రింగ..రింగా | Basically the registration application | Sakshi
Sakshi News home page

రింగ..రింగా

Published Wed, Jan 27 2016 11:48 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Basically the registration application

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళంః రీచ్‌లు దక్కించుకునేందుకు ప్రాథమికంగా దరఖాస్తు నమోదు తప్పనిసరి. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఎస్‌టీసీ కార్యాలయం కేవలం విశాఖ లోనే ఉంది. ఈ విభాగానికి మూడు జిల్లా ల నుంచి మైనింగ్ దరఖాస్తులొచ్చి పడుతున్నాయి. అయితే బిడ్డర్లకు అక్కడా
 
 ఇసుక కొత్త పాలసీని అనుకూలంగా మలచుకునేందుకు టీడీపీ నాయకులు కుట్రపన్నుతున్నారు. ఆన్‌లైన్ విధానంలో మోసాలకు తావులేదంటున్నా తమ వారికే ఇసుక రీచ్‌లు దక్కాలని నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఎస్‌టీసీ కార్యాలయాల్లోనూ తమ మనుషుల్ని పెట్టి ఇతర ప్రాంతాల నుంచి శ్రీకాకుళానికి చెందిన ఇసుక రీచ్‌లకు ఎవరైనా టెండర్లు దాఖలు చేస్తున్నారేమో పసిగట్టి వారికి బెదిరించేటట్టు వ్యూహం పన్నారు. పొరుగూళ్ల నుంచి ఇక్కడకొచ్చి ఏం వ్యాపారం చేయగలరంటూ ఫోన్లు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కొత్త పాలసీపై అవగాహన కూడా లేని వ్యక్తులు బిడ్లు దాఖలు చేస్తున్నారన్న సమాచారంపై జిల్లా మంత్రి, ఎంపీ సహచరులు అప్రమత్తపోయిన ట్టు సమాచారం. లోకి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఈనెల 25నాటికి జిల్లాలోని 17రీచ్‌లకు సంబంధించి సుమారు 1వేయి దరఖాస్తులందినట్టు చెబుతున్నారు. ఈ ప్రక్రియ అనంతరం వచ్చే నెల 6వ తేదీన షెడ్యూలు విడుదలవుతుందని, 8న వేలం ఉంటుందని, ఆన్‌లైన్‌లో ఈ-వేలంలో పాల్గొనాలని మాత్రం సిబ్బంది చెబుతున్నారు.
 
 ‘గోపాలపెంట’పై కన్ను
 పర్యావరణ అనుమతులు పొంది పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలకు సిద్ధంగా ఉన్న గోపాలపెంట, హయాతినగరం ర్యాంపుల్లో టీడీపీ నేతలు దృష్టిసారించారు. ఈనెల 31తో గడువు తీరిపోనుండడంతో స్థానిక రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ద్వారా ఇసుక అక్రమ రవాణాకు అడ్డు లేకుండా చేసుకుని సరకు రవాణాను ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. 31దాటితే జిల్లా ఇసుక జిల్లాలోనే వాడుకోవాలన్న నిబంధన అమల్లోకి వస్తుందని తెలుసుకున్న నేతలు ఆ లోగా ఇక్కడి ఇసుకను విశాఖకు భారీగా తరలించి సొమ్ము చేసుకునేందుకు కుట్రపన్నుతున్నారు.
 
  ఇటీవల కలెక్టరేట్ వెనుక మూడు ఇసుక నాటుబళ్లను గుర్తించిన స్థానిక అధికారులు ఆ ఇసుకను జేసీకి అప్పగిస్తామని చెప్పి సీజ్ చేసిన ఇసుకను మాత్రం తమకు అనుకూలంగా ఉన్న లారీల్లోకి డంప్ చేశారని, ఫైన్లు తప్పదని నాటుబళ్ల యజమానుల్ని బెదిరించడంతో వారంతా మిన్నకుండిపోయారని తెలుస్తోంది.  ఆన్‌లైన్ వ్యవహారంలో అధికశాతం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోటరీయే ఉన్నట్టు చెబుతున్నారు. కొత్త విధానంపై కొంతమందికి అవగాహన లేకపోవడం, స్థానిక అధికారులు కూడా ఇందుకు సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహించకపోవడం టీడీపీ నాయకులకు అనుకూలంగా మారిందని తెలిసింది. బినామీలను రంగంలోకి దింపి వారితోనే వ్యాపారం చేయించేందుకు నాయకులు కసరత్తు మొదలెట్టారు. ఆన్‌లైన్ దరఖాస్తులు, బిడ్లు వ్యవహారానికి సంబంధించి 6వ తేదీనే ఏమైనా చెప్పగలం అని స్థానిక మైన్స్ ఏడీ కార్యాలయ సిబ్బంది వివరణ ఇస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement