కడప రూరల్ : సెలవులు ముగిశాక ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై దాదాపు నెల కావస్తోంది. ఆ రోజు నుంచే ప్రభుత్వ వసతి గృహాల తలుపులు తెరుచుకున్నాయి. అయితే, నాటి నుంచి నేటి వరకు నిరుపేద విద్యార్థులు పుస్తకాల కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పాఠ్య పుస్తకాల కొరత దాదాపుగా తీరినప్పటికీ ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాల కొరత వెంటాడుతూనే ఉంది.
జిల్లాలో 143 ఎస్సీ హాస్టళ్లు
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 143 బాలబాలికల వసతి గృహాలు ఉన్నాయి. వాటిల్లో 10 వేలకు పైగా బాలబాలికలు 3 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. వీరికి పాఠ్య పుస్తకాలను ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందజేస్తారు. కాగా నోటు పుస్తకాలను మాత్రం విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లలో అందిస్తారు. ఈ నోటు పుస్తకాలకు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దాదాపు 14 లక్షల పాఠ్య పుస్తకాల అవసరం ఉండగా, మొన్నటివరకు 13 లక్షల పాఠ్య పుస్తకాలు వచ్చాయి. ఇంకా లక్ష వరకు పుస్తకాలు రావాల్సి ఉంది.
1,75,050 పుస్తకాలకు వచ్చింది
30 వేల పుస్తకాలే
ఎస్సీ హాస్టళ్లలోని విద్యార్థులకు ఏడాదికి తరగతుల వారీగా మూడవ తరగతికి వంద పేజీల నోటు పుస్తకాలు ఐదు, నాలుగు, ఐదు తరగతులకు 200 పేజీల పుస్తకాలు ఆరు, ఆరవ తరగతికి 200 పేజీల పుస్తకాలు తొమ్మిది, ఏడవ తరగతికి పది పుస్తకాలు, ఆరు, ఏడు తరగతులకు వన్‌సైడ్ సైన్స్ పుస్తకాలు రెండు, ఏడవ తరగతికి మ్యాథ్స్ నోటు పుస్తకాలు నాలుగు, లాంగ్ వైట్ పుస్తకాలు రెండు, ఎనిమిదవ తరగతికి సంబంధించి వైట్ లాంగ్ పుస్తకాలు 13, తొమ్మిది, పది తరగతులకు 18 చొప్పున లాంగ్ వైట్ పుస్తకాలు ఇవ్వాలి. ఆ మేరకు హాస్టళ్లలో 10 వేల మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు.
ఆ శాఖ అధికారులు 13,100 మందికి లక్షా 75,050 పుస్తకాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందులో వైట్ లాంగ్ నోటు పుస్తకాలను 97,150 అడిగారు. మొత్తం 175050 పుస్తకాలను అడిగితే ప్రభుత్వం కేవలం 30 వేల లాంగ్ నోటు పుస్తకాలను పంపింది. ఈ పుస్తకాలను సంక్షేమ శాఖ అధికారులు పదవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. అయితే తొమ్మిది, పదవ తరగతి విద్యార్థులకు 97,150 లాంగ్ నోటు పుస్తకాలు అవసరముంది. వచ్చిన పుస్తకాలు ఏ మూలకు సరిపోకపోవడంతో సంక్షేమ శాఖ అధికారులు తల లు పట్టుకుంటున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఎస్సీ హాస్టళ్లలో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.
నోటు పుస్తకాలు వస్తున్నాయ్..
ఇప్పటివరకు 30 వేల లాంగ్ నోటు పుస్తకాలు వచ్చాయి. వచ్చిన పుస్తకాలను ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని హాస్టళ్లలో ఉంటున్న పదవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నాము. నోటు పుస్తకాలు ఇంకా వస్తున్నాయి. అవి రాగానే అన్ని తరగతుల విద్యార్థులకు అందజేస్తాం.
- పీఎస్‌ఏ వరప్రసాద్, జేడీ,
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ
పుస్తక క్షోభ!
Published Fri, Jul 10 2015 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement