కర్నూలు (అగ్రికల్చర్): జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందిన బంగినపల్లి మామిడికి భౌగోళిక (జియోగ్రాఫికల్ ఇండికేషన్) గుర్తింపు లభించింది. ఈ మామిడి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందినదిగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) గుర్తించింది. రెండేళ్ల క్రితమే ప్రాథమికంగా గుర్తింపు లభించినప్పటికీ తాజాగా పూర్తి హక్కులు ఇచ్చినట్లు సంస్థ సోమవారం చెన్నైలో ప్రకటించింది. భౌగోళిక గుర్తింపుతో పాటు బంగినపల్లి మామిడి మాది అని చెప్పే అధికారం ఇతరులకు ఇకనుంచి ఉండదు. బంగినపల్లి మామిడి పేరును వాడుకోవాలంటే కర్నూలు జిల్లాకు రాయల్టీ చెలించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment