తిరుపతి రూరల్: బ్రిటిష్ కాలం నాటి విద్యా వ్యవస్థ నేటికీ ఉండటం మన దౌర్భాగ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. భ్రష్టు పట్టిన విద్యావ్యవస్థను నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతిలో శుక్రవారం నారాయణ విద్యాసంస్థల ఐఐటి, మెడికల్ విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. బ్రిటిష్ కాలం విద్యావ్యవస్థ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు.
విద్యార్థులకు స్వేచ్ఛనిస్తే వారు అనుకున్నది సాధించి చూపుతారన్నారు. కాని 90 శాతం తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు బిడ్డల మనసును గుర్తించకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. దేశానికి నూతనంగా ఆలోచించేవాళ్లు అవసరమని, ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా కృషి చేయాలని చెప్పారు. ఎంత ఎదిగినా సమాజాన్ని మరువవద్దని, మంచిని, మానవ త్వాన్ని పెంచే చదువులు అభ్యసించాలని సూచించారు. స్వా తంత్ర దేశంలో ఇంకా రిజర్వేషన్లు అవసరమా? అని భ గవాన్ అనే విద్యార్థి ప్రశ్నించగా ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగి, చిన్ననాటి నుంచే కుల, మతాలకు అతీ తంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందినప్పుడు రి జర్వేషన్ల అవసరం ఉండదని చెప్పారు. విద్యార్థులకు స్ఫూ ర్తి కలిగించేదుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యా సంస్థల డీజీయం కొండలరావు తెలిపారు. అనంతరం జస్టిస్ చంద్రకుమార్‌ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అకడమిక్ డీన్ శేషంరాజు, ఏజీయంలు శంకరరావు, చంద్రబాబు, ప్రిన్సిపల్స్ రాజశేఖర్, వెంకట చౌదరి, హేమంత్ పాల్గొన్నారు.
బ్రిటిష్ కాలం నాటి విద్యా వ్యవస్థే మన దౌర్భాగ్యం
Published Sat, Dec 27 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement