రెండో భార్యతో అన్యోన్యంగా ఉన్నాడని కన్నతండ్రినే.. | Son Assassinated Father in Vizianagaram | Sakshi
Sakshi News home page

కన్నతండ్రినే కడతేర్చాడు..

Published Mon, Apr 20 2020 1:05 PM | Last Updated on Mon, Apr 20 2020 1:05 PM

Son Assassinated Father in Vizianagaram - Sakshi

విజయనగరం, గజపతినగరం: మండలంలోని వేమలి గ్రామంలో కొడుకు చేతిలో తండ్రి హతమైన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వేమలి గ్రామానికి చెందిన బొద్దూరు వెంకటరమణ (50)కు ఇద్దరు భార్యలు. అందులో మొదటి భార్య సత్యవతికాగా, రెండో భార్య కుమారి. తాపీ  పనిచేస్తున్న వెంకటరమణ వేమలి గ్రా మంలో ఓ ఇంటి నిర్మాణం పనికి రెండో భార్య కుమారిని తీసుకెళ్లాడు. ఎప్పటికప్పుడే రెండో భార్యతో అన్యోన్యంగా ఉంటూ పనికి వెంట తీసుకెళ్తున్నాడని మొదటి భార్య సత్యవతి తన కొడుకు అయిన చక్రధర్‌రావుకు చెప్పింది. దీంతో పనులు జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని తండ్రితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారి తీసింది. ఈ గొడవలో తాపీపనిలో వినియోగించే గజంబద్దతో తలపై బలంగా కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామ రెవెన్యూ అధికారి సమాచారం మేరకు సీఐ విద్యాసాగర్, ఎస్‌ఐ సన్యాసినాయుడు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చక్రధర్‌రావుపై కేసునమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement