
హేమంత్‌ను సురక్షితంగా తీసుకొస్తున్న కానిస్టేబుల్
సాక్షి, పుట్లూరు(అనంతపురం) : తప్పిపోయిన బాలుడు ఎట్టకేలకు కనిపించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కొండుగారికుంటకు చెందిన హేమంత్ అనే ఐదేళ్ల బాలుడు మంగళవారం ఇంటి నుంచి గ్రామ సమీపంలోని తోట వద్దకు వెళ్లి కనిపించకుండాపోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, గ్రామస్తులు మంగళవారం రాత్రి నుంచి అన్ని చోట్ల కలియదిరిగారు.
బుధవారం ఉదయం చాలవేముల సమీపంలోని గాలిమరల సబ్‌స్టేషన్ వద్ద హేమంత్‌ను గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి సమయంలో దారి గుర్తించలేక ఆరు కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్లినట్లు తెలుస్తోంది. హేమంత్ సురక్షితంగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు చిరంజీవి, శ్రావణిలు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment