'ఇప్పుడు కూడా చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు'
నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నిద్ర పట్టడం లేదని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కుట్రలు, కుయుక్తులు మాని ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు కృషి చేయాలని హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ వీడుతున్నారంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడుతోందని భూమన మండిపడ్డారు.