బంగారం వ్యాపారాలకు నోటు ఎఫెక్టు | Businesses to note the effects of gold | Sakshi
Sakshi News home page

బంగారం వ్యాపారాలకు నోటు ఎఫెక్టు

Published Sun, Nov 27 2016 2:41 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

బంగారం వ్యాపారాలకు నోటు ఎఫెక్టు

బంగారం వ్యాపారాలకు నోటు ఎఫెక్టు


10 గ్రాములపై  రూ.2,550 తగ్గుదల
కొనుగోళ్లులేక రూ.17 కోట్ల నష్టం
మరో నెల తప్పని సంక్షోభం

‘నోటు’ పాట్లతో పసిడి వెలుగు  మసకబారింది. స్వర్ణం ధర కిందికి దిగుతోంది. నగల షాపులు వెలవెలబోతున్నారుు. 17 రోజులుగా పసిడి వర్తకులు కొనుగోళ్లు లేక డీలా పడుతున్నారు. ఫలితంగా ఈ పక్షం రోజుల్లో బంగారం ధరలు దిగిరాక తప్పలేదు. వాణిజ్య విపణిలో 10 గ్రాములపై రూ.2,550 తగ్గుదల నమోదైంది. మరో నెలరోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని తెలుస్తోంది.

తిరుపతి (అలిపిరి): పెద్ద నోట్ల రద్దు జిల్లా బంగారు వ్యాపారాన్ని తలకిందులు చేసింది. కోనుగోలుదారులు లేక జ్యువెలరీ షాపులు వెలవెలబోతున్నారుు. వెరుు్యని చెల్లని నోటుగా ప్రకటించడం బంగారు వ్యాపార రంగాన్ని మరింత కుదిపేసింది. మరోవైపు గోల్డ్ కొనుగోళ్లపై ఐటీ అధికారులు ఆంక్షలు విధించడంతో 17 రోజులుగా వ్యాపారం లేదు. జిల్లాలో గుర్తింపు పొందిన 450 బంగారు దుకాణాల్లో నిత్యం రూ.కోటిమేర వ్యాపారం జరుగుతుంది. నోట్ల రద్దు ప్రభావంతో కొనుగోళ్లు 10 శాతానికి పడిపోయాయని వ్యాపారులే చెబుతున్నారు. నోట్ల రద్దు తర్వాత జిల్లాలో బంగారు వ్యాపార రంగం రూ.17 కోట్లమేర నష్టాన్ని చవిచూడాల్సివచ్చిందని అంచనా. ఈ నెల 10వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,600గా నమోదైంది. నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో దీని ధర శనివారం నాటికి రూ.28,050కి పడిపోరుుంది. 10 గ్రాముల బంగారంపై రూ.2,550 తగ్గుదల నమోదమైంది. ఒక వైపు బంగారు ధరలు పతనం కావడం.. మరో వైపు జిల్లాలో నోటు కష్టాలు కొనసాగుతుండడం వంటి కారణాలతో బంగారు వ్యాపారులు ఎదురీదాల్సిన పరిస్థితులు నెలకొన్నారుు.

స్వైపింగ్ కష్టాలు: పెద్ద నోట్లతో లావాదేవీలు జరపకూడదని కేంద్రం బంగారు వ్యాపార రంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో వ్యాపారులు కష్టాల్లో కూరుకుపోయారు. స్వైపింగ్ మిషన్ల ద్వారా కొనుగోళ్లకు ప్రజలు రాకపోవడంతో వ్యాపారం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వ్యాపారం పూర్తిగా పడిపోరుుంది కొనుగోలు దారులు లేక వ్యాపారం పూర్తిగా పడిపోరుుంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. స్వైపింగ్ మిషన్ ద్వారా లావాదేవీలు కొనసాగించవచ్చని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ దీని ద్వారా కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. కొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement