప్రాంత ఉద్యోగుల చులకన చేశారని అన్నారు. బట్టలు విడిపించి హేలన చేసి అక్కడ పనిచేయవద్దని వెళ్లగొట్టారని, దీనిపై ఆగ్రహించిన టీఎన్జీవో సంఘ నాయకుల అప్పటి రాష్ట్ర అధికారి స్వామినాధన్‌కు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు తెలంగాణలో ఏ ప్రాంత ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో విచారణ జరపాలని రిటైడ్ ఐఏఎస్ అధికారి జయభారత్‌రెడ్డి కమిషన్ వేశారని, ఈ విచారణలో ఖమ్మం జిల్లాలో 10 వేల మంది, తెలంగాణాలో మొత్తం 58,968 మంది స్థానికేతరులు ఉన్నారని తేలిందని వివరించారు. దీనిపై 1986 మార్చి 31న విడుదల చేసిన 610 జీవో ప్రకారం స్థానికేతరులు ఇక్కడి నుంచి వెళ్లాలని చెప్పినా నేటికీ ఒక్కరు కూడా జిల్లాను వదిలి వెళ్లలేదని అన్నారు. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన గ్లిర్‌గ్లానీ కమిటీ కూడా స్థానికేతరుల విషయం ప్రస్థావించి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని తేల్చిచెప్పిందన్నారు . చంద్రబాబు సీమాంధ్ర నాయకుడు కావడంతో తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేయలేదన్నారు. నాడు 10 వేల మంది ఉన్న స్థానికేతర ఉద్యోగులు నేడు జిల్లా వ్యాప్తంగా 40 వేలకు చేరారని తెలిపారు. ఇలా జిల్లాలోని వనరులు, ఖనిజ సంపదతోపాటు ఈ ప్రాంత ఉద్యోగులు కూడా దోపిడీకి గురయ్యారని, దీనికి వ్యతిరేకంగా వచ్చిన మలిదశ ఉద్యమంలో జిల్లా ప్రజలు, ఉద్యోగులు చూపిన పోరాట పటిమ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిందని చెప్పారు. కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు తరలించినప్పుడు బాసటగా నిలిచారని, సకల జనుల సమ్మెలో 44వేల మంది ఉద్యోగులు 42 రోజులు ఏకధాటిగా పాల్గొని రూ. 160 కోట్ల వేతనాలను త్యాగం చేశారని వివరించారు. కొత్తరాష్ట్రం ఏర్పడితే కొలువులకు కొదువలేదు.. కొత్త రాష్ట్రం ఏర్పడితే జిల్లాలోని చదువుకున్న విద్యార్థులకు వారి ప్రతిభ అధారంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని రంగరాజు చెప్పారు. జిల్లాలో ఉన్న స్థానికేతరులు వెళ్లిపోతే ఆ స్థానాలు కూడా జిల్లా నిరుద్యోగులతోనే భర్తీ చేస్తారని అన్నారు. ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నవారికి త్వరగా ప్రమోషన్లు వస్తాయన్నారు. ఇప్పటి వరకు వివిధ శాఖలో పనిచేస్తున్న 6 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. కేటీపీఎస్, బీపీఎల్, హెవీవాటర్‌ప్లాంట్, సింగరేణి, అశ్వారావుపేట వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కీలకమైన పోస్టుల్లో సీమాంధ్రులే ఉన్నారని, గేట్ కీపర్లు, అటెండర్లు మాత్రమే స్థానికులు ఉన్నారని, ప్రత్యేక రాష్ర్టంలో అన్ని స్థాయిల ఉద్యోగాలు మన ప్రాంతం వారికే వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు ఏ వనరులు లేని సీమాంధ్ర ప్రాంతంలో యూనివర్సీలు, మెడికల్ కాలేజీలు నెలకొల్పారని, మన ప్రాంతం వేరైన తర్వాత జిల్లాలో గిరిజన యూనివర్సీటీ, మైనింగ్ యూనివర్సీటీ నెలకొల్పి ఉన్నత విద్యను గిరిజనులకు అందుబాటులోకి తేవాలని అన్నారు. రాజకీయ లబ్ధికోసమే భద్రాచలంపై రచ్చ వందల సంవత్సరాలుగా తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలంపై కొందరు నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసమే రచ్చ చేస్తున్నారని రంగరాజు విమర్శించారు. భద్రాచలం డివిజన్ ప్రజలు, ఉద్యోగులు ఏనాడూ సీమాంధ్రలో కలపాలని కోరలేదన్నారు. జిల్లాలో నిర్మించే పోలవరం ప్రాజెక్టుతో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలు కనుమరుగవుతాయని, వందలాది గ్రామాలు ముంపునకు గురికావడంతో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న సుమారు 12వేల మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలన్నారు. స్వాతంత్య్రానికి ముందే ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై ఇచ్చంపల్లి, దుమ్ముగూడెం, దవళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించాలని భావించినా దవళేశ్వరం మినహా ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదని, వాటిని పూర్తి చేస్తే తెలంగాణ రతనాలు పండే నేలగా విరజిల్లుతుందని అన్నారు. -
భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో విలీనం చేయాలి
భద్రాచలం , న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేసి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలని భద్రాచలం పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భద్రాచలానికి చెందిన గిరిజన, గిరిజనేతర సంఘాలు కలిపి ఏర్పాటు చేసుకున్న భద్రాచలం పరిరక్షణ కమిటీ బుధవారం పట్టణంలోని రాజుల సత్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆ కమిటీ కన్వీనర్ పివిఎస్ విజయ్‌వర్మ మాట్లాడుతూ....1956 సంవత్సరానికి ముందు నుంచి భద్రాచలం డివిజన్ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేదని, పరిపాలనా సౌలభ్యం కోసం నాడు ఖమ్మం జిల్లాలో కలిపారని అన్నారు. నేడు అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా వెళ్తున్న భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి, అన్ని రకాల సౌకర్యాలను కల్పించటం ద్వారా స్థానిక గిరిజనులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాకాకుండా తెలంగాణలో భద్రాచలాన్ని కల్పితే భద్రాచల ప్రాంతం పూర్తిగా తమ అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నాయకులు మొదట 1956కు ముందు ఉన్న తెలంగాణ కావాలని పోరాటాలు చేసి నేడు తెలంగాణ పై మాట మార్చటం దారుణమని, ఇది ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని అన్నారు. చిల్లర వాదనలు చేసి ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తే ఇక్కడి ప్రజానీకం తీవ్రంగా ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. భద్రాచలానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి విద్యా, ఉద్యోగ, నీటి, రవాణా, ఆరోగ్య రంగాలలో ముందుకు తీసుకెళ్లడం ద్వారానే ఇక్కడ నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రాలో భద్రాచలం ప్రకటన వచ్చే వరకు సంతకాల సేకరణ, ధర్నాలు వంటి కార్యక్రమాలు అన్ని సంఘాలు, పార్టీల వారు చేయటానికి నిశ్చయించినట్లుగా ఆయన పేర్కొన్నారు. వాస్తవ కోణంలో ఆలోచించి స్థానిక ఎమ్యేల్యే, ఎంపీలు వ్యవహరించాలని లేకుంటే ఇక్కడ ప్రజానీకం దృష్టిలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏవిఎస్పి నాయకులు సున్నం వెంకటరమణ, సి వెంకన్నరాజు, మన్నెసీమ అధ్యక్షులు చిచ్చడి శ్రీరామమూర్తి, గిరిజన నాయకులు కారం సత్తిబాబు, సున్నం లక్ష్మయ్య, మర్మం నర్సింహారావు, గొంది బాలయ్య, నాగయ్య, అపక శ్రీను, తుడుందెబ్బ వీరస్వామి, ఉబ్బ వేణు, సయ్యద్ మున్నాకర్, కల్లూరి ఆదినారాయణ, కృష్ణంరాజు, కొరస రాజు తదితరులు పాల్గొన్నారు.