Andhra Pradesh Budget-2015
-
భీకర బైకర్లు!
ట్రాఫిక్ రణగొణధ్వనులతో వాతావరణం ఇప్పటికే కలుషితమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్విచక్రవాహనదారులు సృష్టిస్తున్న భీకర శబ్దాలతో కాలుష్యం మరింతగా పెరుగుతోంది. బైక్‌లకు ఇష్టారాజ్యంగా సైలెన్సర్లు మార్చేసి హల్చల్ చేస్తున్నారు. గుండెలదిరే సౌండ్‌తో మోటార్‌సైకిల్ నడుపుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. చిత్రవిచిత్రమైన ధ్వనులను వెలువరించే వివిధ రకాల పొగ గొట్టాలను తమ వాహనాలకు అమర్చుకుని జనం చెవులుపగలగొడుతున్నారు. ఈ స్థాయి శబ్దాలు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. కోరి వ్యాధులను కొనితెచ్చుకోవడమేనని హెచ్చరిస్తున్నారు.చిత్తూరు అర్బన్: ఇటీవల ఏదో ఆటంబాబు పేలితే వచ్చే పెద్ద పెద్ద శబ్దాలతో ద్విచక్రవాహన చోదకులు కొందరు చేస్తున్న స్టంట్లు ప్రాణాలపైకి తెస్తున్నాయి. రోడ్లపై మితిమీరిన వేగంతో.. చెవులకు చిల్లులు పడే శబ్దాలతో రోడ్లపై కొందరు కుర్రకారు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ద్విచక్రవాహనాలు కొనే సమయంలో కంపెనీ ద్వారా వచ్చే సైలెన్సర్లు (పొగ గొట్టాలు) తొలగించి, వాటి స్థానంలో రోత పుట్టించే వాటిని అమర్చుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రధానంగా ఎన్ఫీల్డ్, కేటీఎం, ఆర్ఎక్స్–100 లాంటి ద్విచక్రవాహనాల్లో ఈ తరహా సైలెన్సర్లను అమర్చుకుని ప్రజల కర్ణభేరితో ఆడుకుంటున్నారు. ఇందుకోసం షార్ట్ బాటిల్. అంగళూర్, డబుల్ బేరల్, రెడ్ రూస్టర్. అబ్బో ఇలాంటి పేర్లు చాలానే ఉన్నాయి. ఇవన్నీ పలు రకాల బైకులకు అమచ్చే సైలెన్సర్ల పేర్లు. బాటిల్ పగులగొట్టినట్లు శబ్దం వస్తే షార్ట్ బాటిల్. అడవి పంది అరచినట్లు శబ్దం వచ్చే పొగ గొట్టానికి వైల్డ్ బోర్ ఎగ్జాస్ట్. తుపాకీ పేలుస్తున్నట్లు శబ్దం వస్తే టెయిల్ గన్నర్. ప్రస్తుతం ఈ తరహా వింత శబ్దాలు చేస్తూ రోడ్లపై తిరిగే ద్విచక్ర వాహనాలతో సామాన్యుల చెవులు పగిలిపోతున్నాయి. పర్యావరణానికీ ఇబ్బంది రాజసం, హోదా ఉట్టి పడేలా ఉండాలని బుల్లెట్ కొనుక్కునేవాళ్లు ఒకరు. కుర్రకారు క్రేజ్‌గా కేటీఎం. 80వ దశకం నాటి ఆర్ఎక్స్–100 పై రోడ్డుపై వెళుతుంటే ఆ హాయే వేరు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు సమస్యంతా రూ.లక్షలు వెచ్చించి కొంటున్న ద్విచక్ర వాహనాల పొగ గొట్టాలను ఇష్టానుసారం మార్చేసి, రోడ్లపై వెళ్లే ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేయడమే. దీనికి తోడు బైకుల నుంచి వచ్చే వింత శబ్దాలతో పర్యావరణానికి కూడా ఇబ్బంది కలుగుతోంది.ఎదుటివారి పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతూ రోత పుట్టిస్తున్న వాళ్లపై పోలీసులు సరైన చర్యలు తీసుకోకుపోతే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా మనం 60 డెసిబెల్స్ శబ్దం వరకు వినగలం. అంతకంటే శబ్దం పెరిగేకొద్దీ ఒక్కో రకమైన వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. చట్టం చెబుతోంది ఇదీ.. ఒక వాహనం సైలెన్సర్ నుంచి నిర్ణీత డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ వస్తే.. అది శబ్ద కాలుష్యం సృష్టించినట్టే. దీనికిగానూ మోటారు వాహన చట్టంలోని యాక్టు 1988 సెక్షన్ 190(2) ప్రకారం పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేయాలి. బైకు నడిపిన వ్యక్తికి రూ.10వేల జరిమానాతో పాటు, కేసు నమోదు చేసి కోర్టుకు పంపాలి. మళ్లీ రెండోసారి శబ్దకాలుష్యానికి కారణమైతే బైకు నడిపిన వ్యక్తికి జైలుశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఇక మోటారు వాహనానికి కంపెనీ ఇచ్చిన భాగాలను మారిస్తే వారిపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 191 ప్రకారం కేసు పెట్టవచ్చు. కొందరు కంపెనీ సైలెన్సర్లు తీసేస్తుంటే, మరికొందరు మఫ్లర్లను తీసేసి తీవ్రమైన శబ్ద కాలుష్యం సృష్టిస్తురు. మూడేళ్ల క్రితం చిత్తూరులో ఈ తరహా సైలెన్సర్లు అమర్చిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. పొగ గొట్టాలను తొలగించి, రోడ్డు రోలర్‌తో తొక్కించారు. రెండోసారి పట్టుబడ్డవారిపై కేసులు నమోదు చేశారు. కానీ ప్రస్తుతం తమ కళ్లెదుటే వింత వింత శబ్డాలు చేస్తూ బైకర్లు వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనారోగ్యం తప్పదు శబ్ద తరంగాలను మన చెవికి కావాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ,వింటే శారీరక, మానసిక వ్యాధులు వస్తాయి. అధిక శబ్దాలను వినడం ద్వారా చెవిలోని నరాలు దెబ్బతిని వినికిడి వ్యవస్థకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. దీంతో శాశ్వతంగా వినికిడి లోపం ఏర్పడుతుంది. పైగా మానసికంగా ఒత్తిడి పెరిగి చిరాకు కలుగుతుంది. ఆ కోపాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసినవాళ్లపై చూపిస్తుంటాం. దీంతో మానవ బంధాలు కూడా దెబ్బతింటాయి. ద్విచక్ర వాహనాలకు ఆయా కంపెనీలు ఇచ్చే సైలైన్సర్లను పెట్టుకోవడమే మంచిది. లేకుంటే ఆనారోగ్యం తప్పదు. – పురుషోత్తం, వైద్య నిపుణుడు, చిత్తూరు ప్రభుత్వాసుపత్రి అధిక శబ్దంతో ముప్పు ఇదీ.. 100డెసిబెల్స్ దాటిన శబ్దం గుండె జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది 110డెసిబెల్స్ చికాకు, చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వణుకు మొదలవుతుంది.120డెసిబెల్స్ చికాకు, కోపంతో భరించలేని తలనొప్పి వస్తుంది. 160డెసిబెల్స్ చెవుల్లోని వినికిడి కణాలు, నరాలు దెబ్బతింటాయి. 190డెసిబెల్స్కర్ణభేరి పగిలిపోతుంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. చర్యలు తీసుకుంటాం సైలెన్సర్లను మార్చేసి ఇష్టానుసారం ప్రజలకు ఇబ్బందులు కలిగే శబ్దాలు చేయడం మంచిదికాదు. అసలు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ వయసులో వాహనాలు ఇవ్వాలో తెలుసుకోవాలి. ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు మార్చకుండా చూసుకోవాలి. ఎంవీ యాక్టు కింద ఇలాంటి వారికి భారీ జరిమానాలు విధిస్తున్నాం. ఇక మెకానిక్‌లు కూడా సైలెన్సర్లను మార్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుని వారిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం. సైలెన్సర్‌ను మార్పు చేయాలని ఎవరైనా మెకానిక్‌ల వద్దకు వస్తే, చేయమని కచ్చితంగా చెప్పండి. చట్ట పరిమితిలో లేని సైలెన్సర్లను విక్రయించేవారిపై కూడా చర్యలు తప్పవు. వీటి వల్ల ఎక్కడైనా ఇబ్బంది వస్తే డయల్–100 నంబర్‌కు సమాచారం ఇవ్వొచ్చు. – మణికంఠ చందోలు, ఎస్పీ, చిత్తూరు -
బంగారం వ్యాపారులపై తుపాకీతో కాల్పులు
చీపురుపల్లిరూరల్(గరివిడి): బంగారు వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వద్ద బుధవారం రాత్రి జరిగింది. గరివిడి ఎస్ఐ ఎల్.దామోదరరావు కథనం ప్రకారం... రాజాం పట్టణంలో నివసిస్తున్న ఇద్దరు బంగారు వర్తకులు రాత్రి 11 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వద్దకు వచ్చేసరికి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని అడ్డగించి దాడి చేశారు. తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వర్తకులు తమ వద్ద ఉన్న బంగారాన్ని సమీపంలో ఉన్న తుప్పల్లోకి విసిరేశారు. వారి నుంచి ఏమీ దొరక్కపోవడంతో సెల్ఫోన్లను లాక్కున్నారు. దుండగలు జరిపిన కాల్పుల్లో ఒక వర్తకుడికి బుల్లెట్ తగిలి ఎడమ చేతికి గాయమైంది. ఆయన రాజాం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం బృందం, డాగ్‌స్క్వాడ్ పరిశీలించాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 7న ఇదే రోడ్డులో గరివిడి మండలం కాపుశంబం కూడలి వద్ద కూడా రాత్రి 12 గంటల సమయంలో చీపురుపల్లి వైపు వెళ్తున్న ఆటోను కొంతమంది వ్యక్తులు ఆపి దాడి చేయడమే కాకుండా వెంటాడి భయాందోళనకు గురిచేశారు. -
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: దేశంలోనూ, రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో సెప్టెంబర్ నెల విద్యుత్ వినియోగం నమోదైంది. జాతీయ స్థాయిలో డిమాండ్‌తో పోటీ పడుతున్నది మన రాష్ట్రం. 2019 సెప్టెంబర్ నెల మొత్తం వినియోగం 4,855.8 మిలియన్ యూనిట్లు కాగా రోజువారీ సగటు డిమాండ్ 161.86 మిలియన్ యూనిట్లుగా ఉంది. అదే ఈ ఏడాది అదే నెల మొత్తం డిమాండ్ 6,550.2 మిలియన్ యూనిట్లుకాగా, రోజువారీ సగటు వినియోగం 218.34 మిలియన్ యూనిట్లకు చేరింది.అంటే మొత్తం వినియోగం ఐదేళ్లలో 1,694.4 మిలియన్ యూనిట్లు, సగటు వినియోగం 56.48 మిలియన్ యూనిట్లు పెరిగింది. విద్యుత్ వినియోగం పెరుగుతున్నదంటే ఆ మేరకు రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెందుతున్నాయని అర్థం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పేదలకు ఉచిత, సబ్సిడీ విద్యుత్‌ను ఇవ్వడంతో పాటు వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల కూడా విద్యుత్ వాడకం పెరిగింది. దీనివల్ల వ్యవసాయం సక్రమంగా జరిగి పంటలు సంవృద్ధి గా పండుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు తమ వృత్తులను నిర్వర్తిస్తూ, విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఆర్థి కంగా స్థిరపడుతున్నారు. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. విదేశీ బొగ్గుకు అనుమతి పొడిగింపు.. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 142 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. గడచిన ఐదేళ్లలో ఇదే గరిష్టం. ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ 238 గిగావాట్లు జరిగితే సెప్టెంబరులో అది 240 గిగావాట్లకు చేరుకుంది. పెరుగుతున్న ఈ డిమాండ్‌ను తీర్చడానికి విద్యుత్ సంస్థలు స్వల్పకాలిక విద్యుత్ మార్కెట్లో తరచుగా విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే ఆగస్టులో బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.9.60 ఉండగా సెప్టెంబర్‌లో యూనిట్ రూ.9.37గా ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ వారం రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో బొగ్గు కొరతను తీర్చేందుకు దిగుమతి చేసుకున్న బొగ్గు (విదేశీ బొగ్గు)ను సమకూర్చుకోవడానికి వచ్చే ఏడాది మార్చి 2024 వరకు కేంద్రం గడువు పొడిగించింది. -
ముగిసిన ముద్రగడ పద్మనాభం రైలు దగ్ధం కేసు విచారణ
-
38 లక్షలకు చేరువలో టెస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 38 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకూ 37,82,746 టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో 59,834 పరీక్షలు చేయగా, 10,368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 84 మంది కోవిడ్‌తో మరణించగా.. ఒక్కరోజే 9,350 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 37,82,746 టెస్టులు జరగ్గా, 4,45,139 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వారిలో 3,39,876 మంది కోలుకున్నారు. 1,01,210 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 4,053కు చేరింది. రాష్ట్రంలో ప్రతి మిలియన్ జనాభాకు 70,838 మందికి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే జనాభా ప్రాదిపతికన ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఐసీఎంఆర్ గణాంకాలు వెల్లడించాయి. -
'అన్నివిధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాదే'
హైదరాబాద్: రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత కొన్ని ఇబ్బందులున్నాయని, కేంద్రం సహకరిస్తే తప్పా నిలదొక్కునే పరిస్థితులు లేవని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో ప్రజలు ఆశలు చిగురించాయన్నారు. శాసనసభలో బుధవారం చంద్రబాబు మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగంపై విపక్ష నేత మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. నాలుగైదు ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్నారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటే నీటి కరువు ఉండదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తూరు, అనంతపురం జిల్లాలకు నీటి సమస్య పరిష్కరిస్తామని చంద్రబాబు హామీయిచ్చారు. -
ఉలిక్కిపడుతున్న అధికారపక్షం: బుగ్గన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రశ్నించగానే అధికార పక్షం టీడీపీ ఉలిక్కిపడుతోందని డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చను ప్రారంభించిన ఆయన ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడిన లోటును ఎలా భర్తీ చేస్తారో, ఎవరూ భర్తీ చేస్తారనే దానిపై స్పష్టత లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఒక్కరే రాష్ట్రంలో పనిచేస్తున్నారని మంత్రివర్గం, అధికారులు ఎవరూ పనిచేయడం లేదని జరుగుతున్న ప్రచారంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల జరిగే మేలేంటో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుల తీరును బుగ్గన తప్పుబట్టారు. మీడియా ముందుకు వచ్చిన మాట్లాడే సలహాదారులను గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. -
నిరూపిస్తే రాజీనామా చేస్తా: కొడాలి నాని
హైదరాబాద్: ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా పేదలకు ఒక్క ఇంటికి కూడా రుణం ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. పేదల కోసం వైఎస్ఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పులిచింతల ప్రాజెక్టు ఘనత వైఎస్ రాజశేఖరెడ్డిదని, ఇప్పుడు పులిచింతల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే వైఎస్ఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేదన్నారు. ఆయన చనిపోయిన రోజే పోలవరం ప్రాజెక్టు చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. పోలవరం చెడగొట్టడానికే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. రుణాలు మాఫీ కాకుండానే సన్మానాలు చేయించుకుంటున్నారని, ఒక్క మహిళకు రుణమాఫీ చేసినట్టు నిరూపించితే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. విభజన చట్టం ప్రకారం రాజధానిని కేంద్రం నిర్మించాలన్నారు. కేంద్రం నిర్మిస్తే తమకేమీ రాదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తామంటోందని ఆరోపించారు. -
మిమ్మల్ని ఎలా కడుగుతానో చూపిస్తా...
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం వాడీవేడిగా జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వుద్దం జరిగింది. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడకపోవటం ఇదే ప్రధమమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని... గత అసెంబ్లీ సమావేశాల్లో సభలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు తాను మైక్ ఇవ్వటం లేదన్న చంద్రబాబు మాటలను గుర్తు చేశారు. దాని బట్టే బడ్జెట్ పై తాను ఎంత మాట్లాడానో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక 2013 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసలు సభలోనే లేరన్నారు. అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ ప్రసంగంలో మిమ్మల్ని కడిగి పారేస్తా... కడిగించుకోండి అని వైఎస్ జగన్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ జగన్ ముందుగా అచ్చెన్నాయుడు మాట్లాడటం ఎలాగో నేర్చుకోవాలని సూచించారు. -
జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయి'
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాబు నెరవేర్చలేదన్నారు. సభలో ప్రతిపక్షం నిరుద్యోగ సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాలు రాకపోగా...దాదాపు 50 వేల మంది ఉన్న ఉద్యోగాలను కోల్పోయారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంతో చర్చకు రాలేకే తమ వాయిదా తీర్మానాలను తిరస్కరించారని విమర్శించారు. ప్రాధాన్యత గల అంశాలను సభలో చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. -
'మా పార్టీ గొంతు నొక్కేస్తున్నారు'
హైదరాబాద్ : ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ఎండగడతామనే.... ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ గొంతును బలవంతంగా నొక్కేస్తుందని చిత్తూరు జిల్లా చంద్రగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి ఓట్లు వేసినందుకు.... లక్షలాది మంది యువత అన్యాయమైపోయారన్నారు. అసెంబ్లీ అయిదు నిమిషాల వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన చెవిరెడ్డి.....యువత ఓట్లతో చంద్రబాబు, ఆయన అనుచరవర్గం మాత్రమే బాగుపడిందని ఎద్దేవా చేశారు. -
అసెంబ్లీ ప్రారంభం, ఐదు నిమిషాలు వాయిదా
విపక్ష సభ్యుల నిరసనలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అయిదు నిమిషాలపాటు వాయిదా పడింది. బుధవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే వైఎస్ఆర్ సీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దాంతో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు అనుమతించాలంటూ విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. అయినా స్పీకర్ చర్చకు అనుమతించకపోవటంతో సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నినాదాలతో సభ దద్దరిల్లింది. మరోవైపు సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. సభలో తీవ్ర గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను అయిదు నిమిషాలు వాయిదా వేశారు. -
ఉద్యోగాల భర్తీపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వానికి క్లారిటీ ఉందా: బుగ్గన
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ అంశంపై ప్రభుత్వానికి క్లారిటీ ఉందా అని కర్నూలు జిల్లా డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం సరైన అధ్యయనం చేసినట్టు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. గణాంకాలు, నివేదికల సహితంగా బుగ్గన అనేక అంశాల్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన చర్చ ప్రారంభించారు. -
అసలు జగన్ ఏం చేశాడు....
హైదరాబాద్ : కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా బీజేపీతో ఎందుకు పొత్తును కొనసాగిస్తోందని విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రశ్నించారు. టీడీపీకి చేతగాక అనవసరం విపక్షంపై ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. ప్రతి విషయానికి పార్టీ అధ్యక్షుడే మీడియా ముందుకు రారని...పార్టీ ప్రతినిధి కూడా మాట్లాడతారన్నారు. ఈ సంప్రదాయం అన్ని పార్టీల్లోనూ ఉందని వైఎస్ జగన్ అన్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు మీడియా పిచ్చి ఉంది కాబట్టే ప్రెస్‌మీట్ పెట్టారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. దమ్ము, ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు. తాము ఢిల్లీ వెళితే ఆరోపణలు... చేయటం..వెళ్లకపోతే ఆరోపణలు ...అన్నిటికీ జగన్నే కారణం అనటం... మళ్లీ జగన్ పట్టించుకోవటం లేదంటూ ఆరోపణలు చేయటం ...ఇదంతా చూస్తుంటే అసలు జగన్ ఏం చేశాడంటూ ఆయన ప్రశ్నించారు చేసింది చేసి మళ్లీ ఎంత చక్కటి డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా టీడీపీ మంత్రులపై మండిపడ్డారు. మంత్రులు చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పటం చూస్తుంటే...చంద్రబాబు నాయుడుగారు మంత్రులకు ట్యూషన్లు బాగా చెబుతున్నారన్నారు. ఈ విషయంలో చంద్రబాబు గోబెల్స్‌ను మించిపోయారన్నారు. కేంద్ర మంత్రులను కూడా కలవటం తప్పుబట్టడం సరికాదని, తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర నాయకులను కలిసినప్పుడు ఏదో జరిగిందని ఊహించుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసినప్పుడు తాను ఏం మాట్లాడింది యనమల రామకృష్ణుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ విన్నారా అని వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. -
మా నాయకుడ్ని చూసి గర్వపడుతున్నా: బుగ్గన
హైదరాబాద్ : శాసనసభలో ఎంతో హుందాగా ప్రవర్తించిన తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి ఎంతో గర్వపడుతున్నానని డోన్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో మాట్లాడుతూ తమ నాయకుడు సభలో ఎంతో హుందాగా ఉన్నారన్నారు. ప్రతిపక్షానికి సమయం ఎలా కేటాయిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. మాట్లాడేందుకు తమ నాయకుడు అడిగింది అయిదు నిమిషాలే అని అది కూడా మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణాల అంశంపైనే అని బుగ్గన అన్నారు. -
చంద్రబాబు మహిళా ద్రోహి: రోజా
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఏరు దాటక ముందు ఏటి మల్లన్న...ఏరుదాటాక ఓటి మల్లన్న' అన్నట్లు ఎన్నికల ముగిసిన తర్వాత డ్వాక్రా మహిళలను చంద్రబాబు రోడ్డున పడేశారని ఆమె అన్నారు. డ్వాక్రా మహిళలను డబ్బులిచ్చి మరీ సమావేశాలకు తీసుకు వచ్చే చంద్రబాబు అధికారంలోకి వచ్చాకా వారిని విస్మరించారన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ అనంతరం రోజా మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీపై చర్చించడానికి టీడీపీకి దమ్ము, ధైర్యం లేదని అన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ అంశాన్ని చర్చించాలని తాము డిమాండ్ చేస్తే...ఇప్పుడు ఆ అంశం అంత ముఖ్యమా అని అసహనం వ్యక్తం చేస్తుంటే...ఆడపడుచులంటే వీరికి అంత చులకనా అనే భావం కలుగుతుందన్నారు. చంద్రబాబు మహిళా ద్రోహి, రాష్ట్రంలో మహిళ వ్యతిరేక ప్రభుత్వం ఉందని రోజా అన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ అని మేనిఫెస్టోలో పెట్టారని, అయితే రాష్ట్రంలో ఎటువంటి పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. టీడీపీ నేతలకు మహిళల కన్నీళ్లు కనిపించడం లేదా అని రోజా సూటిగా ప్రశ్నించారు. డ్వాక్రా రుణమాఫీ జరిగేంతవరకు టీడీపీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు. -
సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. సభలో చర్చించేందుకు తమకు సమయం ఇవ్వనందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం వాయిదాల పర్వం కొనసాగింది. డ్వాక్రా రుణాలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో సమావేశాలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం అయినా వైఎస్ఆర్ సీపీ తన పట్టు వీడలేదు. -
ఐదు నిమిషాలు కేటాయిస్తే ఏమైనా నష్టమా?
హైదరాబాద్ : డ్వాక్రా రుణాలపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించేందుకు ఐదు నిమిషాలు కేటాయిస్తే ఏమైనా నష్టం జరుగుతుందా అని విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అయిదు నిమిషాలు సమయం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేరంటే ఇది కౌరవ సభ అని చెప్పడానికి వేరే కారణాలు కనిపించడం లేదన్నారు. కాగా డ్వాక్రా రుణాలపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు మంగళవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. తిరస్కరించిన తీర్మానంపై చర్చకు అవకాశముండదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డ్వాక్రా రుణాలకు సంబంధించిన వివరాలు సభ ముందుంచారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని వైఎస్ జగన్ చెబుతుండగా మరోవైపు అధికార పార్టీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని, ఇప్పటివరకు రూ.1000 కోట్ల డ్వాక్రా రుణామలు మాత్రమే రెన్యువల్ అయ్యాయన్నారు. ముఖ్యమైన అంశంపై చర్చించడానికి 5 నిమిషాల సమయం కూడా ఇవ్వరా అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ ఏడాది బ్యాంకులు రూ.2 వేల కొత్త రుణాలు మహిళలకు ఇచ్చాయన్నారు. జగన్ వివరాల్లోకి వెళ్తున్నారంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు పొడియంలోకి వచ్చి స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. -
గంటలోపే రెండుసార్లు వాయిదా..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గంటలోపే రెండుసార్లు వాయిదా పడ్డాయి. నినాదాలు, విమర్శలతో మూడో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూనే పది నిమిషాలు వాయిదా పడ్డాయి. డ్వాక్రారుణాల మాఫీ చేస్తామన్న హామీపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాయిదాతీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాలను స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో చర్చకు పట్టుబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై చర్చించాలని రూల్ 344 కింద నోటీసు ఇచ్చారు. డ్వాక్రా మహిళల ఉద్యమానికి మూలకారకుడు చంద్రబాబు అని, డ్వాక్రా మహిళల గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు లేదంటూ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై చర్చ కాకుండా రచ్చ చేయడానికే ప్రతిపక్షం నేతలు వస్తున్నట్లుంది అంటూ ఆయన వ్యాఖ్యానించడంతో వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో పది నిమిషాలు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా ప్రతిపక్షం మాత్రం తన పట్టువీడలేదు. చర్చకు అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది. దాంతో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా సభకు అంతరాయం కలగటంతో స్పీకర్ సభను రెండోసారి పదినిమిషాల పాటు వాయిదా వేశారు. -
చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, అసెంబ్లీ వాయిదా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ సీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దాంతో డ్వాక్రా రుణాల మాఫీపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. మహిళాద్రోహి చంద్రబాబు అంటూ సభ్యులు పెద్ద ఎత్తున సభలో నినాదాలు చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమ పట్టు వీడలేదు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సమావేశాలను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.