Bowenpally Police Station
-
దమ్కీ కహానీ.. రూ.కోటి ఇవ్వకుంటే నీకు, నీ భార్యకు మరణమే!
సాక్షి, సిటీబ్యూరో: బోయిన్‌పల్లికి చెందిన బల్క్ డ్రగ్ వ్యాపారి మనోజ్ సలేచా జైన్‌ను టార్గెట్ చేసి, అతడి కుమార్తె కిడ్నాప్ కుదరక వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కాల్స్‌తో బెదిరింపులకు దిగిన జవారీలాల్ తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్‌ను బోయిన్పల్లి పోలీసులు సేకరించారు. ఇతడిని పట్టుకోవడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. కొన్నాళ్ల క్రితం మానుకోటలో జరిగిన బాలుడి కిడ్నాప్, హత్య కేసు దర్యాప్తును తలదన్నే చర్యలు తీసుకున్నారు. ♦ ఈ నెల 10న జవారీ ఇద్దరు అనుచరులతో కలిసి మనోజ్ కుమార్తెను ఈ నెల 10న కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అది విఫలం కావడంతో బెదిరింపులకు దిగి డబ్బు గుంజాలని పథకం వేశాడు. దీనికోసం తన స్పాట్ ఫోన్లో ఓ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ♦ ఆ యాప్ వినియోగిస్తూ మనోజ్‌కు వీఓఐపీ కాల్స్ చేశాడు. 10, 11 తేదీల్లో 12 కాల్స్ చేసిన ఇతగాడు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. తన అనుచరుల ద్వారా మనోజ్ ఇంటిపై నిఘా వేసి ఉంచడంతో పోలీసుల కదలికల్నీ గుర్తించాడు. ♦ దీంతో ‘ఓ కాల్లో పోలీసులకు చెప్పొద్దంటే చెప్పావు కదా... ఇక నాకు డబ్బు వద్దు నీ ప్రాణమే కావాలి’ అంటూ హెచ్చరించాడు. ఆపై మళ్లీ రూ.కోటి (ఏక్ కోకా) ఇవ్వకపోతే మనోజ్‌తో పాటు అతడి భార్యనూ అంతం చేస్తానన్నాడు. ♦ ఇంటి చుట్టూ పోలీసులకు ఉంచుకున్నా దేవుడి దయ ఉన్న తాను చిక్కననీ, డబ్బు ఇవ్వకుంటే మూడునాలుగు నెలలకైనా కాల్చి చంపేస్తానన్నాడు. తన వద్ద రూ.కోటి లేదని, అంత ఇచ్చుకోలేనని మనోజ్ అతగాడిని బతిమలాడాడు. ♦ తొలుత తగ్గింపు కుదరదని చెప్పిన జవారీలాల్ చివరకు రూ.5 లక్షలు తగ్గించి రూ.95 లక్షలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా నిందితులను పట్టుకోవడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. ♦ యాప్ ద్వారా వీఓఐపీ కాల్స్ చేస్తే వాటిని అందుకునే వారికి రకరకాల నంబర్లు కనిపిస్తుంటాయి. సాధారణ కాల్స్ మాదిరిగా వీటితో దాన్ని వినియోగిస్తున్న వారిని పట్టుకోవడం సాధ్యం కాదు. దీంతో టాస్క్‌ఫోర్స్ సాంకేతికంగా ముందుకు వెళ్లింది. ♦ ఎదుటి వ్యక్తి ఏ యాప్ ద్వారా ఈ కాల్స్ చేస్తున్నా డో కూడా తెలియదు. దీంతో పోలీసులు వీఓఐపీ సేవలు అందిస్తున్న 20 టాప్ యాప్స్‌ను ఎంచుకున్నారు. వాటి నిర్వాహకులకు ఈ–మెయిల్ పంపిస్తూ అందులో మనోజ్ నెంబర్ పొందుపరిచారు. ♦ ఈ నెంబర్‌కు ఫలానా తేదీ, సమయంలో మీ యాప్ నుంచి వచ్చిన కాల్ ఎవరు చేశారో చెప్పగలరా? అంటూ కోరారు. దీనిపై స్పందించిన ఓ యాప్ నిర్వాహకుడు చేసిన వ్యక్తి నెంబర్ చెప్పలేమంటూ అయితే అతడు రిజిస్టర్ చేసుకోవడానికి వాడిని ఈ–మెయిల్ ఐడీ అందించారు. ♦ దీంతో పాటు సదరు కాల్స్ చేయడానికి ఆ వ్యక్తి యాప్‌లోకి లాగిన్ అయిన ఐపీ అడ్రస్‌లు అందించారు. ఈ అడ్రస్‌లను సర్వీస్ ప్రొవైడర్లకు పంపిన పోలీసులు ఏ సెల్‌ఫోన్ నెంబర్‌తో ఈ ఐపీ అడ్రస్‌లు యాక్టివ్ అయ్యాయో చెప్పమని కోరారు. ♦ ఈ నేపథ్యంలో ఓ సర్వీస్ ప్రొవైడర్ 300 ఫోన్ నంబర్లను పోలీసులకు అందించారు. వీటిని విశ్లేషిస్తూనే అధికారులు మరికొన్ని వివరాలు ఇవ్వాలంటూ యాప్‌ను సంప్రదించారు. ♦ ఈసారి స్పందించిన యాప్ నిర్వాహకుడు తమ యాప్ వినియోగానికి నిర్ణీత మొత్తం చెల్లించాలని, సదరు వ్యక్తి రాజస్తాన్ ఖాతా నుంచి చెల్లింపులు చేసినట్లు చెప్పారు. ఆ 300 నంబర్లలో రాజస్తాన్‌తో సంబంధం ఉన్న వాటిని గుర్తించడానికి ప్రయత్నించారు. ♦ ఫలితంగా జవారీలాల్ నంబర్ తెలియడంతో పాటు అతడు జీడిమెట్లలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నేపథ్యంలో మిగిలిన ఇద్దరినీ గుర్తించి పట్టుకున్నారు. ♦ గురువారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన బోయిన్పల్లి పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ♦ వీరిని లోతుగా విచారించి తుపాకీ, తూటాలు విక్రయించిన మధ్యప్రదేశ్ వ్యక్తిని గుర్తించాలని భావిస్తున్నారు. ఈ కేసులో అతడూ కీలకం కావడంతో అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
తల్లిదండ్రులపై పోలీసులే కేసు పెట్టారు
సాక్షి, హైదరాబాద్: బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ పాఠశాల ఎదుట కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమావేశమయ్యారనే అభియోగంతో బోయిన్పల్లి పోలీసులే విద్యార్థుల తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారని పాఠశాల విద్య డైరెక్టర్ ఎ.శ్రీదేవసేన హైకోర్టుకు నివేదించారు. పాఠశాల యాజమాన్యం కానీ, పేరెంట్స్ అసోసియేషన్ కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఆండ్రూస్ పాఠశాలలో గతేడాది ఉన్న ట్యూషన్ ఫీజులనే నెలవారీ పద్ధతిలో తీసుకుంటున్నారని వెల్లడించారు. ఆండ్రూస్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు శ్రీదేవసేన శుక్రవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ‘కేంద్ర మార్గదర్శకాలు, ప్రజ్ఞా నిబంధనల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నాం. ఫీజులు పెంచరాదని, నెలవారీగా మాత్రమే ఫీజులు తీసుకోవాలని సీబీఎస్సీ, ఐసీఎస్సీ పాఠశాలలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రైవేటు పాఠ శాలలు ఫీజులు అధికంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేసేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని డీఈవోలను పాఠశాల విద్య కమిషనర్ ఇప్పటికే ఆదేశించారు. జీవో 46కు విరుద్ధంగా వ్యవహరించిన 55 పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చాయి. ఆయా స్కూళ్లకు షోకాజ్ నోటీసులిచ్చాం. వీటిలో 47 పాఠశాలలు తమ వివరణను సమర్పించాయి. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించాం. వారిచ్చే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలున్న బేగంపేట గీతాంజలి పాఠశాలను ఈ నెల 7న సందర్శించాం. ఇంకా చెల్లించాల్సిన ఫీజులో ఎక్కువగా తీసుకున్న ఫీజును మినహాయిస్తామని గీతాంజలి యాజమాన్యం హామీనిచ్చింది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కూడా నెలవారీగా ట్యూషన్ ఫీజు తీసుకునేందుకు అంగీకరించింది. నీరజ్, వాసవీ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్స్ ఇచ్చిన వినతిపత్రాలు జీవో 46 ఉల్లంఘించినవి కావు. ఫీజులు తగ్గించాలని కోరినవే..’అని శ్రీదేవసేన నివేదికలో పేర్కొన్నారు. ఇటు ఆన్లైన్ క్లాసుల నిర్వహించకుండా, ప్రైవేటు పాఠశాలలు జీవో 46కు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ అక్టోబర్ 8కి వాయిదా పడింది. ఈ వ్యవహారంపై తమ కౌంటర్ దాఖలు చేసేందుకు 2 వారాల గడువు కావాలని సీబీఎస్ఈ తరఫు న్యాయవాది కోరడంతో అనుమతించిన కోర్టు విచారణను వాయిదా వేసింది. -
పరారీలో ముఖేష్ కుమార్
సాక్షి, హైదరాబాద్: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, అర్జున్ అవార్డు గ్రహీత ముఖేష్ కుమార్‌పై కేసు నమోదు అయింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం పొందినందుకు గాను అతనిపై హైదరాబాద్ బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వారాల క్రితమే అతనిపై కేసు నమోదు చేసినప్పటికీ ఆ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బోయినపల్లి సీఐ రాజేశ్ మాట్లాడుతూ.. ‘ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం కోసం ముఖేష్ పలు పత్రాలు సమర్పించారు. వాటిపై విచారణ జరపగా.. అతడు నకిలీ పత్రాలతో కుల ధ్రువీకరణ పత్రం పొందినట్టు వెల్లడైంది. దీంతో రెండు వారాల క్రితం ముఖేష్‌పై కేసు నమోదు చేశాం. మూడు రోజులుగా ముఖేష్ పరారీలో ఉన్నారు.. అతని కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నాం. ముఖేష్‌తో పాటు అతని తమ్ముడిపైన కూడా కేసు నమోదు చేశామ’ని తెలిపారు. కాగా, కెరీర్లో 307 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ 80 గోల్స్ చేశాడు. -
బోయినపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద యువతి ఆత్మహత్యాయత్నం
-
రాత్రంతా తల్లి శవం పక్కనే నిద్రించిన చిన్నారి!
ఈ ఫొటోలోని చిన్నారి రాత్రంతా తల్లి మృతదేహం పక్కనే ఆదమరిచి నిద్రపోయాడు. తెల్లారాక ఎంతకీ అమ్మ లేవక పోవడంతో ఏడుస్తూ బయటికి వచ్చాడు. దీంతో బాలుడి తల్లి హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్: ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు భార్య హత్యకు దారితీసింది. ఘటన జరిగిన వెంటనే భర్త ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఈఘటన సోమవారం రాత్రి బోయిన్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. అయితే ఈ దారుణం ఠాణాకు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...మెదక్ జిల్లా రాళ్లబండి గ్రామానికి చెందిన నాగమణి (32)కి పదేళ్ల వయసులోనే వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత భర్తతో విడిపోయి బతుకుదెరువుకు కోసం నగరానికి వచ్చి ఓ ఇంట్లో పనిచేస్తోంది. ఇలా ఆ ఇంటి మరమ్మతుల పనులు చేస్తుండగా అశోక్‌తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారి చివరకు నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే పెళ్లయిన అశోక్ నాగమణిని బోయిన్పల్లి కంసారి బజార్‌లోని ఓ అద్దెఇంట్లో ఉంచాడు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇటీవల నాగమణి,అశోక్‌ల వ్యవహారం తెలిసిన అతని మొదటి భార్య గొడవ పెట్టింది. దీంతో నాగమణి-అశోక్‌ల మధ్య కూడా వివాదాలు మొదలయ్యాయి. వివాహ సమయంలో అశోక్ ఒక ఫ్లాట్, కొంత పొలం కొనిస్తానని నాగమణికి చెప్పాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగానే నాగమణి మృతిచెందినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అశోక్ పరారీలో ఉండటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మ..లే అమ్మా సోమవారం రాత్రి మృతిచెందిన నాగమణి పక్కనే బాబు నిద్రపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం అమ్మను లేపేందుకు యత్నించిన బాలుడు, అనంతరం పైఅంతస్తు నుంచి కిందకు రావడంతోనే హత్య విషయం స్థానికులకు తెలిసింది. బాలుడు రాత్రంతా శవం పక్కనే గడిపి ఉంటాడని తెలిసిన పలువురు స్థానికులు చలించిపోయారు. మా అమ్మకు ఏమైందంటూ..అక్కడి వారిని ప్రశ్నించడం పలువురిని కంటతడి పెట్టించింది.