సీతారాములకు భారీ కానుకలు సమర్పించిన కంభం వాసి | Bhadrachalam Lord sri sita ramachandra swamy gets a Rs 18 lakhs gift | Sakshi
Sakshi News home page

సీతారాములకు భారీ కానుకలు సమర్పించిన కంభం వాసి

Published Wed, Aug 21 2013 10:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

Bhadrachalam Lord sri sita ramachandra swamy gets a Rs 18 lakhs gift

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామీకి ప్రకాశం జిల్లా కంభంకు చెందిన భక్తులు మల్లేశ్వరరావు, రమాదేవి దంపతులు బుధవారం రెండు బంగారు కిరీటాలను బహుకరించారు. ఆ రెండు కిరీటాలను శ్రీ సీతారామచంద్రస్వామీ ఆలయ అధికారులకు వారు అందజేశారు. ఆ కిరీటాలను శ్రీ సీతారాములకు అలంకరించవలసిందిగా వారు ఆలయ అధికారులను కోరారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా మల్లేశ్వరరావు, రమాదేవి దంపతులు బుధవారం భద్రాద్రిలోని శ్రీసీతారాములను దర్శించుకున్నారు.

 

అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రూ.18 లక్షలతో ఆ రెండు కిరీటాలను తయారు చేయించినట్లు శ్రీ సీతారామచంద్రస్వామి భక్తులు మల్లేశ్వరరావు, రమాదేవి దంపతులు తెలిపారు. అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పర్వదినాల్లో శ్రావణ పౌర్ణమి ఒకటి. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని సీతారాములను దర్శించుకునేందుకు భద్రాద్రి దేవాలయానికి భక్తులు పొటెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement