బొత్సది ఓట్ల రాజకీయం | Botsa Satyanarayana votes politics | Sakshi
Sakshi News home page

బొత్సది ఓట్ల రాజకీయం

Published Mon, Jan 6 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

Botsa Satyanarayana votes politics

 సాలూరు, న్యూస్‌లైన్ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లాలో ఓట్ల రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లా ల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు విమర్శించారు. బొత్స ఇప్పటినుంచే ఓటర్లను ఎలా కొనుగోలు చేయూలా అని ఆలోచన చేస్తున్నారన్నా రు. సాలూరు పట్టణంలోని రెల్లివీధిలో వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభా గం నాయకుడు గుమ్మా నాగార్జున ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ శిలా విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభ లో ఆయన మాట్లాడుతూ అంబేద్క ర్ ఎన్నో కష్టాలు ఓర్చి ప్రపంచం గర్విం చదగ్గ రాజ్యాంగాన్ని మనకు అందించారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను అనుభవిస్తున్న పాలకులు మాత్రం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. 
 
 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సబ్‌ప్లాన్ అమలు చేసినా.. ఎలాంటి ఫలితం ఉం డడం లేదన్నారు. వాస్తవానికి ఆ నిధు లు కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ఉపయోగపడుతున్నారని చెప్పారు. పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబ శివరాజు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం మొదటి నుంచీ పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్సార్ సీపీయేనన్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమ న్వయకర్త కొత్తపల్లి గీత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయం కోసం విభజనకు పూనుకుందన్నారు. విభజన కు కారణమైన కాంగ్రెస్, టీడీపీలకు వ చ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 
 
 ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ అంబేద్కర్ దళిత సూర్యుడు అని చెప్పారు. కొన్ని శక్తుల అడ్డంకుల వల్ల అన్నివర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాను న్న రోజుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాష్, పార్టీ నా యకులు అరుణ్‌కుమార్, గొర్లె మధు, జరజాపు ఈశ్వరరావు, జరజాపు సూరి బాబు, రాష్ట్ర మహిళ విభాగం సభ్యురాలు ముగడ గంగమ్మ, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ ఆదాడ మోహనరావు, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ గరుడపల్లి ప్రశాంత్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు అబ్దు ల్, తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement