గాజువాక(విశాఖపట్టణం జిల్లా): తన పెళ్లికి తనే హాజరుకాలేదు ఒక పెళ్లికొడుకు. ఈ అరుదైన సంఘటన బుధవారం విశాఖ జిల్లా పెద్దగంటాడలోని సమతానగర్ కాలనీలో జరిగింది. వివరాలు..కాలనీకి చెందిన రవికి తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం మల్కిపురం గ్రామానికి చెందిన సంగీతతో ఫిబ్రవరి-14న పెద్దలు నిశ్చితార్థం చేశారు. వీరి పెళ్లి బుధవారం గాజువాకలోని ఒక చర్చిలో జరగాల్సిఉంది. కాగా, అమ్మాయి తరపు బంధువులు బస్సులో చర్చి దగ్గరకు చేరుకున్నారు.
అయితే, వివాహానికి పెళ్లి కొడుకు రాకపోవడంతో అమ్మాయి తరపు బంధువులు ఆందోళన చెందారు. వివరాల కోసం ఆరా తీయగా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతోనే పెళ్లికి రవి హాజరకాలేదని తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు.
సొంత పెళ్లికి పెళ్లికొడుకు డుమ్మా!
Published Wed, Apr 29 2015 8:04 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement
Advertisement