భోగాపురం ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ | Bhogapuram Airport Green Signal | Sakshi
Sakshi News home page

భోగాపురం ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్

Published Thu, May 21 2015 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

Bhogapuram Airport Green Signal

పనుల పర్యవేక్షణకు బీఐఏసీఎల్ ఏర్పాటు
హైదరాబాద్: విజయనగరం జిల్లాలోని భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కంపెనీ లిమిటెడ్ (బీఐఏసీఎల్) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

బీఐఏసీఎల్ సంస్థలో పది ముఖ విలువ కలిగిన యాభై లక్షల వాటాల రూపంలో రూ.ఐదు కోట్లను ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టింది. ఇంధన, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ కార్యదర్శి, రహదారులు భవన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇన్‌క్యాప్ ఎండీ, విజయనగరం జిల్లా కలెక్టర్లను బీఐఏసీఎల్ డెరైక్టర్లుగా నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement