ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది.
హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.