కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
► మంత్రి పదవి ఊడటం ఖాయం: తమ్మినేని
► ఎస్పీని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలి: జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో కొనసాగుతూ.. హిమాన్‡్ష మోటార్స్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్(9) ప్రకారం మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రైవేటు సంస్థలకు డైరెక్టర్‌గా ఉండకూడదని.. కేటీఆర్‌పై ఫిర్యాదు చేస్తే ఆయన మంత్రి పదవి ఊడ టం ఖాయమన్నారు. ఆదివారం సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో దళితులపై జరిగిన పోలీసుల అకృత్యాలను నిరసిస్తూ సదస్సు నిర్వహిం చారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లా డుతూ... ఎన్నికల హామీలు అమలు చేయ లేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న కారణంతోనే ప్రభుత్వం భయపె డుతుంద న్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాల్లో భాగంగానే హిమాన్‡్ష మోటార్స్ ద్వారా 2000 ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు అందించిందన్నారు. ప్రజలు ఆగ్రహిస్తే పాల కులకు పుట్టగతులుండవని హెచ్చరించారు.
దుర్మార్గంగా వ్యవహరిస్తోంది...
మన రాష్ట్రం మనకు వచ్చిందని భావిస్తే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ అన్నారు. నేరెళ్లలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని, ప్రజాస్వా మ్య హక్కులను కాపాడుకోవాల్సిన అవస రం ఉందన్నారు. బాధితులకు కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురిచేయడం దారుణ మన్నారు.
ఈ వ్యవహారంలో సంబంధిత ఎస్పీని వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ.. నేరెళ్లలో ఉన్న పరిస్థితే యావత్ తెలంగాణలోనూ ఉందన్నారు. అదుపులోకి తీసుకున్న 8మంది యువ కులపై కేసులు ఎత్తివేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, సీపీఐ నాయకు రాలు పశ్య పద్మ, న్యూడెమోక్రసీ నాయకులు టీవీ చలపతిరావు, కె. గోవర్ధన్, ఆర్‌ఎస్పీ నాయకులు జానకి రాములు, ఎస్‌యూసీఐ నాయకులు మురహరి, లిబరేషన్ నాయ కులు గుర్రం విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.