రాత్రంతా తల్లి శవం పక్కనే నిద్రించిన చిన్నారి! | Bowenpally Boy Slept whole night beside his mother dead body | Sakshi
Sakshi News home page

రాత్రంతా తల్లి శవం పక్కనే నిద్రించిన చిన్నారి!

Published Wed, Dec 11 2013 10:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రాత్రంతా తల్లి శవం పక్కనే నిద్రించిన చిన్నారి! - Sakshi

రాత్రంతా తల్లి శవం పక్కనే నిద్రించిన చిన్నారి!

ఈ ఫొటోలోని చిన్నారి రాత్రంతా తల్లి మృతదేహం పక్కనే ఆదమరిచి నిద్రపోయాడు. తెల్లారాక ఎంతకీ అమ్మ లేవక పోవడంతో ఏడుస్తూ బయటికి వచ్చాడు. దీంతో బాలుడి తల్లి హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.
 
హైదరాబాద్:  ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు భార్య హత్యకు దారితీసింది. ఘటన జరిగిన వెంటనే భర్త ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఈఘటన సోమవారం రాత్రి బోయిన్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. అయితే ఈ దారుణం ఠాణాకు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...మెదక్ జిల్లా రాళ్లబండి గ్రామానికి చెందిన నాగమణి (32)కి పదేళ్ల వయసులోనే వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత భర్తతో విడిపోయి బతుకుదెరువుకు కోసం నగరానికి వచ్చి ఓ ఇంట్లో పనిచేస్తోంది. ఇలా ఆ ఇంటి మరమ్మతుల పనులు చేస్తుండగా అశోక్‌తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారి చివరకు నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే పెళ్లయిన అశోక్ నాగమణిని బోయిన్‌పల్లి కంసారి బజార్‌లోని ఓ అద్దెఇంట్లో ఉంచాడు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు.

ఇటీవల నాగమణి,అశోక్‌ల వ్యవహారం తెలిసిన అతని మొదటి భార్య గొడవ పెట్టింది. దీంతో నాగమణి-అశోక్‌ల మధ్య కూడా వివాదాలు మొదలయ్యాయి. వివాహ సమయంలో అశోక్ ఒక ఫ్లాట్, కొంత పొలం కొనిస్తానని నాగమణికి చెప్పాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగానే నాగమణి మృతిచెందినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అశోక్ పరారీలో ఉండటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
అమ్మ..లే అమ్మా
సోమవారం రాత్రి మృతిచెందిన నాగమణి పక్కనే బాబు నిద్రపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం అమ్మను లేపేందుకు యత్నించిన బాలుడు, అనంతరం పైఅంతస్తు నుంచి కిందకు రావడంతోనే హత్య విషయం స్థానికులకు తెలిసింది. బాలుడు రాత్రంతా శవం పక్కనే గడిపి ఉంటాడని తెలిసిన పలువురు స్థానికులు చలించిపోయారు. మా అమ్మకు ఏమైందంటూ..అక్కడి వారిని ప్రశ్నించడం పలువురిని కంటతడి పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement