
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 38 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకూ 37,82,746 టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో 59,834 పరీక్షలు చేయగా, 10,368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 84 మంది కోవిడ్‌తో మరణించగా.. ఒక్కరోజే 9,350 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 37,82,746 టెస్టులు జరగ్గా, 4,45,139 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
వారిలో 3,39,876 మంది కోలుకున్నారు. 1,01,210 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 4,053కు చేరింది. రాష్ట్రంలో ప్రతి మిలియన్ జనాభాకు 70,838 మందికి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే జనాభా ప్రాదిపతికన ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఐసీఎంఆర్ గణాంకాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment