
ఉలిక్కిపడుతున్న అధికారపక్షం: బుగ్గన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రశ్నించగానే అధికార పక్షం టీడీపీ ఉలిక్కిపడుతోందని డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చను ప్రారంభించిన ఆయన ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడిన లోటును ఎలా భర్తీ చేస్తారో, ఎవరూ భర్తీ చేస్తారనే దానిపై స్పష్టత లేదని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఒక్కరే రాష్ట్రంలో పనిచేస్తున్నారని మంత్రివర్గం, అధికారులు ఎవరూ పనిచేయడం లేదని జరుగుతున్న ప్రచారంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల జరిగే మేలేంటో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుల తీరును బుగ్గన తప్పుబట్టారు. మీడియా ముందుకు వచ్చిన మాట్లాడే సలహాదారులను గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు.