
'హామీలు నిలబెట్టుకోవడంలో బాబు విఫలం'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై సీపీఎం అగ్రనేత బృందాకారత్ మండిపడ్డారు. ఉపాధి హామీకి సంబంధించి ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మౌనవ్రతం చేస్తున్నారని ఆమె విమర్శించారు. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఉపాధి హామీ నిధులను నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన స్థాయిలో ఖర్చుపెట్టలేకపోయిందని బృందాకారత్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చేసేది లేక మౌనవ్రతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నిలక హామీని చంద్రబాబు నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్నారు. అసలు రుణమాఫీని కూడా బాబు అమలు చేయకపోవడం దారుణమన్నారు. పింఛన్ల విధానంలో ఆయన తీరు చాలా విడ్డూరంగా ఉందన్నారు. కుటుంబంలో ఇద్దరుంటే ఒక్కరికే ఇవ్వడం సరికాదని చంద్రబాబు తీరును తప్పుబట్టారు.