లోకేష్‌ నుంచి కిందిస్థాయి వరకూ అందరిదీ.. | bhumana karunakar reddy lashes out at tdp | Sakshi
Sakshi News home page

లోకేష్‌ నుంచి కిందిస్థాయి వరకూ అందరిదీ..

Published Fri, Mar 10 2017 11:55 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

లోకేష్‌ నుంచి కిందిస్థాయి వరకూ అందరిదీ.. - Sakshi

లోకేష్‌ నుంచి కిందిస్థాయి వరకూ అందరిదీ..

తిరుపతి: తెలుగుదేశం పార్టీ గజదొంగల పార్టీగా మారిందని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. టీడీపీలో బ్యాంకులను లూటీ చేసేవారు పెరిగిపోతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు వంటివారు చాలా మంది ఉన్నారని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కొడుకు నారా లోకేష్‌ నుంచి కిందిస్థాయి వరకు అందరిదీ నేరచరిత్రేనని భూమన ఆరోపించారు. టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడుతుంటే చంద్రబాబు మాత్రం నీతులు చెబుతున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement