అమలాపురం రూరల్ :రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్లో బీజేపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య విమర్శించారు. జన్మభూమి కమిటీలు, అధికారులు కుమ్మక్కై అన్యాయం చేస్తున్నారని, దీనిపై కార్యకర్తలు నిలదీయాలని సూచించారు. జిల్లా ఎస్సీ మోర్చా విస్తృతస్థాయి సమావేశం అమలాపురం లయన్స్‌క్లబ్ హాలులో ఆదివారం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొల్లు సూర్యారావు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా సాంబయ్య మాట్లాడుతూ సంస్కరణలతో ఆర్థిక అస్పృశ్యతను ప్రధాని నరేంద్రమోదీ రూపుమాపారని, అంబేడ్కర్ లేకుంటే తాను లేనని చెప్పిన ఏకైక ప్రధాని మోదీ అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని, ఇప్పటికే కేంద్రం 8,600కోట్ల నిధులు రాష్ట్రానికి కేటాయించిందని పేర్కొన్నారు. దీనిపై అపోహలు విడనాడాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ మాట్లాడుతూ అంబేడ్కర్ సేవలను గుర్తించి మోదీ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను పూర్తి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ మోర్చా ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధరం, ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి పెయ్యల శ్యామ్ ప్రసాద్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసరావు, రాష్ట్ర కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి పి.మాలకొండయ్య, జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.వి.నాయుడు, కర్రి చిట్టిబాబు, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, కుడుపూడి సూర్యనారాయణరావు, యువమోర్చా ప్రధాన కార్యదర్శి యల్లమిల్లి కొండ పాల్గొన్నారు.
ఆర్థిక నేరగాళ్లను నమ్మొద్దు
దానవాయిపేట(రాజమండ్రి) : ఆర్థిక నేరగాళ్లను దళితులు నమ్మొద్దని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాలను పాటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బొమ్ముల దత్తు మాట్లాడుతూ నగరంలో బీజేపీని మరిత బలోపేతం చేసేందుకు దళితులను పార్టీలోకి ఆహ్వానించి, త్వరలోనే దళిత కమిటీలు ఏర్పా టు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ అర్బన్ అధ్యక్షుడు క్షత్రియ బాల సుబ్రమణ్యం సింగ్, మట్టాడి జయప్రకా శ్, రేలంగి శ్రీదేవి, సీతాల్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో బీజేపీ కార్యకర్తలకు అన్యాయం
Published Mon, May 18 2015 1:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM
Advertisement