'అన్నివిధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాదే'
హైదరాబాద్: రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత కొన్ని ఇబ్బందులున్నాయని, కేంద్రం సహకరిస్తే తప్పా నిలదొక్కునే పరిస్థితులు లేవని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో ప్రజలు ఆశలు చిగురించాయన్నారు.
శాసనసభలో బుధవారం చంద్రబాబు మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగంపై విపక్ష నేత మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. నాలుగైదు ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్నారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటే నీటి కరువు ఉండదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తూరు, అనంతపురం జిల్లాలకు నీటి సమస్య పరిష్కరిస్తామని చంద్రబాబు హామీయిచ్చారు.