హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న భాను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం బ్రేకులు ఫెయిల్ అయ్యయి. దాంతో బస్సును రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం బాట సింగారం వద్ద డ్రైవర్ నిలిపివేశాడు. దాంతో ప్రయాణికులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి జాతీయ రహదారిపై పడిగాపులు పడుతున్నారు. భాను ట్రావెల్స్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణీకులు ఆగ్రహిస్తున్నారు.