కొత్తగా సాధించింది ఏంటి చంద్రబాబు : రామచంద్రయ్య | C Ramachandraiah fires on Chandrababu | Sakshi
Sakshi News home page

కొత్తగా సాధించింది ఏంటి చంద్రబాబు : రామచంద్రయ్య

Published Tue, Feb 12 2019 2:27 PM | Last Updated on Tue, Feb 12 2019 4:18 PM

C Ramachandraiah fires on Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ దీక్ష అనేది తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకోసమేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సీ రామచంద్రయ్య అన్నారు. తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలను పార్టీ డబ్బుతో నిర్వహించుకోవాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రామచంద్రయ్య మాట్లాటుతూ.. 'ఎన్టీఆర్ ట్రస్ట్ రిచ్గానే ఉందికదా. ప్రభుత్వ ధనం దేనికి. పెయిడ్ఆర్టిస్ట్లను తాబేదార్లను తీసుకువెళ్లి ప్రచారం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రభుత్వ ఖజానానుంచి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి పచ్చమీడియా ప్రతినిధులను సైతం తీసుకువెళ్లి వారికి ఖరీధైన వసతి కల్పించి ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు విషయం తెలుసు కాబట్టే కామ్రెడ్లు ఢిల్లీ వెళ్లలేదు. చంద్రబాబు ఏంటి డ్రామాలు? నిన్న నీ దగ్గరకు వచ్చిన పార్టీలన్నీ పార్లమెంట్‌లో మన ఏపీ డిమాండ్‌లపై మధ్దతు ఇచ్చిన వారే. కొత్తగా నువ్వు సాధించిందేంటి?


కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టినపుడు మధ్దతు పలికినవారే ఇప్పుడు వచ్చినవారు కూడా. ఏఐసీసీ కోశాధికారిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంతోపాటూ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పలు రాష్ట్రాలలో తన వల్లే గెలుపు జరిగిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. చంద్రబాబుతో కలసి తిరిగేందుకు రాహుల్‌కు పౌరుషం ఉందా? రాహుల్ తల్లిని, వంశాన్ని చంద్రబాబు తిట్టిన విషయం మరిచిపోయారా? కేవీపీ రామచంద్రరావు ఆందోళన చేసిన సందర్భంలో టీడీపీ సభ్యులు ఒక్కరు కూడా నోరుమెదపలేదు. రాహుల్ గాంధీని చూసి నవ్వాలో ఏడ్వాలో నాకు అర్దం కావడంలేదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు గుంటూరు వస్తే గోబ్యాక్ అని చంద్రబాబు రాళ్లు వేయించారు. కాంగ్రెస్ వారిని అరెస్ట్ చేయించారు. ఇవన్నీ తెలిసి చంద్రబాబుతో కలిశారంటే రాహుల్‌కు దేశాన్ని, కాంగ్రెస్‌ను నడిపించే మెచ్యూరిటి ఉందా? స్పెషల్ ప్యాకేజీ చంద్రబాబు కోరుకున్నారు తప్పితే వేరెవరు కాదు' అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement