
'ఒక్క ఊరును కూడా సీమాంధ్రకు వదలం'
హైదరాబాద్ : భద్రాచలం డివిజన్ తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమని ....భద్రాచలం డివిజన్లోని ఏ ఒక్క ఊరుని కూడా సీమాంధ్రకు వదలమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణవాదులు వ్యతిరేకం కాదని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్ గాంధీని కోరుతున్నామన్నారు. స్థానికుడిగా ఖమ్మం లోక్సభ స్థానానికి పోటీ చేయాటానికి తాను సిద్ధంగా ఉన్నానని పొంగులేటి తెలిపారు.