కేంద్ర కేబినేట్ నిర్ణయానికి నిరసనగా నేడు జిల్లా బంద్ | Bandh today to protest against the decision of the cabinet | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినేట్ నిర్ణయానికి నిరసనగా నేడు జిల్లా బంద్

Published Fri, Dec 6 2013 2:28 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

Bandh today to protest against the decision of the cabinet

సాక్షి ప్రతినిధి, కడప : కేంద్ర కేబినేట్  తెలంగాణ బిల్లుకు ఆమోదం  తెలపడంతో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం జిల్లా బంద్‌కు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుకు నిరసనగా గండికోట ప్రాజెక్టు వద్ద వైఎస్ విజయమ్మ  శుక్రవారం చేపట్టదలిచిన ధర్నాను  వాయిదా వేశారు. రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు సమైక్యం కోరుకుంటున్నా, ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్నా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విభజన నిర్ణయానికి కేంద్ర కేబినేట్ ఆమోదించిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ  బంద్‌కు పిలుపునిచ్చింది.  జిల్లాలోని కార్మికులు, కర్షకులు, విద్యార్థులు,ఉద్యోగులు బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు కోరారు. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు బంద్‌కు సహకరించాలని ఆయన కోరారు.
 
 బంద్‌ను విజయవంతం చేయండి ః ఎన్జీఓలు
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిర్వహించదలిచిన బంద్‌కు ఎన్జీఓలు సంపూర్ణ సహకారాలు అందించి విజయవంతం చేయాలని జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు.  రాష్ట్రాన్ని చీల్చడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టనున్న బంద్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ వేదిక రీజినల్ కో ఆర్డినేటర్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement