Justice candrakumar
-
కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
► మంత్రి పదవి ఊడటం ఖాయం: తమ్మినేని ► ఎస్పీని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలి: జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో కొనసాగుతూ.. హిమాన్‡్ష మోటార్స్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్(9) ప్రకారం మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రైవేటు సంస్థలకు డైరెక్టర్‌గా ఉండకూడదని.. కేటీఆర్‌పై ఫిర్యాదు చేస్తే ఆయన మంత్రి పదవి ఊడ టం ఖాయమన్నారు. ఆదివారం సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో దళితులపై జరిగిన పోలీసుల అకృత్యాలను నిరసిస్తూ సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లా డుతూ... ఎన్నికల హామీలు అమలు చేయ లేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న కారణంతోనే ప్రభుత్వం భయపె డుతుంద న్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాల్లో భాగంగానే హిమాన్‡్ష మోటార్స్ ద్వారా 2000 ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు అందించిందన్నారు. ప్రజలు ఆగ్రహిస్తే పాల కులకు పుట్టగతులుండవని హెచ్చరించారు. దుర్మార్గంగా వ్యవహరిస్తోంది... మన రాష్ట్రం మనకు వచ్చిందని భావిస్తే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ అన్నారు. నేరెళ్లలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని, ప్రజాస్వా మ్య హక్కులను కాపాడుకోవాల్సిన అవస రం ఉందన్నారు. బాధితులకు కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురిచేయడం దారుణ మన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత ఎస్పీని వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ.. నేరెళ్లలో ఉన్న పరిస్థితే యావత్ తెలంగాణలోనూ ఉందన్నారు. అదుపులోకి తీసుకున్న 8మంది యువ కులపై కేసులు ఎత్తివేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, సీపీఐ నాయకు రాలు పశ్య పద్మ, న్యూడెమోక్రసీ నాయకులు టీవీ చలపతిరావు, కె. గోవర్ధన్, ఆర్ఎస్పీ నాయకులు జానకి రాములు, ఎస్‌యూసీఐ నాయకులు మురహరి, లిబరేషన్ నాయ కులు గుర్రం విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి వల్లే రైతులకు ఈ దుస్థితి
ఈ నెల 10న రైతు సదస్సు: జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: రైతుల ప్రస్తుత దుస్థితికి కారణం అవినీతి అని, అవినీతితో పేరుకుపోయిన రాజకీయాలను యువత కడిగేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2,800 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న రైతులు, భూనిర్వాసితులు, ఆదివాసీల సమస్యలపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సదస్సు పోస్టర్‌ను మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డితో కలసి ఆవిష్కరించారు. గతేడాది కందులు, మిర్చి క్వింటాలుకు రూ.12 వేల వరకు ధర పలకగా, ప్రస్తుతం రూ. 5,500–6000 మధ్య మాత్రమే పలుకుతోందని, దీంతో మిర్చి రైతులు మార్కెట్లోనే పంటను తగలబెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పంటలను కొనుగోలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని విమర్శించారు. రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో దాతల సాయంతో ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతులకు నష్టపరిహారం అందించామని, 10న జరిగే సదస్సులోనూ దాతల సాయంతో పలువురికి నష్టపరిహారం అందిస్తామన్నారు. సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రైతుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తోంది కానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతు సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైతే అల్లకల్లోలం సృష్టించాలని అప్పుడే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి ఆకుల భిక్షపతి, తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షుడు మన్నారం నాగరాజు, సాంబశివుడు, కామేశ్వరరావు, సోగెరాబేగం తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్తదా?
► రైతు అనిపించుకోవడమే అవమానంగా మారింది ► రైతు దీక్షలో టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ► సంఘీభావం తెలిపిన పలు సంఘాలు, మేధావులు సాక్షి, హైదరాబాద్: రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడ్తదా అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ ప్రశ్నించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ‘రైతు దీక్ష’ను ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలా అవమానం జరుగుతున్నదని, రైతు అనిపించుకోవడమే అవమానంగా మారిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతీ రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, సగటున ఒక్కో రైతుపై రూ.93 వేల అప్పు భారం ఉన్నట్టుగా ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని పేర్కొన్నారు. రైతుల పరిస్థితి దీనంగా ఉందని, వారి సమస్యలను ప్రపంచానికి చాటి చెప్పడానికే దీక్ష చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. రుణమాఫీ చేయడం లేదని, బ్యాంకులు కొత్తగా రుణాలను ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ విధానాలు కూడా రైతును కుంగదీస్తున్నాయని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమే వ్యవసాయమని, 60 శాతం మంది దానిపై ఆధారపడి బతుకుతున్నారన్నారు. వ్యవసాయం బాగుంటేనే వ్యాపారాలు నడుస్తాయన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం తేవాలి.. సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలని, విత్తన చట్టం, రైతులకు ఆదాయ భద్రత చట్టం తేవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వానికి, రైతులకు మధ్య సమన్వయానికి అది ఉపయోగపడుతుందన్నారు. విచ్చలవిడిగా భూసేకరణ జరపాలని, అయితే రైతుకు భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు ఇస్తేనే కంపెనీలు వస్తాయని చెప్పడం అవివేకమని దుయ్యబట్టారు. వ్యవసాయ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కోదండరామ్ విమర్శించారు. అనివార్యమైన పరిస్థితుల్లోనే దీక్షకు దిగాల్సి వచ్చిందని, ఇందులో రాజకీయం ఏమీలేదని స్పష్టం చేశారు. మొన్నటి సర్వేతో ఓట్లు పడతాయో లేదో తెలియదు కానీ.. వ్యవసాయం విధానం తెస్తే రైతుల ఓట్లు కచ్చితంగా పడతాయని చెప్పారు. తుగ్లక్ పాలన: జస్టిస్ చంద్రకుమార్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, సీఎం కె.చంద్రశేఖర్‌రావుది తుగ్లక్ పాలన అని విమర్శించారు. ప్రభుత్వానికి రైతుల పట్ల సానుభూతి లేదని విమర్శించారు. నకిలీ విత్తన కంపెనీలకు, దళారులకు ప్రభుత్వమే ఏజెంటుగా పని చేస్తున్నదని ఆరోపించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, సంఘటిత పోరాటాలు లేకపోవడం వల్లే రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, రైతాంగం విచ్ఛిన్నం అవుతున్నదన్నారు. కొత్త అభివృద్ధి నమూనాను రైతాంగ పోరాటాలు ప్రశ్నించేలా ఉండాలన్నారు. రైతులు ఆత్మహత్యలు కొనసాగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. రైతులు నిజాయితీపరులు కావడం వల్లే కేవలం రూ.10 వేల అప్పునకు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ తెలంగాణ కోసం త్యాగాలకు పాల్పడిన వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. భూములను అమ్మేసుకునే పరిస్థితికి తీసుకువచ్చారని, ఇది కేసీఆర్‌కు మంచిది కాదని హెచ్చరించారు. దీక్షకు మాజీ మంత్రి పురుషోత్తమరావు, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్రావు, సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, రైతు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ జలపతిరావు, మాజీ ఎమ్మెల్సీ పి.జనార్దన్ రెడ్డి, మహిళా నేతలు సంధ్య, పశ్యపద్మ, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిడి నర్సింహా రెడ్డి, గుమ్మడి నర్సయ్య, రైతు సంఘం నాయకులు అంజి రెడ్డి, జేఏసీ ముఖ్య నేతలు పిట్టల రవీందర్, జి.వెంకట రెడ్డి, ఇటిక్యాల పురుషోత్తం, పి.రఘు, ఎన్.ప్రహ్లాద్, బీజేపీ నేత ఎన్.వేణుగోపాల్ రెడ్డి, టీవీవీ అధ్యక్షుడు గురజాల రవీందర్ రావు, టీడీపీ ప్రతినిధి డి.పి.రెడ్డి, ప్రొఫెసర్ రమేశ్ రెడ్డి, రమా మెల్కోటె, వివిధ సంఘాల ప్రతినిధులు, నేతలు, మేధావులు, విద్యావంతులు సంఘీభావం ప్రకటించారు. -
ఎల్అండ్ టీ, సర్కారు నిర్లక్ష్యానికి బాలుడు బలి
జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: మెట్రో పిల్లర్ గుంతలో పడి మరణించిన చిన్నారి నరసింహ(9) కుటుం బాన్ని ప్రభుత్వం, మెట్రో అధికారులు ఆదుకోవాలని తెలంగాణ ప్రజావేదిక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ఎల్అండ్టీ అధికారుల నిర్లక్ష్యమే బాలుడిని బలిగొందన్నారు. శుక్రవారం వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఘటనాస్థలాన్ని సందర్శించారు. బాలుడి తల్లి జ్యోతి, అమ్మమ్మలను ఓదార్చారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ మెట్రో పనుల్లో ఎల్అండ్టీ కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, 40 అడుగుల గుంత తవ్వి 9నెలలుగా వదిలే శారన్నారు. రూ.4లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి ఎల్అండ్టీ, ప్రభుత్వం చేతులు దులుపుకున్నాయన్నారు. మరింత ఆర్థిక సహాయం అందించాలని, జ్యోతికి ఎల్అండ్టీలో ఉద్యోగం, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కేటారుుంచాలన్నారు. ప్రజావేదిక ఉపాధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షుడు ఎం నాగరాజు, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి కె.రాజు ఎల్లయ్య మాదిగ, రాష్ట్ర కార్యదర్శి రమేష్ కుమార్ మాదిగ పాల్గొన్నారు. చేతులు కాలాక.. చిన్నారి ప్రాణం బలిగొన్న తర్వాత మెట్రో అధికారులు నిద్ర లేచారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా శుక్రవారం గుంత చుట్టూ ఫెన్సింగ్ ఏర్పా టు చేశారు. ఐరన్ షీట్స్‌తో కంచె వేశారు. ఈ జాగ్రత్తలు ముందే తీసుకుని ఉంటే పసివాడి ప్రాణం బలయ్యేది కాదని స్థానికులు వ్యాఖ్యానించారు. -
నేరాన్ని ప్రోత్సహించిన వారూ నేరస్తులే
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ చంద్రకుమార్ హితవు హైదరాబాద్: ‘అయ్యా సీఎం గారూ చట్టం చదవండి నేరం చేయాలని ప్రోత్సహించిన వారూ నేరస్తులే అవుతారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాపాదయాత్రను అడ్డుకోవాలని సీఎంగా మీరు పిలుపు ఇవ్వడం వల్ల ఘర్షణ చోటుచేసుకుంటుంది. ఈ వ్యాఖ్యలు అనుచితం. వాటిని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలి’ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కోరారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో సామాజిక న్యాయ పాదయాత్రపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా సీఎం మాట్లాడటం సరికాదని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని విమర్శించారు. కేసీఆర్‌లో దొర మనస్తత్వం కనిపిస్తోందని ఇది మంచి పరిణామం కాదన్నారు. తెలంగాణకు కావలి కుక్కలా ఉంటానన్న కేసీఆర్ తోడేలులా దాపురించారని మాజీ ఎంపీ రవీందర్ నాయక్ మండిపడ్డారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ పోరాట సమితి కన్వీనర్ జాన్ వెస్లీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు జి.రాములు, స్కైలాబ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
'వారికి రాజ్యాంగ ఫలాలు దక్కటం లేదు'
సుందరయ్య విజ్ఞాన కేంద్రం స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా నేటికి వికలాంగులకు రాజ్యాంగ ఫలాలు దక్కటం లేదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.పోరాటాల ద్వారానే తమ హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వికలాంగులను సమాజంలో చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ర్టంలో 3 లక్షల మంది వికలాంగ పిల్లలుంటే వారు చదువుకోవటానికి కేవలం 7 పాఠశాలలే ఉండటం బాదాకరం అన్నారు.వికలాంగుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడకుండా వారికి తగిన సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్ధుల సంఖ్యకు అనుగుంగా పాఠశాలలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. వికలాంగులకు అనేక చట్టాలు ఉన్నప్పటికి ఎందుకు అమలు కావటం లేదని ఆయన ప్రశ్నించారు.ప్లోరైడ్‌ను నిర్మూలించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ వేదిక గౌరవ అధ్యక్షులు యం.జనార్ధన్ రెడ్డి, అధ్యక్షులు గోరెంకల నర్సింహా, ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య, మహిళా కన్వీనర్ వరమ్మ, రామకష్ణ, ఆర్.వెంకటేశ్, గణేష్, ఖాజా, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మీరు పండించి రైతులకు చెప్పండి
‘ప్రత్యామ్నాయం’పై సీఎంకు జస్టిస్ చంద్రకుమార్ సూచన సాక్షి, హైదరాబాద్: ప్రత్యామ్నాయ పంట లు వేయాలని సూచిస్తున్న సీఎం, వ్యవసాయ మంత్రి తొలుత వారు ఆ పంటలను పండించి ఆ తరువాత రైతులకు చెప్పాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కోరారు. పత్తి తదితర వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా కంది తర హా చిరుధాన్యాల పంటలను వేసి ఆచరించి చూపాలన్నారు. అలాగే ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం హామీ, మార్కెటింగ్ గ్యారంటీ కల్పించాలన్నారు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, సదరన్ యాక్షన్ ఆన్ జెనెటిక్ ఇంజనీరింగ్ సంస్థలు మంగళవారం ‘తెలంగాణ వ్యవసాయ భవిష్యత్తు’ అంశంపై నిర్వహించిన సదస్సులో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. ‘అధిక ఆదా యం రావడం వల్లే రైతులు పత్తి పంట వేశారే తప్ప మరోటి కాదు. దానికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర వంటి పంటలు వేస్తే మద్దతు ధర ఇస్తారా? హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలకు చిరుధాన్యాలను సరఫరా చేయాలి. అందుకోసం ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయాలి. కల్తీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చి రైతులకు నష్టం చేకూరుస్తున్నాయి. వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్‌గా మారిపోతున్నాయి. భూగర్భ జలాలు పడిపోయాయి. అనేకసార్లు బోర్లు వేయడం, అవి విఫలం కావడం వల్లే రైతు లు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. బహుళజాతి సంస్థలు, ధనికులు లాభపడడమే అభివృద్ధి కాదు. అత్యధిక ప్రజలకుపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలి’ అని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. పత్తి వద్దనడం అంతర్జాతీయ కుట్ర... కేసీఆర్ ప్రభుత్వం పత్తి వద్దని చెప్పడం రైతుల పట్ల ప్రేమతో కాదని... అందులో అంతర్జాతీయ కుట్ర దాగుందని వ్యవసాయరంగ నిపుణులు డి.నర్సింహారెడ్డి అన్నారు. బీటీ-2 విఫలమయినందున దాన్ని ప్రోత్సహిస్తే రైతులు ఊరుకోరని... అందుకే ప్రత్యామ్నాయంగా సోయాబీన్‌ను తెరపైకి తెచ్చారన్నారు. విత్తనాలు రైతుల చేతుల్లో లేవనీ... కంపెనీల చేతుల్లోకి వెళ్లాయని మండిపడ్డారు. ఉర్దూ వర్సిటీ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక 2,200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ‘ఇది బంగారు తెలంగాణ కాదని... బొందలగడ్డ తెలంగాణ’ అన్నారు. సారంపల్లి మల్లారెడ్డి, పీవీ సతీష్, జయశ్రీ, అరిబండ ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నించే స్థితిలో ప్రజలు
రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: ప్రజలు ప్రశ్నించే స్థితికి వచ్చారని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఉస్మానియా భూములు తీసుకుంటానన్నప్పుడు, ఉస్మానియా ఆసుపత్రి, సెక్రటేరియట్ తరలిస్తానన్నప్పుడు ప్రజలు, మేధావులు ఊరుకోలేదని, దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేధావుల సలహాలు తీసుకుని ముందుకు పోవాలని ఆయన సూచించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంశంపై మహారాష్ట్ర, తెలంగాణ చర్చల నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయమై ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చిస్తాననడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. చర్చలు ప్రజల ఒత్తిడి మేరకే జరిపేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ప్రాజెక్టు కాళేశ్వరం వద్ద నిర్మిస్తామని ప్రకటించిన తర్వాత వచ్చిన ఒత్తిళ్లు, నిరసనల వల్లే చర్చలకు సిద్ధమయ్యారని అన్నారు. ఇదే వ్యాప్కోస్ సంస్థ గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చిందని.. తిరిగి అదే సంస్థ మరో రిపోర్ట్ ఇచ్చిందంటే ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఇస్తుందో అర్థంకావడం లేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం అక్కడ పెద్దపెద్ద కాలువలు తవ్వారని, వేల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టారని అన్నారు. ప్రాజెక్టులలో అవినీతి లేకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఇప్పటికే ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఒక్క ప్రాజెక్టులో అవినీతి ఆపితే రైతాంగ సమస్యలు తీర్చవచ్చునని అన్నారు. కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల తెలంగాణ ప్రజలకు సంజీవని వంటిదని అప్పడు ప్రారంభించారని, ప్రస్తుతం దాని డిజైన్ మారుస్తాననడం దారుణమని అన్నారు. మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎండల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది ఇంజనీర్లు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తెలంగాణ ఇరిగేషన్ వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నారని అన్నారు. ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం 1975లో మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిందన్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడు డిజైన్ మారుస్తామని ఎందుకు అంటున్నారో, ఎవరి ప్రయోజనాలకోసం అంటున్నారో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైతు సంక్షేమ సమితి ఉపాధ్యక్షుడు నైనాల గోవర్దన్, ప్రాణహిత చేవెళ్ల పరిరక్షణ కమిటీ ప్రతినిధి ప్రతాప్, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు మన్నారం నాగరాజు, అడ్వొకేట్ శారదాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రిటిష్ కాలం నాటి విద్యా వ్యవస్థే మన దౌర్భాగ్యం
తిరుపతి రూరల్: బ్రిటిష్ కాలం నాటి విద్యా వ్యవస్థ నేటికీ ఉండటం మన దౌర్భాగ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. భ్రష్టు పట్టిన విద్యావ్యవస్థను నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతిలో శుక్రవారం నారాయణ విద్యాసంస్థల ఐఐటి, మెడికల్ విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. బ్రిటిష్ కాలం విద్యావ్యవస్థ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. విద్యార్థులకు స్వేచ్ఛనిస్తే వారు అనుకున్నది సాధించి చూపుతారన్నారు. కాని 90 శాతం తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు బిడ్డల మనసును గుర్తించకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. దేశానికి నూతనంగా ఆలోచించేవాళ్లు అవసరమని, ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా కృషి చేయాలని చెప్పారు. ఎంత ఎదిగినా సమాజాన్ని మరువవద్దని, మంచిని, మానవ త్వాన్ని పెంచే చదువులు అభ్యసించాలని సూచించారు. స్వా తంత్ర దేశంలో ఇంకా రిజర్వేషన్లు అవసరమా? అని భ గవాన్ అనే విద్యార్థి ప్రశ్నించగా ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగి, చిన్ననాటి నుంచే కుల, మతాలకు అతీ తంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందినప్పుడు రి జర్వేషన్ల అవసరం ఉండదని చెప్పారు. విద్యార్థులకు స్ఫూ ర్తి కలిగించేదుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యా సంస్థల డీజీయం కొండలరావు తెలిపారు. అనంతరం జస్టిస్ చంద్రకుమార్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అకడమిక్ డీన్ శేషంరాజు, ఏజీయంలు శంకరరావు, చంద్రబాబు, ప్రిన్సిపల్స్ రాజశేఖర్, వెంకట చౌదరి, హేమంత్ పాల్గొన్నారు.