- ‘సాక్షి’తో మంత్రి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి మెరుగైన చర్యలను చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 490 హాస్టళ్లలో విద్యార్థులందరికీ 2015-16లో మంచాలు, పరుపులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సోలార్ మోటార్లు, ఆర్‌వో వాటర్‌ప్లాంట్‌లు, ఉన్ని బ్లాంకెట్లు తదితర సదుపాయాలను కల్పిస్తామన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ రాబోయే బడ్జెట్‌లో బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్పుల కోసం బడ్జెట్‌లో రూ.2,600 కోట్ల వరకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.