ఏపీటీడీసీలోకి దూసుకుపోయిన బస్సు
అనంతగిరి(అరకులోయ): ప్రముఖ పర్యాటక కేంద్రామైన బొర్రాగుహల వద్ద బ్రేకులు ఫెయిలై ఓ బస్సు రెస్టారెంట్‌లో దూసుకుపోయింది. ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. అరకులోయ స్పోర్ట్స్ పాఠశాలలో జరుగుతున్న వేసవి శిక్షణలో పాల్గొనేందుకు రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులు వచ్చారు. బొర్రాగుహలను తిలకించేందుకు సుమారు వందమంది విద్యార్థులు పాడేరు ఐటీడీఏకి చెందిన రెండు బస్సుల్లో బయలుదేరారు. సోమవారం ఉదయం బొర్రాగుహలను తిలకించిన అనంతరం తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో అందులో ఓ బస్సు బ్రేకులు ఫెయిలై వెనక్కి జారిపోయి ఏపీటీడీసీ రెస్టారెంట్‌లోకి దూసుకుపోయింది. ఈ సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. రెస్టారెంట్‌లో ఉన్న కుక్, ఇద్దరు గైడ్స్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. రెస్టారెంట్ వద్ద నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. రెస్టారెంట్ లేకపోయి ఉంటే గోస్తానది లోయలోకి బస్సు జారిపోయి పెద్ద ప్రమాదమే జరిగేది.
Comments
Please login to add a commentAdd a comment