అద్వానీతో బీజేపీ నేతల భే'టీ' | bjp leaders meet lk advani, discuss on telangana bill | Sakshi
Sakshi News home page

అద్వానీతో బీజేపీ నేతల భే'టీ'

Published Thu, Feb 20 2014 12:48 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

అద్వానీతో బీజేపీ నేతల భే'టీ' - Sakshi

అద్వానీతో బీజేపీ నేతల భే'టీ'

బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతో బీజేపీ నాయకుల భేటీ ముగిసింది. రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లును యథాతథంగా ఆమోదించాలని బీజేపీ దాదాపుగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ తరఫున పెద్ద తలకాయ అయిన అద్వానీ అభిప్రాయం కూడా తీసుకోవాలని నాయకులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అంత చెత్త బిల్లును తాను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని అద్వానీ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాతే లోక్సభలో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఇక రాజ్యసభలో ఆమోదం మాత్రమే మిగిలింది. అక్కడ కూడా బిల్లును గట్టెక్కించాలని కాంగ్రెస్ అగ్రనాయకులు పలువురు కమలనాథులతో భేటీ అయ్యి, వారిని ఆమేరకు ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు అద్వానీతో భేటీ అయ్యి, తమ నిర్ణయాన్ని ఆయనకు వివరించినట్లు సమాచారం. గురువారం నాడు బిల్లుపై సభలో జరిగే చర్చలో బీజేపీ తరఫున అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు మాట్లాడతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement