బాలుడి నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ ఎర్రంనాయుడు
విజయనగరం క్రైమ్: గతంలో విజయనగరంలో ఉండి ఇప్పుడు విశాఖ మధురవాడలో నివాసముంటున్న నిరంజన్ అనే బాలుడు ఆడుకోవడానికి స్నేహితులెవరూ లేకపోవడంతో విజయనగరం వచ్చేశాడు. శుక్రవారం స్థానిక తోటపాలెంలో చిన్నారి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో మహిళా పోలీసులు ఎం. లెనినా, కె. మణికంఠ మహేశ్వరి గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. పుస్తకం కొనుక్కుంటానని అమ్మకు రూ. 30 అడిగి విజయనగరం బస్సెక్కి వచ్చేశాని బాలుడు తెలపడంతో స్టేషన్‌కు తీసుకొచ్చారు. సీఐ ఎర్రంనాయుడు బాలుడి తండ్రి మల్లేశ్వరరావుకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. తల్లిదండ్రులు రావడంతో పోలీసులు చిన్నారిని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment